ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ వయసు 60 ఏళ్ళు
26-12-201926-12-2019 08:23:13 IST
Updated On 26-12-2019 10:46:38 ISTUpdated On 26-12-20192019-12-26T02:53:13.746Z26-12-2019 2019-12-26T02:51:55.283Z - 2019-12-26T05:16:38.390Z - 26-12-2019

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీయార్ గుడ్ న్యూస్ అందించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచుతున్నట్టు ప్రకటించారు. దీంతో 58 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకు పెరుగుతుంది. అలాగే 202 మంది ఉద్యోగులతో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుచేయబోతున్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులపై సీఎం కేసీయార్ సంతకం చేశారు. ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం వర్తిస్తుందని చెప్పారు. ఇటీవల ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమణ అనంతరం జరిగిన ఆత్మీయ సమావేశంలో పదవీ విరమణ వయసును పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు. ఆర్టీసీని బలోపేతం చేయడానికి ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు, సరుకు రవాణా విభాగాన్ని పటిష్టం చేయనున్నారు. ఆర్టీసీలో కార్గో, పార్సిల్ సేవలను విస్తృత పరిచేందుకు అవసరమైన వ్యూహం సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం, సరుకు రవాణా చేయనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో సరుకు రవాణాకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు. ప్రయాణికులను చేరవేసినట్టుగానే ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఏ మారుమూల ప్రాంతానికైనా సరుకు రవాణా చేయనున్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా జరిగే సరుకు రవాణాను ఇకపై కచ్చితంగా ‘ఆర్టీసీ కార్గో అండ్ పార్సిల్ సర్వీస్’ఉపయోగిస్తారు. బతుకమ్మ చీరలు, విద్యా సంస్థలకు పుస్తకాలు, డిపోల నుంచి బ్రాందీ షాపులకు మద్యం, ఆస్పత్రులకు మందులు అన్నీ ఇక ఆర్టీసీ కార్గో ద్వారానే కొనసాగుతాయి. ఆర్టీసీకి ఉన్న విశ్వసనీయత నేపథ్యంలో అందరికీ అందుబాటులో సరుకు రవాణాకు అవకాశం ఉంది. దీంతో ప్రతి ఊరికి సరుకులు రవాణా చేస్తే ప్రయాణికులనుంచి వచ్చే ఆదాయంతో పాటు సరుకు రవాణా ద్వారా అదనపు ఖర్చులు లేకుండానే ఆదాయం సమకూరుతుందని కేసీయార్ భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై, భివండి, షోలాపూర్, నాగ్‌పూర్, జగ్దల్పూర్ తదితర ప్రాంతాలకూ సరుకు రవాణా చేయనున్నారు. ఆర్టీసీ లాభాల బాటన పయనిస్తే ఉద్యోగులకు బోనస్ కూడా ఇచ్చుకునే పరిస్థితి వస్తుందన్నారు కేసీయార్. సరుకు రవాణా విషయంలో ఎలా వ్యవహరించాలనే విషయంలో ఉద్యోగులకు తగిన శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాదు, గతంలో ప్రకటించినట్టుగా యూనియన్లకు బదులు ఉద్యోగుల వెల్ఫేర్ బోర్డులు రానున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, ఎప్పటికప్పుడు ఎదురయ్యే పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు ఎంప్లాయీ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. బోర్డు కూర్పునకు సంబంధించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ డిపో నుంచి, ప్రధాన కార్యాలయం నుంచి ఇద్దరు చొప్పున ఉద్యోగులు.. మొత్తం 202 మంది బోర్డులో సభ్యులుగా ఉంటారు. ఇందులో 94 మంది బీసీలు, 38 మంది ఎస్సీలు, 26 మంది ఎస్టీలు, 44 మంది ఓసీలుంటారు. మొత్తం సభ్యుల్లో మహిళా ఉద్యోగులు 73 మంది ఉంటారు. పది రోజుల పాటు ఆర్టీసీ ఈడీలు, ఉన్నతాధికారులు డిపోల వారీగా సమావేశాలు నిర్వహించి, ఎక్కడికక్కడ తగిన వ్యూహం రూపొందిస్తారు. పెళ్లిళ్ళకు, వివిధ సమావేశాలకు కంపెనీలకు ఆర్టీసీ బస్సులు సరఫరా చేయాలని నిర్ఱయించారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ హాజరయ్యారు. శామీర్‌పేట డిపోలో ఈనెల 27వ తేదీ శుక్రవారం వనభోజనాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు హాజరు కానున్నారు. మొత్తం మీద ఆర్టీసీ విషయంలో కేసీయార్ సానుకూల దృక్పథంతో వ్యవహరించడం పట్ల ఉద్యోగులు ఆనందంగా వున్నారు.

ఏపీలో స్కూల్స్ బంద్
20 minutes ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
a minute ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
4 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
6 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
an hour ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
8 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
8 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
an hour ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
3 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
9 hours ago
ఇంకా