newssting
BITING NEWS :
*రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు-కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ *ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ. 5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ మీటింగ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్. పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ *కొత్తకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డివైడర్ ఢీ కొట్టి తుఫాన్ వాహనం బోల్తా. ఇద్దరు మృతి. 14 మందికి తీవ్రగాయాలు, హాస్పిటల్ కు తరలింపు * ఇవాళ కెసిఆర్ బర్త్ డే. కెసిఆర్ పుట్టినరోజును మొక్కల పండుగగా జరపాలని తెరాస పిలుపు. రేపు ఉదయం నుంచి మొక్కలు నాటడం... రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు *జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం. పనిచేసే కార్యకర్తలకే జనసేన పార్టీలో ప్రాధాన్యత. కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నా-పవన్ *రాజధాని మార్పు, పీఏఏల రద్దు తొందరపాటు నిర్ణయాలు, పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి, శాసనమండలి రద్దు నిర్ణయం సరైంది కాదు-దగ్గుబాటి పురంధేశ్వరి*ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... మూడోసారి సీఎంగా ప్రమాణం

ఆరుసార్లు ఎమ్మెల్యే.. అయినా గుర్తించని కేసీఆర్

08-11-201908-11-2019 14:53:30 IST
2019-11-08T09:23:30.884Z08-11-2019 2019-11-08T09:23:26.278Z - - 17-02-2020

ఆరుసార్లు ఎమ్మెల్యే.. అయినా గుర్తించని కేసీఆర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆరుసార్లు ఎమ్మెల్యేగా డోర్న‌క‌ల్ నుంచి గెలిచిన రెడ్యా నాయ‌క్ ఇప్పుడు రాజ‌కీయ చిక్కుల్లో ఉన్నారు. కాంగ్రెస్ త‌రుపున 2014లో గెలిచిన ఆయ‌న ఆ త‌రువాత టీఆర్ఎస్‌లో చేరారు. 2018లోను అదే డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్ధిగా రంగంలోకి దిగి భారీ మెజార్టీతో గెలుపొందారు. కేసీఆర్ స‌ర్కార్‌లో మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని అంతా భావించారు. కానీ, మొద‌టి విడ‌త‌లో నిరాశే మిగిలింది. విస్త‌ర‌ణ‌లో అయినా అవ‌కాశం వ‌స్తుంద‌నుకుంటే అదీ జ‌ర‌గ‌లేదు.

దీంతో ఆయ‌న ఇప్పుడు నిరాశ‌గా ఉన్నారు. త‌న‌కు ప‌ద‌వి ద‌క్క‌లేద‌న్న బాధ‌కంటే ఒక‌ప్పుడు త‌న ప్ర‌త్య‌ర్ధి త‌న‌కంటే జూనియ‌ర్ మాత్ర‌మే కాకుండా త‌న సామాజిక‌వ‌ర్గానికి చెందిన స‌త్య‌వ‌తి రాథోడ్‌కు రావ‌డం అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారట‌. దీనిని అవ‌మానంగా భావించిన ఆయ‌న అల‌క‌పాన్పు ఎక్కినా ఉప‌యోగం లేక‌పోయింది.

అధిష్టానం ముందు.. అనుచ‌రుల ముందు పార్టీలో అత్యంత స‌న్నిహితుల ద‌గ్గ‌ర.. త‌న ఆవేద‌నంతటిని వెల్ల‌గ‌క్కుతున్నార‌ట రెడ్యానాయ‌క్. అయినా లైట్ తీసుకున్న అధిష్టానం భ‌విష్య‌త్ అంతా మ‌న‌దేన‌న్న మాట‌ల‌తో స‌రిపుచ్చింది.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీకి స‌హ‌క‌రించ‌ని స‌త్య‌వ‌తికి అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వ‌ద‌ని రెడ్యా భావించారు. కానీ, సీన్ రివ‌ర్స్ అయింది. స‌త్య‌వ‌తికి కేసీఆర్ ఎమ్మెల్సీ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డ‌మే కాదు. ఏకంగా మంత్రిని కూడా చేసేశారు. అప్ప‌టి వ‌ర‌కు క‌నుమ‌రుగైన ఆమెవ‌ర్గం మ‌ళ్లీ ఆమె పంచ‌న చేర‌డం మొద‌లుపెట్టింది. ఈ ప‌రిణామం రెడ్యాకు ఏ మాత్రం రుచించ‌డం లేద‌ని, దాంతో ప్ర‌స్తుతం రెడ్యా ఏక ఛ‌త్రాధిప‌త్యానికి గండిప‌డిందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

స‌త్య‌వ‌తి వ‌ర్గీయులు రెడ్యానాయ‌క్‌కు రోజుకో ర‌కంగా చుక్క‌లు చూపిస్తున్నారు. అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి రెడ్యా వ‌ర్గీయుల‌కు ఎదుర‌వుతుంద‌న్న‌ది వాస్త‌వ‌మ‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్న మాట‌.

స‌త్య‌వ‌తి వ‌ర్గీయులు కాంగ్రెస్ నుంచి గెలిచి ప్ర‌జా ప్ర‌తినిధుల‌య్యారు. వారంతా ఏదోర‌కంగా రెడ్యా చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను వివాద‌స్ప‌దం చేస్తున్నారు. శిలాఫ‌లకంపై పేరు లేద‌ని కొంత మంది, త‌మకు స‌మాచారం ఇవ్వ‌కుండా గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్నారంటూ మరికొంద‌రు రెడ్యాను ఉక్కిరిబిక్కిరిచేస్తూ ఆందోళ‌న‌లు చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్ధంకాక రెడ్యా త‌ల ప‌ట్టుకుంటున్నార‌ట‌.

ఎమ్మెల్యేగా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌డంతోపాటు మొత్తం స‌త్య‌వ‌తి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతుండ‌టంతో బిక్క‌మొఖం వేసుకుని చూస్తున్నార‌ట రెడ్యా. ఒక సీనియ‌ర్ ప్ర‌జా ప్ర‌తినిధిగా త‌న‌కు ఇచ్చే గౌర‌వం ఇదేనా..? అని పార్టీలో ప‌లువురు ముందు రెడ్యా త‌న బాధ‌నంతా వెల్ల‌గ‌క్కుతున్నార‌ట‌. భ‌విష్య‌త్తులో కూడా ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కానీ.. కేబినేట్ హోదా క‌లిగిన నామినేటెడ్ ప‌ద‌వి కానీ.. ఇవ్వ‌బోర‌నే ప్రచారం జ‌ర‌గ‌డంతో మ‌రింత దిగులు చెందుతున్నార‌ని జ‌నాలు అనుకుంటున్నారు. రెడ్యా నాయ‌క్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఆయ‌న కూతురు క‌విత మ‌హ‌బూబాబాద్ ఎంపీ, ఒకే కుటుంబం నుంచి ఇద్ద‌రికీ ప‌ద‌వులు ఉన్నాయి. క‌నుక ఇక కేబినేట్ ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే అంటున్నారు. ఇక ఎమ్మెల్యేగా ఉంటూ త‌న జూనియ‌ర్‌తో అడ్జెస్ట్ అయిపోవాల్సిందేన‌ని జ‌నాలు చెవులు కొరుక్కుంటున్నారు.

 

 

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

   an hour ago


మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

   an hour ago


మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

   3 hours ago


కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

   3 hours ago


అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

   5 hours ago


రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

   5 hours ago


కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

   7 hours ago


కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

   7 hours ago


అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

   8 hours ago


‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle