ఆరేళ్లలో అనూహ్య ప్రగతి .. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
06-03-202006-03-2020 14:08:37 IST
2020-03-06T08:38:37.191Z06-03-2020 2020-03-06T08:38:24.753Z - - 16-04-2021

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ప్రసంగించారు. ఆరు దశాబ్దాల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, తెలంగాణ రాష్ట్రం స్వల్ప కాలంలోనే అనేక రంగాల్లో ప్రగతి సాధించిందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం గర్వకారణం అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమ నాయకుడే సారధిగా ఉండటం కలిసొచ్చిన అంశంగా సౌందరరాజన్ పేర్కొన్నారు. బిపిఎల్ లో ఉండే కుటుంబాలను నిర్దేశించేందుకు ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో 60 వేల నుంచి లక్షన్నర,పట్టణాల్లో 75వేల నుంచి రెండు లక్షల వరకు పెంచామన్నారు. రాష్ట్రంలో పెన్షన్స్ 2016 రూపాయలు ఇవ్వడం పేదలకు ఉపయోగకరంగా వున్నాయన్నారు. వృద్ధాప్య పెన్షన్స్ 65 నుంచి 57 కు కుదించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, 959 రెసిడెన్షియల్ విద్యాలయాలు నిర్వహిస్తోందన్నారు. విద్యారంగంలో గతంలో కంటే ప్రమాణాలు బాగా పెరిగాయన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబానికి 10 లక్షలు-ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించామన్నారు. 50వేల వరకు పేదలకు ఉపాధి కల్పన కోసం వందశాతం సబ్సిడి అందిస్తున్నామని, ఎస్సి-ఎస్టీలకు ఇండ్లలో విద్యుత్ బిల్లు 101 యూనిట్ల వరకు ఉచితంగా అందించబడుతోందని, విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 22,667 మంది ఆర్టిజన్ల సర్వీసును ప్రభుత్వం క్రమబద్దీకరించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 13, 168 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చిందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 16, 246 మెగావాట్ల స్థాపిత విద్యుత్ అందుబాటులో ఉందన్నారు గవర్నర్. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిర్మించి, ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే ఏర్పాట్లు సాగుతున్నాయన్నారు. 310 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వం సుమారు 40 టీఎంసీల సమర్థ్యంతో సీతమ్మ సాగర్ బ్యారేజిని మంజూరు చేసిందన్నారు. తెలంగాన ప్రభుత్వం అన్నదాతలకు అండగా ప్రారంభించిన రైతుబంధు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతు సమన్వయ సమితి పేరు మార్చామని, రైతు బంధు సమితులుగా పనిచేస్తాయన్నారు గవర్నర్. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబీమా పథకం అమలు చేస్తున్నామని, మిషన్ కాకతీయ పథకం పై దేశంలో మిగతా 11 రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 84 పిహెచ్ సిలు ...ఎస్ క్యూ ఎ ఎస్ స్థాయిని పొంది దేశంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. న్యూ బార్న్ సెంటర్లు 22 నుంచి 42 పెంచాలని నిర్ణయం తీసుకున్నామని, తెలంగాణ రాష్ట్రంలో 4 కి మరో ఐదు జోడించి 9 మెడికాల్ కాలేజీలు పెంచిందన్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల వల్ల 2లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. పరిశ్రమల వల్ల 14లక్షల మందికి ఉద్యోగాలు కొత్తగా వచ్చాయన్నారు,. గడిచిన ఏడాది ఐటీ రంగంలో తెలంగాణ వృద్ధి రేటు 16.89 శాతం కావడం ప్రగతికి నిదర్శనం అన్నారు. 2 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం సాగుతోందని, తెలంగాణ శాంతి భద్రతల అదుపులో ఉన్నాయన్నారు. తెలంగాణ 6 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నామన్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పడిందని, ఆర్థిక మాంద్యం వల్ల తెలంగాణ ప్రభుత్వం ఆర్థికాంశాలల్లో కఠినమైన క్రమశిక్షణ పాటించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆకలి దప్పులు లేని, అనారోగ్యాలు లేని, శతృత్వం లేని రాజ్యమే గొప్ప రాజ్యం అన్నారు గవర్నర్.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
11 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
7 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
12 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
14 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
16 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
17 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
19 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
20 hours ago
ఇంకా