ఆబ్కారీ మంత్రికే టోకరా.. కడియం నొక్కేసిన కేటుగాళ్ళు
14-02-202014-02-2020 13:05:35 IST
Updated On 14-02-2020 13:13:54 ISTUpdated On 14-02-20202020-02-14T07:35:35.387Z14-02-2020 2020-02-14T07:35:33.128Z - 2020-02-14T07:43:54.044Z - 14-02-2020

తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అయన శాఖలకు తగ్గట్లుగానే ఆయన కూడా నిండుగా చేతికి ఉంగరాలు, బంగారు కడియం, మెడలో గొలుసుతో ఎక్కడకు వెళ్లినా తెల్లని బట్టలు, తెల్లని బూట్లతో తళుక్కున మెరుస్తుంటారు. అయన చేతికి ఉండే కడియం ఒక విధంగా ఆయనకు సెంటిమెంట్ కూడా అని అయన అనుచరులు చెప్తుంటారు. అయితే ఆ కడియాన్నే కొందరు కేటుగాళ్లు లేపేశారు. ఔను నిజమే. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతి కడియాన్ని గుర్తు తెలియని దుండగులు లేపేశారట. మంత్రి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో గురువారం సాయంత్రం ఓ సన్నిహితుడి వివాహానికి హాజరయ్యారు. దీంతో అక్కడ మంత్రిని కలిసేందుకు అభిమానులు పోటీపడి గుంపులుగా అందరూ ఆయన చుట్టూ చేరి సెల్ ఫోన్స్ తో సెల్ఫీలు దిగారు. షేక్ హ్యాండ్లు కూడా పోటీపడి ఇచ్చారు. ఇదే అదనుగా దొంగలు చేతి వాటాన్ని ప్రదర్శించారు. గుంపులో గోవిందా అని చేతి కడియాన్ని ఎవరో దొంగిలించారు. దీంతో మంత్రి అక్కడే ఉన్న పోలీసులను, వ్యక్తిగత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారట. కడియాన్ని సెంటిమెంట్ గా భావించే మంత్రి మీరేం చేస్తారో నాకనవసరం.. ఆ కడియం నాకు కావాల్సిందేనని ఆదేశాలు జారీచేయడంతో వ్యకిగత సిబ్బంది, పోలీసులు బిత్తర పోయారట. అంతేకాదు కడియం కోసం పోలీసులు వివాహ కార్యక్రమానికి వచ్చిన వారిని ఆ ప్రాంగణంలో ఉన్నవారిని ‘ఎవరైనా తీసుంటే ఇచ్చేయండి, చోరీ చేసిన వారిపై ఎలాంటి చర్యలు ఉండవని అక్కడున్నవారిని బతిమాలుకున్నారట. అయినా ఎలాంటి లాభం లేకపోగా మంత్రి కడియం చోరీ అంటూ ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాగా, ఎంతో ఇష్టంగా ధరించే కడియం కనిపించకపోవడంతో నిరాశకు గురైన మంత్రి ఈ విషయమై విచారణ జరపాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్టు తెలిసింది. ఇక ఈ వార్తపై సోషల్ మీడియాలో వివిధరకాల కామెంట్లు, ట్రోలింగ్స్ మొదలు కాగా ఒక రాష్ట్ర మంత్రి కడియమే చోరీకి గురైందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుందంటూ కొందరు ఎక్కడికో తీసుకెళ్తుండడం విశేషం. కాగా, కొద్ది రోజుల క్రితం ఏపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు మంత్రి పేర్ని నాని మొబైల్‌ను ఎవరో చోరీ చేశారు. మంత్రి సెక్రటేరియట్‌కు వచ్చి, సందర్శకుల్ని కలిసి క్యాంటిన్లో భోజనానికి వెళ్లారు. అప్పటికే తన ఫోన్ ఎవరో చోరీ చేసినట్లు గుర్తించిన మంత్రి ఈ విషయంపై భద్రతా సిబ్బందికి తెలియజేయగా అప్పటికే ఫోన్ రాష్ట్రం దాటేసి నల్గొండ జిల్లాలోని మునుగోడు సమీపంలో ఉన్నట్లు తేలింది. దీంతో చేసేదేం లేక ఫోన్ బ్లాక్ చేసినట్లుగా తెలిసింది. ఇప్పుడు ఇలా మంత్రిగారి కడియం మాయమైంది!

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
29 minutes ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
14 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
12 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
17 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
21 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
a day ago
ఇంకా