newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

ఆరా సంస్థ స‌ర్వే రిపోర్ట్ అవుట్.. గెలుపు ఆ పార్టీదేన‌ట‌..!

22-10-201922-10-2019 15:11:56 IST
Updated On 22-10-2019 16:38:49 ISTUpdated On 22-10-20192019-10-22T09:41:56.159Z22-10-2019 2019-10-22T09:41:50.749Z - 2019-10-22T11:08:49.581Z - 22-10-2019

ఆరా సంస్థ స‌ర్వే రిపోర్ట్ అవుట్.. గెలుపు ఆ పార్టీదేన‌ట‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2018 డిసెంబ‌ర్ మాసంలో జ‌రిగిన అసెంబ్లీ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో హుజూర్‌న‌గ‌ర్ ఎమ్మెల్యేగా ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి విజ‌య‌డంఖా మోగించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ త‌రువాత జ‌రిగిన పార్ల‌మెంట్‌ ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి న‌ల్గొండ స్థానం నుంచి కాంగ్రెస్ త‌రుపున పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. దీంతో హుజూర్‌న‌గ‌ర్ స్థానానికి ఉత్త‌మ్ రాజీనామా చేశారు. అనంత‌రం ఉప ఎన్నిక వ‌చ్చింది.

ఇప్పుడు ఆ ఉప ఎన్నిక‌లో ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా బ‌రిలో నిలిచారు. తెరాస నుంచి సైదిరెడ్డి అభ్య‌ర్ధిగా బ‌రిలో దిగారు. ఈ రెండు పార్టీలు ఈ పోరును చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. రేసులో బీజేపీ, టీడీపీ అభ్య‌ర్ధులు ఉన్న‌ప్ప‌టికి కూడా పోరు టీఆర్ఎస్‌, కాంగ్రెస్ మ‌ధ్యే ప్ర‌ధానంగా జ‌రిగింది.

నేడు పోలింగ్ ముగిసిన త‌రువాత ప్రముఖ స‌ర్వే సంస్థ ఆరా పోల్ స్ట్రాట‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్ త‌న స‌ర్వేను ప్ర‌క‌టించింది. ఈ ఆరా సంస్థ స‌ర్వే గతంలో అనేక‌మార్లు నిజ‌మైంది. తెలంగాణ‌, ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆరా సంస్థ సర్వే దాదాపు నిజ‌మైంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కూట‌మి ఘ‌న విజయం సాధిస్తుంద‌ని ల‌గ‌డ‌పాటి చెప్ప‌గా, ఆ స‌మ‌యంలో ఆరా సంస్థ మాత్రం లేదు.. టీఆర్ఎస్ ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని, కారు పార్టీకి 75 నుంచి 85 అసెంబ్లీ స్థానాలు వ‌స్తాయ‌ని ఆరా సంస్థ వాదించింది. చివ‌ర‌కు ఆరా సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేనే నిజ‌మైంది.

ఇప్పుడు హుజూర్‌న‌గ‌ర్‌ లో పోలింగ్ ముగిసిన త‌రువాత ఆరా సంస్థ త‌న స‌ర్వే ఫ‌లితాన్ని ప్ర‌క‌టించింది. ఈ స‌ర్వే ప్ర‌కారం హుజూర్‌న‌గ‌ర్‌లో కాంగ్రెస్ ఓడిపోబోతుంది. టీఆర్ఎస్ ఘ‌న విజ‌యాన్ని సాధించ‌బోతుంది. ఈ ఆరా సంస్థ చెబుతున్న ఓటింగ్‌శాతం ప్ర‌కారం చూస్తే ఈ ఉప ఎన్నిక‌లో.. టీఆర్ఎస్ 50.48 శాతం ఓట్ల‌ను కైవ‌సం చేసుకోబోతోంది. అంటే స‌గానికిపైగా ఓట్లు టీఆర్ఎస్ ఖాతాలోకి వ‌స్తున్నాయ‌ని ఈ స‌ర్వే సంస్థ చెబుతోంది. కాంగ్రెస్‌కు మాత్రం 39.95 శాతం ఓట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని ఆరా సంస్థ చెబుతోంది. ఇత‌ర పార్టీల అంద‌రి అభ్య‌ర్ధుల‌కు క‌లిపి 9.57 శాతం ఓట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని ఈ స‌ర్వే సంస్థ చెబుతోంది.

ఈ స‌ర్వే ఫ‌లితం ప్ర‌కారం టీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు మ‌ధ్య భారీగా తేడా ఉంది. దాదాపు ప‌దిశాతం ఓట్లు టీఆర్ఎస్‌కు అధికంగా రాబోతున్నాయి. ఈ స‌ర్వేనే నిజ‌మైతే టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నిక‌లో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోవ‌డం కూడా ఖాయ‌మ‌నిపిస్తోంది. టీడీపీ, బీజేపీలు కూడా రేసులో ఉన్నా వాటి ప్ర‌భావం ఏ మాత్రం లేద‌ని, ఆ రెండు పార్టీలు కోలుకోలేదు అన్న‌ది ఆరా సంస్థ వెల్ల‌డించిన ఓట్ల‌శాతాన్ని బ‌ట్టి స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతుంది. 

 

 

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   7 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   7 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   9 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   10 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   11 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   12 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   14 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   15 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   15 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle