newssting
BITING NEWS :
*రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు-కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ *ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ. 5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ మీటింగ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్. పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ *కొత్తకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డివైడర్ ఢీ కొట్టి తుఫాన్ వాహనం బోల్తా. ఇద్దరు మృతి. 14 మందికి తీవ్రగాయాలు, హాస్పిటల్ కు తరలింపు * ఇవాళ కెసిఆర్ బర్త్ డే. కెసిఆర్ పుట్టినరోజును మొక్కల పండుగగా జరపాలని తెరాస పిలుపు. రేపు ఉదయం నుంచి మొక్కలు నాటడం... రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు *జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం. పనిచేసే కార్యకర్తలకే జనసేన పార్టీలో ప్రాధాన్యత. కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నా-పవన్ *రాజధాని మార్పు, పీఏఏల రద్దు తొందరపాటు నిర్ణయాలు, పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి, శాసనమండలి రద్దు నిర్ణయం సరైంది కాదు-దగ్గుబాటి పురంధేశ్వరి*ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... మూడోసారి సీఎంగా ప్రమాణం

ఆర్టీసీని కాపాడడం ఎవరి తరం కాదు

24-10-201924-10-2019 17:44:20 IST
Updated On 24-10-2019 18:40:09 ISTUpdated On 24-10-20192019-10-24T12:14:20.816Z24-10-2019 2019-10-24T12:14:16.124Z - 2019-10-24T13:10:09.071Z - 24-10-2019

ఆర్టీసీని కాపాడడం ఎవరి తరం కాదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. ఆర్టీసీని కాపాడడం ఎవరి తరం కాదన్నారు. ఒక్క సంతకం చేస్తే రోడ్డుమీదకు ఆరు, ఏడు వేల ప్రైవేట్ బస్సులు వస్తాయన్నారు. డబ్బులు వచ్చే టైంలో సమ్మెకు వెళ్లారని సీఎం విమర్శించారు. ప్రైవేట్ పర్మిట్లు ఇచ్చుకోవచ్చని ప్రధాని మోడీ చెప్పారు.. బీజేపీ నేతలకు ఆ చట్టం గురించి తెలియదా అని కేసీఆర్ ప్రశ్నించారు.

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కార్మికులు తెలివైనోళ్లయితే దరఖాస్తులు పెట్టుకుని తిరిగి డ్యూటీలో చేరాలన్నారు.దరఖాస్తు తీసుకుని డ్యూటీకి వెళ్తే ఎవరూ వెళ్లగొట్టరు...స్వచ్చందంగా వెళ్లిపోయారు కనుక వాళ్లే స్వచ్చందంగా వచ్చి విధుల్లో చేరాలన్నారు సీఎం కేసీఆర్.

తెలంగాణలో దసరా పండుగ చాలా ముఖ్యమని.. అలాంటి టైంలో సమ్మెకు దిగి పెద్ద తప్పుచేశారని కేసీఆర్ మండిపడ్డారు. కార్మికులు చేస్తున్న సమ్మెలో అర్ధం లేదని ఆర్టీసీ సమ్మె కాదు ఆర్టీసీ అధ్యాయమే ముగుస్తుందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

గతంలో తాను రవాణా మంత్రిగా పని చేశానని గుర్తు చేశారు. నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఎంతో ప్రయత్నం చేశానని కేసీఆర్ అన్నారు. యూనియన్లు లేకుండా పనిచేస్తే లాభాలు వస్తాయన్నారు.

సమ్మె చేయాలా వద్ద అనేది కార్మికులు నిర్ణయించుకోవాలన్నారు. ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇది చిల్లర యూనియన్ల రాజకీయ సమ్మె అన్నారు కేసీఆర్.  ప్రభుత్వాధినేతను అడ్డంగా తిట్టి సమస్యలు పరిష్కరించుకుంటారా అని ఆయన అన్నారు.

ఉద్యోగాలు లేక జనం రోడ్లమీద ఉన్నారని, ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోకుండా సమ్మె చేయడం ఏంటన్నారు. సమ్మె చేస్తున్న కార్మికులు విధుల్లో చేరాలనుకుంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు కేసీఆర్. తక్కువ ధరలకు బస్సులు తిప్పేందుకు ప్రైవేట్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

ప్రభుత్వం తలచుకుంటే పర్మిట్లు ప్రైవేట్ వారికి ఇచ్చేస్తామన్నారు. చట్టం ఉంది కాబట్టి దానిని అమలుచేస్తామన్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యల్ని బట్టి త్వరలో ఆర్టీసీ అధ్యాయం ముగిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

   an hour ago


మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

   an hour ago


మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

   3 hours ago


కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

   3 hours ago


అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

   5 hours ago


రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

   5 hours ago


కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

   7 hours ago


కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

   7 hours ago


అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

   8 hours ago


‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

   9 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle