newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

ఆర్టీసీ ఉనికే ప్రశ్నార్థకం అయితే ఎలా?

10-11-201910-11-2019 10:35:41 IST
2019-11-10T05:05:41.556Z10-11-2019 2019-11-10T05:05:33.922Z - - 15-08-2020

ఆర్టీసీ ఉనికే ప్రశ్నార్థకం అయితే ఎలా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సమ్మె పేరుతో ఆర్టీసీ సిబ్బంది, ప్రైవేటీకరణ తప్పదంటూ తెలంగాణ ప్రభుత్వం భీష్మించుకుని కూర్చున్న 35 రోజుల తర్వాత ఆర్టీసీ ఉనికే ప్రశ్నార్థకమైపోయిన పరిస్థితికి తెలంగాణ హైకోర్టు సాక్షిగా నిలిచింది. ఇది ఏ స్థాయికి పోయిందంటే ఆర్టీసీ విభజనే కాలేదు అలాంటప్పుడు ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ సంస్థలను ఎలా గుర్తించాలి అనే మౌలిక ప్రశ్న కేంద్ర ప్రభుత్వం నుంచి రావడంతో అటు హైకోర్టు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా బిత్తరపోయే పరిస్థితి ఏర్పడింది. విభజన కాకున్నా రెండు రాష్ట్రాల పేర్లను తగిలించుకుని ఆర్టీసీ సంస్థ విడివిడిగా పనిచేస్తున్న ప్రాతిపదికకే ఇప్పుడు చట్టబద్ధత లేదనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ ఉనికిని ఎవరు ఎలా నిర్దారిస్తారనేది చిక్కుముడిగా మారింది.,

చరిత్రను కాస్త తడిమితే ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలోనే ఆర్టీసీ విభజన పెద్ద వివాదానికి దారితీసింది. అటు అధికారులూ, ఇటు కార్మిక సంఘాలూ ఒకరి వాదనను ఒకరు ఖండిస్తూ ఫిర్యాదులతో హోరెత్తించినప్పటికీ ఇరు రాష్ట్రాలూ రెండు ఆర్టీసీలను తమకు తాముగా ఏర్పాటు కావడంతో వివాదాలను అందరూ మర్చిపోయారన్నది నిజం. కానీ టీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విచారణ సందర్భంగా సంస్థ ఉనికినే హైకోర్టు ప్రశ్నించే పరిస్థితి రావడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 

ఆర్టీసీ బౌతికంగా రెండుగా విడిపోయినప్పటికీ సాంకేతికంగా ఇంకా ఉమ్మడిగా ఉంటున్న పరిస్థితికి కేంద్రమే కారణం. అయిదున్నర సంవత్సరాలుగా ఆర్టీసీని విభజనచట్టం ప్రకారం వేరు చేయలేకపోయిన కేంద్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఆర్టీసీ ఉనికినే శంకించే పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఉమ్మడి ఆర్టీసీకి చెందిన 14 కీలక ఆస్తులను 58:42 దామాషా కింద ఏపీ, తెలంగాణ  రాష్ట్రాలు పంచుకోవలసి ఉండగా ఈనాటికీ ఆస్తుల పంపకం తెగకపోవడంతో ఇది రాజ్యాంగపరమైన సమస్యకు కారణం అవుతోంది.

ఈ సందిగ్ధ పరిస్థితిని ఎవరికి అనుకూలంగా వారు మార్చుకుని వ్యాఖ్యానించడానికి ప్రయత్నిస్తుండటం మరికొన్ని సంక్లిష్టతలకు దారి తీస్తోంది. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు ఇచ్చిన వివరణ కారణంగా తాము ఇప్పటికీ ఏపీఆర్టీసీలో భాగంగానే ఉంటున్నామని కార్మిక సంఘాలు వాదించే సాహసం చేశాయి.

ఆర్టీసీ జేఏసీ–1 కన్వీనర్‌ హన్మంతు ఈ అంశాన్నే తమకు అనుకూలంగా మార్చుకుని వాదిస్తున్నారు.  ‘ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉందనీ, సాంకేతికంగా విభజన జరగనందున కేంద్రం వాటా ఏపీఎస్‌ఆర్టీసీలో ఉన్నట్లేననీ ఆయన చెబుతున్నారు. ఇప్పుడున్న బస్సులు, సిబ్బంది దానికి చెందిన వారే అయినందున విభజనే జరగని సంస్థలో కొంత భాగాన్ని ఎలా ప్రైవేటీకరిస్తారు, కేంద్రం అనుమతి లేకుండా ఎలా ప్రైవేటీకరిస్తారు అంటూ మొన్న కోర్టులో వినిపించిన కేంద్రం వాదననే మేం బలపరుస్తున్నాం అని ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్నారు.

మరోవైపున ఆర్టీసీని ఇంకా విభజించనేలేదని ఇక రెండు రాష్ట్రాలు సంస్థ ప్రయివేటీకరణ గురించి, విలీనం గురించి ఎలా తీర్మానిస్తాయి, వ్యాఖ్యానిస్తాయి అంటూ హైకోర్టులోనే వాదించిన కేంద్ర కూడా ఈ అంశంలో అడ్డంగా బుక్కయినట్లు కనిపిస్తోంది. మోదీ ప్రభుత్వం ఫేమ్‌ పథకం కింద బ్యాటరీ బస్సులు మంజూరు చేస్తోంది. తొలి విడతలో తెలంగాణ ఆర్టీసీకి 40 ఏసీ బస్సులిచ్చింది. రెండో విడతలో ఏపీకి 300, తెలంగాణ ఆర్టీసీకి 325 కేటాయించింది. మరి సంస్థ ఉమ్మడిగా ఉన్నప్పుడు టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీకి విడివిడిగా ఎలా కేటాయించింది అనేది కేంద్రాన్ని కోర్టు తదుపరి విచారణలో తప్పకుండా ఇరుకుని పెట్టే అంశంమే అని న్యాయనిపుణులు చెబుతున్నారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle