newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆరురోజుల నిర్బంధం.. మావోయిస్టుల చెరనుంచి కానిస్టేబుల్‌కి విముక్తి

14-05-202014-05-2020 14:42:13 IST
Updated On 14-05-2020 18:14:57 ISTUpdated On 14-05-20202020-05-14T09:12:13.361Z14-05-2020 2020-05-14T09:11:01.710Z - 2020-05-14T12:44:57.912Z - 14-05-2020

ఆరురోజుల నిర్బంధం.. మావోయిస్టుల చెరనుంచి కానిస్టేబుల్‌కి  విముక్తి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఓ కానిస్టేబుల్‌ని విడిచిపెట్టారు. దీంతో ఈ కథ సుఖాంతం అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆరు రోజుల క్రితం  నిర్బంధం అయిన కానిస్టేబుల్ ని విడిచిపెట్టారు మావోయిస్టులు. భార్యా బిడ్డల వేడుకోలు, జర్నలిస్టులు జరిపిన సంప్రదింపులతో  ప్రజాకోర్టులో ఓ పోలీసు కానిస్టేబుల్ కి విముక్తి కలిగించారు మావోయిస్టులు. ఛత్తీడ్ ఘడ్ సుకుమా జిల్లా జేగురుకొండ కి చెందిన కట్టం సంతోష్ పోలీసు కానిస్టేబుల్ గా బీజాపూర్ జిల్లా భూపాల్ పట్నం లో పనిచేస్తున్నారు.6 రోజుల క్రితం సెలవు తీసుకుని బీజాపూర్ జిల్లా కేంద్రానికి వచ్చాడు.అక్కడ ఆలయదర్శనం చేసుకొని స్నేహితుడి కోసం ఎదురుచూస్తున్న సంతోష్ కి సాధారణ గ్రామస్తుల వేషధారణలో మావోయిస్టులు అతనిని కిడ్నాప్ చేశారు.

విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ భార్య సునీత,కూతురు భావన తన భర్త కు ఎలాంటి అపకారం తలపెట్టవద్దని మావోయిస్టులను వేడుకుంది. అయినా వారి నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో కొందరు జర్నలిస్టులను తీసుకుని అడవి బాట పట్టింది.దీనితో మావోయిస్టులు బీజాపూర్ లోని దుర్గం అడవుల్లో ప్రజాకోర్టును ఏర్పాటు చేసి భార్య, బిడ్డ,జర్నలిస్టుల బృందాన్ని ఆహ్వానించారు.

1500 మంది గ్రామస్తుల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహించారు మావోయిస్టులు. గూడెంలలో కూంబింగ్ చేసే పోలీసులు గిరిజన యువతులపై అత్యాచారాలు,దాడులు చేస్తున్నారని మావోయిస్టులు ఆరోపించారు. తన భర్త ఇటువంటి పనులు చేయలేదని,తన భర్తకు క్షమాభిక్ష పెట్టాలని గ్రామస్తుల ఎదుట భార్య సునీత మావోయిస్టులను ప్రాధేయ పడింది.చివరకు ఆమె కన్నీళ్లకు కరిగిన మావోయిస్టులు ఒప్పందం ప్రకారం మళ్ళీ కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వగ్రామానికి కుటుంబంతో సహా వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు.

అందుకు కానిస్టేబుల్ సంతోష్, భార్య,బిడ్డ అంగీకరించడంతో గ్రామస్థుల సమక్షంలో ప్రజాకోర్టులో సంతోష్ ను వారి భార్య,బిడ్డ,జర్నలిస్టుల బృందానికి అప్పగించారు. కిడ్నాప్ అయిన కానిస్టేబుల్ సంతోష్ కూడా తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి స్వంత ఊరులో వ్యవసాయం చేసుకుంటానని తెలిపారు. దీంతో కానిస్టేబుల్ కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle