newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆర్టీసీలో సంఘాల మనుగడకు కేసీఆర్ మార్క్ చెక్!

09-03-202009-03-2020 11:32:28 IST
Updated On 09-03-2020 11:35:33 ISTUpdated On 09-03-20202020-03-09T06:02:28.880Z09-03-2020 2020-03-09T06:02:26.827Z - 2020-03-09T06:05:33.017Z - 09-03-2020

ఆర్టీసీలో సంఘాల మనుగడకు కేసీఆర్ మార్క్ చెక్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గులాబీ అధినేత.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీలో యూనియన్ల వ్యవస్థకు చెక్ పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఆర్టీసీ వ్యవస్థ ఈ యూనియన్ల వలనే బ్రష్టు పట్టిపోతుందంటూ గత ఏడాది సమ్మె సమయంలో కన్నెర్ర జేసిన కేసీఆర్ యూనియన్లకి చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసేశారు. అందులో భాగంగానే ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆర్టీసీలో ఉద్యోగుల కోసం బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు.

కేసీఆర్ మహామొండి మనిషి అని రాజకీయాలు పరిచయమున్న అందరికీ తెలిసిందే. ఇది చాలాసార్లు నిరూపితమైంది కూడా. అసలు ఆ మొండితనమే ఒక విధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిపెట్టిందని కూడా కొందరి అభిప్రాయం. ఆ మొండితనాన్నే కొందరు దొరల పాలన అని పేరు పెట్టుకున్నా.. అయన మాత్రం ఆయన నైజం వీడడంలేదు. ఎందులో అయినా ఆయన మార్క్ మొండితనం స్పష్టంగా కనిపించేలా చేసుకుంటారు.

గత ఏడాది ఆర్టీసీ సమ్మె సమయంలో కూడా ఆర్టీసీ ఎంత ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ మాత్రం ఒక్క మెట్టు కూడా దిగలేదు. ఎప్పటికప్పుడు తనదైన స్టైల్లో ఆర్టీసీ కార్మికులను, ఉద్యోగులను తన దగ్గరకు తెచ్చుకొని సమ్మెని వారంతట వాళ్లే విరమించుకొనేలా చేసుకున్నారు. ఆ సమయంలో ప్రతిపక్షాలు రకరకాలుగా విమర్శలు చేసినా కార్మికులతో కలిసి దండయాత్రలే చేసినా కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ధీమాగా ఉండిపోయారు.

అప్పుడు కేసీఆర్ నైజం చూసిన వాళ్ళైతే ఆర్టీసీ ఇక చరిత్రలో కలిసిపోవడం ఖాయమనుకున్నారు. కానీ కార్మికులే వెనక్కు తగ్గి సమ్మె విరమించి ఉద్యోగాలకు వెళ్తే మీరంతా నా బిడ్డలే అంటూ వరాలను ఇచ్చి వాళ్ళను మచ్చిక చేసుకున్నారు. అది ఆయనకు తెలిసిన విద్య అది వేరేవిషయం. అయితే, ఆ సమ్మె సమయంలో ఆర్టీసీ యూనియన్ల మీద కేసీఆర్ కన్నుపడింది. అప్పుడే ఈ యూనియన్ల పీడ వదిలిస్తానని కూడా ప్రకటించారు.

అనుకున్నట్లే యూనియన్లకు చెక్ పెట్టేలా వాటి స్థానంలో ఉద్యోగుల బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్ లో ప్రస్తావించారు. సమ్మె విరమించిన సమయంలో కార్మికులకు ఇచ్చిన వరాలతో పాటు అసలు కార్మికులు అన్నవారే ఉండరని అందరూ ఉద్యోగులేనని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఆ ఉద్యోగులను క్రోడీకరిస్తూ బోర్డు ఏర్పాటు చేసేలా సూచనలు చేసేశారు. దీనిపై బడ్జెట్ లో ప్రస్తావన కూడా జరిగిపోయింది.

సమ్మె విరమణ సమయంలోనే ప్రకటించిన ప్రకారం ఒక్కో డిపోకు ఐదుగురు చొప్పున ఉద్యోగులతో ఓ కమిటీ ఏర్పాటు చేస్తూ వీరందరినీ క్రోడీకరించి డిపో, జిల్లా, రీజినల్, రాష్ట్ర స్థాయిల్లో ఉద్యోగుల బోర్డు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీంతో పాటు ఆర్టీసీకి ఈ వార్షిక బడ్జెట్ లో రూ.1000 కోట్లు కేటాయించింది. ఈ రూ.1000 కోట్లతో కొత్త బస్సుల కొనుగోలు, కార్గో సేవలు విస్తృతపరచడం లాంటి చర్యలు తీసుకోనున్నారు.

ఇప్పటికే ఆర్టీసీలో కార్గో సేవలు మొదలుపెట్టిన ఆర్టీసీని పరిపుష్టం చేస్తానంటున్న కేసీఆర్ ముందుగా వెయ్యి కోట్లు నిధులు.. మరోవైపు యూనియన్ల వ్యవహారం లేకుండా చేసేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఆర్టీసీ యూనియన్ లీడర్లకు వృత్తిపరమైన వెసులుబాటు కూడా ఉండేది. దానిని కూడా రద్దు చేసి లీడర్లను అందరితో సమానంగా పనిచేయాలని ఆదేశించారు. మరి దీనిపై కార్మికులు, ఉద్యోగులు ఎలా స్పందించనున్నారో చూడాలి.

 

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   3 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   27 minutes ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   7 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   8 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   9 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   18-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle