newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

ఆర్టీసీ కార్మికులకు వరాలు.. ప్రయాణికులపై ఛార్జీల బాదుడు

02-12-201902-12-2019 08:52:08 IST
Updated On 02-12-2019 14:26:41 ISTUpdated On 02-12-20192019-12-02T03:22:08.942Z02-12-2019 2019-12-02T03:21:45.960Z - 2019-12-02T08:56:41.571Z - 02-12-2019

ఆర్టీసీ కార్మికులకు వరాలు.. ప్రయాణికులపై ఛార్జీల బాదుడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఎం కేసీఆర్ మదిలో ఏముంది?

ఆర్టీసీ సమ్మెపై అప్పుడో మాట.. ఇప్పుడో మాట

ఆర్టీసీ సమ్మె కాలంలో జీతాల చెల్లింపునకు ఓకె

ఎవరన్నారు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విఫలమయ్యిందని?

ఆర్టీసీ కార్మికులపై అప్పుడు శాపనార్ధాలు.. ఇప్పుడు ప్రశంసలు

ప్రైవేటీకరణపై హైకోర్టు సానుకూల తీర్పు

ఒక్క సంతకంతో ఆర్టీసీ క్లోజ్ చేస్తానన్న కేసీయార్

తాజాగా ప్రైవేటీకరణ లేదని ప్రకటన

కేసీయార్ తీరుపై కార్మికుల కన్ ఫ్యూజన్ 

తెలంగాణ సీఎం కేసీయార్ ఫక్తు రాజకీయవేత్త. ఎప్పుడు ఏం మాట్లాడాలో ఆయనకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. ఆర్టీసీ విషయంలో కేసీయార్ విమర్శలు ఉద్యోగులను భయపెట్టాయనే చెప్పాలి. సెల్ప్ డిస్మిస్ పదం వాడి ఆర్గీసీ కార్మికుల సమ్మెపై అస్త్రం ప్రయోగించారు. ఈ అస్త్రం కార్మికుల గుండెల్లో రై్ళ్ళు పరిగెట్టించింది. 52 రోజుల పాటు సమ్మె చేసినా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పట్టుబట్టినా కేసీయార్ కరగలేదు. ఆర్టీసీ జేఏసీ మధ్యలోనే అసలు డిమాండ్ అయిన ప్రభుత్వంలో విలీనం అంశాన్ని పక్కకు పెట్టాల్సి వచ్చింది. తర్వాత సమ్మె విరమిస్తామని విధుల్లోకి చేర్చుకోవాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరారు. కానీ కేసీయార్ వారిని పట్టించుకోలేదు. చివరకు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు కూడా తాత కేసీయార్ గారూ.. ఉద్యోగాల్లో చేర్చుకోండి అని కోరాల్చి వచ్చింది. 

చివరాఖరికి కొంతమంది ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. ఆర్టీసీపై సమీక్షల మీద సమీక్షలు నిర్వహించారు. తర్వాత ఆయన ఊహించని నిర్ణయం తీసుకున్నారు.  ఈ నిర్ణయంతో 52 రోజులుగా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆయన చూపించిన కోపం, ఆగ్రహం, సెల్ప్ డిస్మిస్ అన్నీ తెరమరుగయ్యాయి, ఆయన చూపించిన ఔదార్యంతో దటీజ్ కేసీయార్ అంటున్నారంతా. అంతకుముందు వరకూ కేసీయార్ డౌన్ డౌన్ అన్న వారంతా కేసీయార్ జిందాబాద్ అనేలా చేసుకున్నారు. అందుకే ఆయన్ని మాటల మాంత్రికుడు అంటారు. 

కేసీయార్ ఆర్టీసీ కార్మికులపై వరాలు కురిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  కార్మికులకు వరాలతో పాటు ప్రయాణికులకపై భారం వేశారు కేసీయార్. డిసెంబర్ 3వ తేదీ నుంచి కేసీయార్ నిర్ణయం అమలు కానుంది. కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున చార్జీలు పెంచుతూ ఆర్టీసీ అధికారులు పూర్తి నివేదికను కేసీఆర్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. అంతేకాక కనీస చార్జీల విషయంలో కూడా కసరత్తులు చేశారని.. ఆర్డినరీ బస్సుల్లో గతంలో మాదిరిగానే ‘ఫేర్ స్టేజి’ ఆధారంగానే వసూలు చేయాలని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు మాత్రం కిలోమీటర్‌ ఆధారంగా వసూలు చేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.ఎక్స్‌ప్రెస్ – 87 పైసలు, డీలక్స్ – 98 పైసలు, సూపర్ లగ్జరీ – 1.16 పైసలు, రాజధానికి – 1.46 పైసలు, గరుడకు – 1.71 పైసలు, గరుడ ప్లస్ – 1.82 పైసలు, వెన్నెల సర్వీసు – 2.53 పైసలు చొప్పున ప్రస్తుతం చార్జీలు ఉండగా.. ఇప్పుడు వీటికి కిలోమీటర్ చొప్పున 20 పైసలు కలుపుతారు. సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఇకపై కనీస టికెట్ ధర రూ.10లు నిర్ణయించారు. గ్రామాల్లో తిరిగే పల్లెవెలుగు బస్సులు ఆ రేట్.. రూ.8గా ఫిక్స్ చేశారు.

ఆర్టీసీ కార్మికులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో కేసీఆర్‌.. వారికి కొండత భరోసా కల్పించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 97 డిపోల నుంచి దాదాపు 700 మంది ఆర్టీసీ కార్మికులు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి భోజనం చేసిన కేసీఆర్‌.. ఆ తర్వాత రెండు గంటలపాటు వారితో సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న సెప్టెంబర్‌ నెల జీతాలను సోమవారమే చెల్లించాలని కేసీఆర్‌  అధికారులను ఆదేశించారు.

మొత్తం 55 రోజుల సమ్మె కాలానికి కార్మికులకు జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా డిపోల్లో మహిళల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయనున్నారు. మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటలలోపే డ్యూటీలు ఉండేలా చూస్తామన్నారు. మహిళా కార్మికుల ప్రసూతి సెలవులను పెంచాలని నిర్ణయించారు. ప్రయాణికులు టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తే.. ఇకపై కండక్టర్‌లపై కాకుండా వారిపైనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు కేసీఆర్‌.. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీలో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని.. ఒక్క రూట్‌లో కూడా ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వబోమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అంతేకాదు,..ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్సు పాసులు అందిస్తామన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. ఉద్యోగుల పీఎఫ్‌ బకాయిలను, సీసీఎస్‌ కు చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తాం.ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేస్తామని ఎడాపెడా హామీలు ఇచ్చేశారు. మొత్తం మీద కేసీయార్ వ్యూహం ఏంటో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు సైతం కామెంట్ చేస్తున్నారు. 

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   6 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   7 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   7 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   8 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   9 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   9 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   11 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   12 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   12 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle