newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

ఆర్టీసీ ఉద్యోగి సజీవ దహనం.. పరిస్థితి విషమం..!

13-10-201913-10-2019 10:16:55 IST
2019-10-13T04:46:55.913Z13-10-2019 2019-10-13T04:46:53.006Z - - 22-02-2020

ఆర్టీసీ ఉద్యోగి సజీవ దహనం.. పరిస్థితి విషమం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది సమ్మె సందర్భంగా జరగరాని ఘటన జరిగిపోయింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాసరెడ్డి శనివారం తనను తాను తగులబెట్టుకుని తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. శ్రీనివాసరెడ్డి గత 20 ఏళ్లుగా ఆర్టీసీలో ఖమ్మం డిపోలో పనిచేస్తున్నాడని, శనివారం తన నివాసంలోనే కిరోసిన్ పోసుకుని తన్నుతాను తగులబెట్టుకున్నాడని తెలంగాణ ఆర్టీసీ అధికారి తెలిపారు.  తనను వెంటనే ఆసుపత్రికి చేర్పించగా తన పరిస్థితి విషమంగా ఉందని, 90 శాతం దేహం కాలిపోయిందని వైద్యులు చెప్పారు.

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బంది తమ హక్కుల సాధనకోసం వారం రోజుల పైగా చేస్తున్న సమ్మెలో శ్రీనివాస రెడ్డి భాగమయ్యాడు. ఆర్థిక పరిస్థితి క్షీణించిన రవాణా సంస్థను ప్రభుత్వసంస్థగా విలీనిం చేసుకోవాలనే డిమాండుతో అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ సిబ్బంది సమ్మె కొనసాగిస్తున్నారు. సమ్మె ప్రారంభమై 8 రోజులు కావస్తున్నప్పటికీ అటు ప్రభుత్వం కానీ ఇటు సిబ్బంది కానీ వెనుకంజ వేయడం లేదు. పైగా అక్టోబర్ 19న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు యూనియన్లు పిలుపునిచ్చాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో శ్రీనివాసరెడ్డి తానెందుకు తగులబెట్టుకుంటున్నదీ చెప్పారు. గత 40 ఏళ్లుగా ఆర్టీసీ కోసం పనిచేస్తున్న కార్మికులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి. నా చెల్లెలుకు, అమ్మకు నాగురించి తెలుపండి అంటూ శ్రీనివాస్ ఆ వీడియోలో చెప్పారు. 50వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను సమ్మెలో పాల్గొంటున్నారన్న నెపంతో తెలంగాణ ప్రభుత్వం వారిని ఉద్యోగాల నుంచి తొలగించి కొత్తవారిని నియమిస్తున్నట్లు ప్రకటించింది.

ప్రభుత్వ మొండివైఖరిని భరించలేక తనను తాను తగులబెట్టుకున్న శ్రీనివాసరెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నామని ఖమ్మం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎస్వీజీ కృష్ణమూర్తి చెప్పారు. మా డిపో మేనేజర్, ఇతర అధికారులందరూ తనతోనే ఉండి అతడిని హైదరాబాద్ తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు.

సమ్మె చేస్తున్న 50 వేలమంది ఆర్టీసీ సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలను ప్రభుత్వం నిలిపివేసింది. అధికారికంగా ప్రకటించనప్పటికీ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరినీ తొలగించామని ప్రభుత్వం చెప్పడంతో సమ్మె మరింత ఉధృతమైంది.

తనది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత నిరంకుశత్వంతో, మొండి వైఖరితో ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టడం తెలంగాణ సకల సామాజిక వర్గాలను ఆవేదనలో, ఆగ్రహంలో ముంచెత్తుతోంది. హైకోర్టులో జరుగుతున్న విచారణ ఫలితం కోసం ఇరు పక్షాలూ ఎదురు చూస్తున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం తమను తాము సజీవ దహనం చేసుకున్న విద్యార్థులు, యువజనుల తరహాలో ఆర్టీసీ సిబ్బంది ప్రాణార్పణలకు పాల్పడటం తెలంగాణకు, ప్రభుత్వానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   5 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   6 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   7 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   8 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   9 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   9 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   11 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   11 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   11 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle