newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

20-11-201920-11-2019 15:05:36 IST
2019-11-20T09:35:36.372Z20-11-2019 2019-11-20T09:35:32.923Z - - 25-02-2020

ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తో అఖిలపక్ష నేతలు భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఆమెతో చర్చించారు. సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని గవర్నర్ వారికి హామీఇచ్చారు.

అనంతరం బీజేపీ నేత మోహనరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్‌గా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరామన్నారు. హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించు కోలేదన్నారు. కార్మికులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని, ఆర్టీసీ సమ్మెపై త్వరలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలుస్తామని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె ప్రారంభమై 47 రోజులు అవుతున్నా సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణం అన్నారు. ఆర్టీసీ కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయని, వారి కుటుంబాల గురించి ప్రభుత్వం ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో... దీనిపై జోక్యం చేసుకోవాలని ఆమె గవర్నర్ ని కోరారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి విపక్షాలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని ఐఏఎస్ అధికారి కోర్టుకు అఫిడవిట్ ఇవ్వడాన్ని గీతారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.విలీనంపై కార్మికులు వెనక్కితగ్గినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. 

తక్షణం ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలని చాడ వెంకటరెడ్డి కోరారు. కార్మికులు ఎప్పుడు సమ్మె విరమించినా, వారిని విధుల్లోకి తీసుకోవాలని టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు.

మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమస్యను పార్లమెంటులో లేవనెత్తారు కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్. ఈ సమస్యపై కేంద్రం వెంటనే స్పందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే త్వరలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని అఖిలపక్షం నేతలు కలవనున్నారు 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle