newssting
BITING NEWS :
*నేడు మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ బాసట.. కీలక వ్యాఖ్యలు

14-10-201914-10-2019 15:08:21 IST
Updated On 14-10-2019 15:20:53 ISTUpdated On 14-10-20192019-10-14T09:38:21.336Z14-10-2019 2019-10-14T09:38:08.844Z - 2019-10-14T09:50:53.383Z - 14-10-2019

ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ బాసట.. కీలక వ్యాఖ్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత పదిరోజులుగా సమ్మెకు దిగారు. వివిధ రకాలుగా ప్రభుత్వంపై వత్తిడి పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. కార్మికుల ఆవేదన అర్థంచేసుకోవాలని.. సమ్మె ఉధృతం కాకముందే సమస్య పరిష్కరించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు.

జనసేన పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. సమ్మె చేపట్టిన 48 వేల మంది కార్మికుల ఉద్యోగాలను తొలగిస్తున్నామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. 

అభద్రతా భావంతోనే ఉద్యోగులు చనిపోతున్నారని అభిప్రాయపడ్డారు. సమ్మెకు సంబంధించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె, తాజా పరిస్థితులపై ఆయన సోమవారం పార్టీ నాయకులతో హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ నెల 19న ఆర్టీసీ కార్మికుల జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

బంద్‌ సందర్భంగా ఎలాంటి హింసకు తావులేకుండా.. శాంతియుత నిరసనలు చేపట్టాలని కోరారు. ఖమ్మంలో శ్రీనివాస్‌రెడ్డి, రాణిగంజ్ డిపోకు చెందిన సురేందర్‌ గౌడ్‌లు బలవన్మరణానికి పాల్పడటం సమ్మె తీవ్రతను తెలియజేస్తుందని పవన్ అన్నారు.

Image may contain: 3 people

వీరి ఆత్మహత్యలపై ఆయన ఆవేదన చెందారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్మికుల డిమాండ్లపై చర్చించాలని. వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని పవన్ కోరారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అధికార టీఆర్ఎస్ మినహా వివిధ రాజకీయపార్టీలు సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle