newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

ఆర్టీసీ కార్మికుల‌ ఆశ‌ల‌న్నీ ఢిల్లీపైనే..!

23-11-201923-11-2019 08:14:59 IST
Updated On 23-11-2019 17:55:41 ISTUpdated On 23-11-20192019-11-23T02:44:59.426Z23-11-2019 2019-11-23T02:44:26.383Z - 2019-11-23T12:25:41.149Z - 23-11-2019

ఆర్టీసీ కార్మికుల‌ ఆశ‌ల‌న్నీ ఢిల్లీపైనే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జీవితాలు ఆగ‌మ్య‌గోచ‌రంగా త‌యార‌య్యాయి. ఉద్యోగాలు చేస్తామ‌న్నా ప్ర‌భుత్వం తీసుకునేందుకు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో కార్మికుల్లో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. 48 వేల కార్మికులు 48 రోజుల పాటు జ‌రిపిన స‌మ్మెకు ప‌రిష్కారం దొర‌క‌క‌పోగా కార్మికుల‌కే న‌ష్టం జ‌రిగేలా ఉంది.

స‌మ్మెను విర‌మిస్తామ‌ని, ఉద్యోగాల్లో చేరుతామ‌ని ఆర్టీసీ జేఏసీ చెప్పినా ప్ర‌భుత్వం ఇందుకు అంగీక‌రించ‌లేదు. మ‌రోవైపు కార్మికులు విధుల్లో చేరేందుకు డిపోల వ‌ద్ద‌కు వెళుతున్నా వారిని చేర్చుకోవ‌డం లేదు.

అక్టోబ‌రు 5న ప్ర‌భుత్వంతో జ‌రిపిన చ‌ర్చ‌లు విఫ‌లం కావ‌డంతో ఆర్టీసీ జేఏసీ స‌మ్మెకు పిలుపునిచ్చింది. ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌నే ప్ర‌ధాన డిమాండ్‌తో పాటు 26 డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం ముందు ఉంచింది.

అయితే, కార్మికుల స‌మ్మెను ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. స‌మ్మెకు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌లొగ్గొద్ద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నారు. కార్మికుల‌ను బేష‌ర‌తుగా విధుల్లో చేరాల‌ని ఆయ‌న మూడుసార్లు ఆఫ‌ర్ ఇచ్చినా కార్మికులు వెన‌క్కు త‌గ్గ‌లేదు.

అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు, ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆర్టీసీ కార్మికుల‌కు అండ‌గా నిల‌వ‌డం, హైకోర్టులో త‌మ‌కు అనుకూలంగా తీర్పు వ‌స్తుంద‌నే ఆశ‌తో ఆర్టీసీ జేఏసీ స‌మ్మెపై వెన‌క్కు త‌గ్గ‌లేదు.

కార్మికులు సైతం ఐక్యంగా ఆర్టీసీ జేఏసీ మాట‌పై నిల‌బ‌డ్డారు. రెండు నెల‌లుగా జీతాలు లేక‌పోయినా స‌మ్మె కొన‌సాగించారు. అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇంత జ‌రిగినా ప్ర‌భుత్వం క‌ఠినంగా ఉండ‌టంతో కార్మికుల్లో ఆందోళ‌న మొద‌లైంది.

మ‌రోవైపు హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు సిద్ధ‌ప‌డ‌కపోవ‌డం కార్మికుల్లో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది. దీంతో స‌మ్మె విర‌మిస్తామ‌ని, బేష‌ర‌తుగా విధుల్లోకి చేర్చుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని విన‌వించింది. అయినా ప్ర‌భుత్వం స్పందించ‌లేదు. విధుల్లో చేరేందుకు కార్మికులు డిపోల వ‌ద్ద‌కు వెళుతున్నా ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేక‌పోవ‌డంతో వారికి నిరాశే ఎదురైంది.

మ‌రోవైపు కార్మిక సంఘాల్లో విభేదాలు మొద‌ల‌య్యాయి. అశ్వ‌త్థామ‌రెడ్డి నేతృత్వంలోని జేఏసీ విధానాన్ని మ‌రో జేఏసీ విభేదిస్తోంది. అశ్వ‌త్థామ‌రెడ్డి వైఫ‌ల్యంతోనే కార్మికుల జీవితాలు ఆందోళ‌న‌లో ఉన్నాయ‌ని కొన్ని కార్మిక సంఘాల నేత‌లు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కార్మికులు సైతం అశ్వ‌త్థామ‌రెడ్డికి వ్య‌తిరేకంగా నిర‌స‌న కూడా తెలిపారు. దిష్ఠిబొమ్మ‌ను సైతం ద‌హ‌నం చేశారు.

ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో ఆర్టీసీ జేఏసీ స‌మ్మెను కొన‌సాగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మ‌రోవైపు 5100 రూట్ల ప్రైవేటీక‌ర‌ణ‌కు లైన్ క్లియ‌ర్ అయ్యింది. ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా దాఖ‌లైన పిటీష‌న్ల‌ను హైకోర్టు కొట్టివేసింది.

దీంతో ఆర్టీసీ కార్మికులు త‌మ ఉద్యోగాల‌పై తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్నారు. జేఏసీ నేత‌ల‌కు సైతం ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని అంతుచిక్క‌ని ప‌రిస్థితి ఉంది.

ఈ స‌మ‌యంలో వారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనే ఆశ‌లు పెట్టుకున్నారు. కేంద్రం జోక్యం చేసుకుంటేనే త‌మకు భ‌రోసా ద‌క్కుతుంద‌ని వారు ఆశిస్తున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ నేత‌లు సైతం ఈ విష‌యంలో స్పీడ్ పెంచారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిని క‌లిసి రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ సొమ్మును వాడుకుంద‌ని ఫిర్యాదు చేశారు.

మ‌రోవైపు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రి కూడా ముఖ్య‌మంత్రితో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు చెబుతున్నారు. హైకోర్టులో త‌మ‌కు అనుకూలంగా తీర్పు రాక‌పోవ‌డం,  రాష్ట్ర ప్ర‌భుత్వం ఉద్యోగాలు ఇచ్చేందుకు సంసిద్ధ‌త తెల‌ప‌క‌పోవ‌డంతో ఆర్టీసీ కార్మికులు కేంద్రంపై ఆశ‌తో చూస్తున్నారు.

 

 

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   6 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   7 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   9 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   10 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   10 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   11 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   14 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   14 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   15 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   16 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle