newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

‘‘ఆర్టీసీ కార్మికులది పిచ్చి పంథా, దిక్కుమాలిన సమ్మె’’

24-10-201924-10-2019 16:39:05 IST
Updated On 24-10-2019 16:39:14 ISTUpdated On 24-10-20192019-10-24T11:09:05.653Z24-10-2019 2019-10-24T11:09:01.312Z - 2019-10-24T11:09:14.958Z - 24-10-2019

‘‘ఆర్టీసీ కార్మికులది పిచ్చి పంథా, దిక్కుమాలిన సమ్మె’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. వారు ఎంచుకున్నది పిచ్చి పంథా అని మండిపడ్డారు. భేషజాలకు పోకుండా మేం పరిపాలన సాగిస్తున్నామన్నారు. బడ్జెట్లో ఆర్థిక మాంద్యం గురించి అబద్ధాలు చెప్పలేదన్నారు. త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయన్నారు. లక్ష్యానికి చేరుకోవడానికి వెళ్ళే దారులు అపసవ్యంగా ఉండకూడదన్నారు కేసీఆర్. ఆర్టీసీ అంటే తనకెంతో అభిమానం ఉందన్నారు. ఆర్టీసీకి అన్ని విధాలా సహకరించానన్నారు సీఎం కేసీఆర్.

రవాణాశాఖపై తనకున్న అవగాహన ఎవరికీ లేదన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ ఆర్థిక పరిస్థితికి మించి ఫిట్ మెంట్ ఇచ్చామన్నారు. దేశంలో ఏ రవాణాసంస్థలోనూ జీతాలు ఇంతగా పెంచిన చరిత్ర లేదన్నారు. ఆర్టీసీ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరవద్దన్నారు. ఎవరినీ బడితే వారిని ప్రభుత్వంలో కలపడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వానికి పద్దతి ఉంటుందన్నారు.

50 వేలమందికి పైగా కార్మికులను తెలంగాణ ప్రభుత్వంలో కలపడం అర్థంపర్థం లేనిదన్నారు సీఎం కేసీఆర్. పనికిమాలిన రాజకీయ పార్టీలు వారికి మద్దతు తెలపడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో 57 కార్పోరేషన్లు ఉన్నాయని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మిగతా కార్పోరేషన్లను ఏంచేయాలన్నారు. నాలుగేళ్లలో 67 శాతం జీతాలు పెంచామన్నారు కేసీఆర్. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి అవకాశం లేదన్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీని తీసేశారన్నారు. 44 శాతం ఫిట్ మెంట్, 15 శాతం ఐఆర్ ఇచ్చామన్నారు. ఆర్టీసీ సమ్మెను తీవ్రంగా విమర్శించారు కేసీఆర్.

కార్మికులకు ఆలోచన లేదు. దిక్కుమాలిన సమ్మె. చిల్లరమల్లర రాజకీయం తప్ప ఇదేం కాదన్నారు. ఆర్టీసీకి రూ 5 వేల కోట్లరూపాయల అప్పులు ఉన్నాయన్నారు. మధ్యప్రదేశ్ లో ఆర్టీసీని మూసివేశారు. పశ్చిమబెంగాల్లోనూ అదే పరిస్థితి ఉందన్నారు. పీఎఫ్ సొమ్ము ప్రభుత్వం తీసుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు. 

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   4 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   5 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   6 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   7 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   8 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   8 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   10 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   10 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   10 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle