newssting
BITING NEWS :
పాకిస్తాన్‌లో కొనసాగుతున్న మీడియాపై దారుణ అణచివేత. పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులను అదుపులోకి తీసుకున్న ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మీడియాపై అణచివేత లేనేలేదంటూ చెబుతున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. జర్నలిస్టు ముబషిర్ జైదీ తన సహచరుల అరెస్టులను బయటపెట్టడంతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం * నేపాల్ దేశంలోని సింగిజా జిల్లాలో భారీవర్షాలతో కొండచరియలు విరిగిపడటం వల్ల ఒకే కుటుంబంలోని 9 మంది మరణించారని చీఫ్ జిల్లా ఆఫీసర్ గంగా బహదూర్ చెట్రీ ప్రకటన. భారీవర్షాలు, వరదల వల్ల నేపాల్ దేశంలో మొత్తం 10 మంది మరణించగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయయని అధికారుల ప్రకటన * వైరస్‌తో పోరాటం చేస్తున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌‌ సిసోడియా. ప్రస్తుతం విషమంగా ఆయన ఆరోగ్యం. కరోనాతో పాటు డెంగ్యూ కూడా ఎటాక్‌ చేయడంతో గడిచిన 24 గంటల్లో మరింత విషమంగా ఉందని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నాయక్‌ ఆస్పత్రి వైద్యుల ప్రకటన * వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆగని పోరు మంటలు. వ్యవసాయ, కార్మిక సంస్కరణల బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలను. పంజాబ్‌లో రైల్‌ రోకో నిర్వహించిన రైతులు. కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్ కమిటీ, ఇతర రైతు సంఘాలు సంయుక్తంగా ఆందోళనలు * పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ శుక్రవారం తలపెట్టిన భారత్‌ బంద్‌కు 20కి పైగా రైతు సంఘాలు మద్దతు. పంజాబ్‌, హరియాణాల్లో పార్టీలకు అతీతంగా ఆందోళనలో పాల్గొంటున్న 31 రైతు సంఘాలు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోనూ పలు రైతు సంఘాలు షట్‌డౌన్‌కు పిలుపు, హిందూ మజ్ధూర్‌ సభ వంటి పలు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటన * కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలతో పలు రైళ్ల రాకపోకల రద్దు. అమృత్ సర్-జయానగర్ ఎక్స్ ప్రెస్, జయానగర్-అమృత్ సర్ ఎక్స్ ప్రెస్ ల రద్దు చేయడంతో పాటు మరికొన్ని ప్యాసింజర్ రైళ్ల రద్దు. మరికొన్ని రైళ్ల ప్రయాణ దూరం కుదింపు * ఆరునెలల తర్వాత హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి రోడ్డెక్కిన సిటీ బస్సులు. మొత్తం బస్సుల్లో 25 శాతమే తిప్పనున్న ఆర్టీసీ. శుక్రవారం ఉదయం షిఫ్ట్‌ నుంచి బస్సులు ప్రయాణం మొదలు కాగా వారం, పది రోజుల తర్వాత పరిస్థితిని బట్టి 50 శాతం బస్సులకు అనుమతి * నేడు హైదరాబాద్‌ లోని దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45 ఎలివేటెడ్‌ కారిడార్‌ కూడా ప్రారంభం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చేతుల మీదగా శుక్రవాదం సాయంత్రం బ్రిడ్జ్ ప్రారంభం * పారిశుద్ధ్య కార్మికుల సర్వీసు క్రమబద్ధీకరణకు సంబంధించిన కేసులో‌ ఘాటు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు డివిజన్‌ బెంచ్. ఉచితంగా ఊడిగం చేయించుకోడానికి ఇదేమీ రాచరికం కాదని వ్యాఖ్య. సర్వీసు రూల్‌ 1994లోని సెక్షన్‌ 3 ప్రకారం దినసరి కూలీలుగా కొనసాగించరాదని హైకోర్టు మరోసారి స్పష్టం * పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో రేపటి నుండి అధిక ఆశ్వీజమాస తిరుకళ్యాణోత్సవాలు. 30న ఆలయంలో ఏకాంతంగా స్వామివారి కళ్యాణం. కళ్యాణోత్సవాల రోజుల్లో స్వామి వారి నిత్య కళ్యాణాలు, నిత్య ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో డి భ్రమరాంబ వెల్లడి * 283వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. రాజధాని గ్రామాల్లోని శిబిరాల్లో సాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్న రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * శ్రీశైలంలో కలకలం రేపిన అన్యమత పార్సిల్‌. ఆలయానికి సమీపంలోని దళిత కాలనీకి చెందిన ఓ కుటుంబానికి కర్నూలు నుంచి క్రిస్టియన్‌ సంస్థ ద్వారా వచ్చిన ఓ పార్సిల్‌. దానిపై కల్వరి టెంపుల్‌ చిరునామా . స్థానికులిచ్చిన సమాచారంతో పార్సిల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. పార్సిల్‌లో నిత్యావసర వస్తువులున్నట్లుగా పోలీసుల వెల్లడి * కేంద్ర సుగంధ ద్రవ్యాల మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మిర్చి టాస్క్‌ఫోర్స్‌కు చైర్మన్ గా బీజెపీ ఎంపీ, బోర్డు సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు నియామకం. మిర్చి పంట అభివృద్ధి, వాటి ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం ఈ టాస్క్‌ఫోర్స్‌ విధి. జీవీఎల్‌తోతోపాటు మరో 15మందిని కమిటీ సభ్యులుగా నియామకం.

ఆర్టీసీ కథ ముగుస్తుందా? కేబినెట్ భేటీలో కీలకనిర్ణయాలు?

02-11-201902-11-2019 08:45:49 IST
Updated On 02-11-2019 17:34:53 ISTUpdated On 02-11-20192019-11-02T03:15:49.121Z02-11-2019 2019-11-02T03:15:39.402Z - 2019-11-02T12:04:53.908Z - 02-11-2019

ఆర్టీసీ కథ ముగుస్తుందా? కేబినెట్ భేటీలో కీలకనిర్ణయాలు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ సమ్మెపై సీఎం కెసిఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇవాళ్టి క్యాబినెట్ భేటీలో ఆర్టీసీపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సమీక్ష సమావేశంలో ఆర్టీసీ సమ్మె అంశాలపై కూలంకషంగా చర్చించారు.

ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణ, అద్దె బస్సుల విధానాలపై క్యాబినెట్లో చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇవాళ్టికి సమ్మె ప్రారంభమై 29 రోజులు అవుతోంది. వరుసగా ఆర్టీసీ డ్రైవర్లు, ఉద్యోగులు ప్రాణాలు వదులుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదనే భావన కనిపిస్తోంది. 

ప్రైవేటు పర్మిట్లకే సీఎం కేసీఆర్ మొదటినుంచీ మొగ్గుచూపుతున్నారు. సీఎం కేసీయార్ కు అత్యంత సన్నిహితుడైన  ఓ ప్రైవేటు సంస్థ పర్మిట్లకు రెడీగా ఉందని తెలుస్తోంది.  ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇచ్చి పెద్ద సంఖ్యలో రూట్లు కేటాయించే అంశం ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు 4 వేల రూట్లలో ప్రైవేటు బస్సులను నడపడానికి పర్మిట్లు జారీ చేసే ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. నిర్ణయం తీసుకోనుంది.

ప్రైవేటు బస్సులకు తక్షణమే 4 వేల రూట్లలో పర్మిట్ల జారీకి సంబంధించి విధివిధానాలు, నోటిఫికేషన్‌ జారీ తదితర అంశాలపై ఈ సమావేశంలో ఓ అభిప్రా యానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది

ప్రైవేటు పర్మిట్ల పై కీలక నిర్ణయం వెలువడితే ఆర్టీసీ జేఏసీ నేతలు పెద్ద ఎత్తున నిరసనలు తెలపనున్నారు. . అలాగే మిలియన్‌ మార్చ్‌ నిర్వహించే అంశం తెరమీదకు వచ్చింది.

ఆర్టీసీ అధికారులు హైకోర్టుకు తప్పుడు వివరాలను అందించటం సిగ్గుచేటని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు మండిపడుతున్నారు. సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ తదుపరి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఈ అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష నేతలతో ఈరోజు భేటీ అవుతోంది.

కేసు విచారణలో భాగంగా శుక్రవారం హైకోర్టులో జరిగిన వాదనల్లో సమ్మె నివారణకు ఏవైనా పరిష్కార మార్గాలు దొరకవచ్చని భావించారు. కానీ అలాంటి వాతావరణం ఏమీ కనిపించలేదు. తదుపరి విచారణ ఈనెల ఏడవ తేదీకి వాయిదా పడడంతో సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తనంతట తానుగా సమ్మె ముగింపునకు చర్యలు తీసుకునే అవకాశం కనిపించడంలేదు. ఆర్టీసీకి ముగింపు పలకాలని కేసీఆర్ భావిస్తుండడంతో ఆర్టీసీ కార్మికులు తమ భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్నారు. 

అటు కేంద్రం వ్యవసాయ చట్టం- ఇటు కేసీఆర్ రెవెన్యూ చట్టం- తెలంగాణలో బీజేపీకి కష్టం

అటు కేంద్రం వ్యవసాయ చట్టం- ఇటు కేసీఆర్ రెవెన్యూ చట్టం- తెలంగాణలో బీజేపీకి కష్టం

   7 hours ago


బ్రేకింగ్ : కరోనా మృతదేహాల వద్ద కనిపించని నగలు, సెల్ఫోన్లు

బ్రేకింగ్ : కరోనా మృతదేహాల వద్ద కనిపించని నగలు, సెల్ఫోన్లు

   11 hours ago


బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా- కోవిడ్ జాగ్రత్తలపైనే అందరి దృష్టీ

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా- కోవిడ్ జాగ్రత్తలపైనే అందరి దృష్టీ

   11 hours ago


నేడే దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం.. ప్రత్యేకతలివే..

నేడే దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం.. ప్రత్యేకతలివే..

   12 hours ago


కరోనా లెక్కల తకరారు? ఎవరిని  నమ్మించడానికి? ఎవరికి  వంచించడానికి??

కరోనా లెక్కల తకరారు? ఎవరిని నమ్మించడానికి? ఎవరికి వంచించడానికి??

   13 hours ago


ఏపీ నీటి తరలింపునకు కేసీఆర్‌ చక్కటి సహకారం.. ఉత్తమ్‌ మండిపాటు

ఏపీ నీటి తరలింపునకు కేసీఆర్‌ చక్కటి సహకారం.. ఉత్తమ్‌ మండిపాటు

   13 hours ago


ఎమ్మెల్సీ పోరు.. కోదండరాం టార్గెట్‌గా టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్!

ఎమ్మెల్సీ పోరు.. కోదండరాం టార్గెట్‌గా టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్!

   14 hours ago


కులపిచ్చి, ధన అహంకారమే హేమంత్ హత్యకు కారణమా ?

కులపిచ్చి, ధన అహంకారమే హేమంత్ హత్యకు కారణమా ?

   15 hours ago


మంత్రి హ‌రీష్‌రావుచే 500 ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల పంపిణీ..

మంత్రి హ‌రీష్‌రావుచే 500 ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల పంపిణీ..

   16 hours ago


తెలంగాణలో మరో పరువు హత్య..!

తెలంగాణలో మరో పరువు హత్య..!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle