newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

ఆర్టీసీ కార్మికులకు మేమున్నాం.. బీజేపీ భరోసా

25-10-201925-10-2019 17:31:18 IST
2019-10-25T12:01:18.987Z25-10-2019 2019-10-25T12:01:14.611Z - - 15-08-2020

ఆర్టీసీ కార్మికులకు మేమున్నాం.. బీజేపీ భరోసా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమ డిమాండ్ల పరిష్కారానికి ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నిరోజులు సమ్మె చేసినా వారి వెంట తాముంటామని బీజేపీ భరోసా ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులకు అండగా బీజేపీ ఉంటుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్  అన్నారు. శుక్రవారం ఆర్టీసీ జేఏసీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు ప్రజాస్వామ్యయుతంగా సమ్మె కొనసాగించాలని,  సీఎం కేసీయార్ బెదిరింపులకు వెనకడుగు వేయవద్దన్నారు. ఆర్టీసీ ఆస్తులపై టీఆర్ఎస్ నేతల కన్ను పడిందన్నారు.

ఆర్టీసీని అంతా కలిసి కాపాడుకుందామన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, కేసీఆర్ వ్యాఖ్యలు, ఆత్మహత్యలు, గుండెపోటుకు గురై చనిపోతున్న ఆర్టీసీ కార్మికుల గురించి కేంద్రానికి వివరిస్తామన్నారు లక్ష్మణ్. ఆర్టీసీ సమ్మె, భవిష్యత్ కార్యాచరణపై అశ్వథ్ధామరెడ్డి, రాజిరెడ్డి బీజేపీ నేతలతో చర్చలు జరిపారు. 

ఉధృతంగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కార్మికులను సస్పెండ్ చేయాలని ఏ చట్టమూ చెప్పలేదని... కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారమే చేశామని తమపై నేరాన్ని నెట్టేసే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. 

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ సమ్మె ప్రారంభించి శుక్రవారం నాటికి 21వ రోజుకు చేరిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరికలను ఎవరూ ఖాతరు చేయడం లేదని, ఏ ఒక్క కార్మికుడు విధులకు హాజరుకాలేదన్నారు. 

హుజూర్ నగర్ ఫలితం అనంతరం మీడియాతో కేసీయార్ మాట్లాడుతూ చేసిన కామెంట్లు, బెదిరింపులు, హెచ్చరికల వల్ల ఉద్యోగులు మనస్తాపానికి గురవుతున్నారని అశ్వధ్దామరెడ్డి అన్నారు. ఇవి ప్రభుత్వం చేస్తున్న హత్యలని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం వాస్తవాలు గమనించాలన్నారు. ఆర్టీసీ సమ్మెకు అన్ని పార్టీల మద్దతు ఉందని ఎలాంటి వత్తిడులకు గురికావద్దన్నారు. ఈనెల 30వ తేదీన సరూర్ నగర్లో సకలజనుల సభ నిర్వహిస్తామన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle