newssting
BITING NEWS :
* జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం *మెట్రో రైలు సర్వీసులకు .. అంతర్జాతీయ విమానాలకు అనుమతి లేదు *సినిమా హాల్స్, జిమ్, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, బార్లు, రాజకీయ వేదికలకు అనుమతి లేదు* ఢిల్లీ ఎయిరిండియా విమానంలో కరోనా కలకలం *ఏపీలో కొత్తగా 70 కరోనా కేసులు.. 2944 కి చేరిన కేసులు .. ఏపీలో యాక్టివ్ కేసులు 792 *పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8వ తేదీ వరకు కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు..మొదట మే 31వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలు

ఆప్ గెలుపుతో మ‌న పార్టీలు ఫుల్ హ్యాపీ

12-02-202012-02-2020 12:27:19 IST
Updated On 12-02-2020 17:38:47 ISTUpdated On 12-02-20202020-02-12T06:57:19.400Z12-02-2020 2020-02-12T06:57:17.644Z - 2020-02-12T12:08:47.132Z - 12-02-2020

ఆప్ గెలుపుతో మ‌న పార్టీలు ఫుల్ హ్యాపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుతో తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పార్టీలు ఫుల్ ఖుష్ అవుతున్నాయి. భార‌తీయ జ‌న‌తా పార్టీ దూకుడుకు బ్రేకులు వేసి ఢిల్లీ పీఠాన్ని అర‌వింద్ కేజ్రీవాల్ మ‌రోసారి సొంతం చేసుకోవ‌డం ప‌ట్ల టీఆర్ఎస్‌, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హ్యాపీగా ఉన్నాయి. బ‌య‌ట‌కు చెప్పుకోక‌పోయినా ఇందుకు అనేక కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఢిల్లీలో బీజేపీ ఓడిపోవ‌డం రాజ‌కీయంగా త‌మ‌కు మంచిద‌ని భావిస్తున్నాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలుగు రాష్ట్రాల‌పై క‌న్నేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో విస్త‌రించేందుకు పావులు క‌దుపుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే.. ఏపీలో రెండు బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీల మ‌ధ్య జ‌రుగుతున్న రాజ‌కీయ పోరును త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.

తెలుగుదేశం పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ పార్టీ స్థానంలోకి రావాల‌నేది బీజేపీ ఆలోచ‌న‌. అందుకే టీడీపీ నేత‌ల‌ను పార్టీలో చేర్చుకుంటోంది. టీడీపీ టార్గెట్‌గా ఐటీ దాడులు జ‌ర‌గ‌డం వెనుక కూడా రాజ‌కీయ కారణాలు ఉన్నాయ‌నే అభిప్రాయాలు ఉన్నాయి.

ఎన్నిక‌ల ముందు ఇలానే టీడీపీ నేత‌ల‌పై ఐటీ దాడులు జ‌రిగిన‌ప్పుడు చంద్ర‌బాబు నాయుడు కేంద్రాన్ని తీవ్రంగా నిందించారు. అప్పుడు మ‌రోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాద‌ని చంద్ర‌బాబు భావించారు. కానీ, ఇప్పుడు ఐటీ దాడులు జ‌రుగుతున్న‌ప్పుడు కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనే సాహ‌సం చేయ‌డం లేదు.

కేంద్రంతో ఇంకా పేచీ పెట్టుకుంటే మ‌రిన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయేమోన‌నేది ఆయ‌న భావ‌న‌. బీజేపీ బ‌లంగా ఉంటే ఏపీలో టీడీపీని టార్గెట్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. అదే బ‌ల‌హీనమ‌వుతూ ఉంటే స్నేహ‌హ‌స్తాలు చాస్తున్న చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చెసుకునే అవ‌కాశాలు లేవు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిది కూడా ఇదే ప‌రిస్థితి. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అవుతుంద‌ని, కేంద్రం జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తోంద‌ని, జ‌గ‌న్‌కు చెక్ పెట్ట‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లుపుకుంద‌ని ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. బీజేపీ బ‌ల‌హీన‌ప‌డుతుంటే ఆ పార్టీ ఏపీలో జ‌గ‌న్‌పై దృష్టి పెట్టే అవ‌కాశం ఉండ‌దు.

పైగా జ‌గ‌న్ కేంద్రంలోని బీజేపీతో స‌ఖ్య‌త‌గా ఉండాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ ఓడిపోవ‌డం ద్వారా తాత్కాలికంగా ఆ పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పెద్ద‌గా జోక్యం చేసుకోక‌పోవ‌చ్చు. త‌మ పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెట్టినా త‌మ‌తో స్నేహం కోసం ప్ర‌య‌త్నిస్తున్న చంద్ర‌బాబు, జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్ర‌య‌త్నించ‌దు. అందుకే ఢిల్లీలో బీజేపీ ఓట‌మి టీడీపీ, వైసీపీకి బ‌య‌ట‌కు చెప్ప‌క‌పోయినా మంచి చేసేదే.

ఇక‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు కూడా ఆప్ విజ‌యం సంతోషాన్ని నింపేది. దేశంలో ప్రాంతీయ పార్టీల‌దే భ‌విష్య‌త్ అంటూ కేసీఆర్ బ‌లంగా వాదిస్తున్నారు. ఢిల్లీలో ఆప్ విజ‌యం ఆయ‌న వాద‌న‌కు బ‌లాన్ని ఇస్తోంది. తాను ప్రారంభించాల‌నుకుంటున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌కు ఢిల్లీ ఫ‌లితాలు కొంత క‌లిసివ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఇక‌, తెలంగాణ‌లో బ‌లోపేతం అవ్వాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న బీజేపీకి ఢిల్లీ ఫ‌లితాలు కొంత నిరాశ‌ను మిగిల్చాయి. మొత్తానికి ఢిల్లీ ఫ‌లితాలు కేసీఆర్‌, జ‌గ‌న్‌, చంద్ర‌బాబుకు సంతోషాన్ని నింప‌గా బీజేపీకి, ఆ పార్టీతో జ‌ట్టుక‌ట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మాత్రం చేదు ఫ‌లితాలుగా చెప్ప‌వ‌చ్చు.

చదవండి : కేంద్రంలో బీజేపీకి సై.. రాష్ట్రాల్లో మాత్రం నై

బ్రేకింగ్: జూన్ 30 వరకూ లాక్ డౌన్ 5.O

బ్రేకింగ్: జూన్ 30 వరకూ లాక్ డౌన్ 5.O

   21 minutes ago


మెడికల్ స్టూడెంట్స్‌కు జగన్ బంపర్ ఆఫర్

మెడికల్ స్టూడెంట్స్‌కు జగన్ బంపర్ ఆఫర్

   34 minutes ago


వారసులకే జయ ఆస్తులు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

వారసులకే జయ ఆస్తులు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

   3 hours ago


ఒక వైపు కరోనా ఉధృతి.. పిడుగురాళ్ళలో సున్నపురాయి దోపిడీ

ఒక వైపు కరోనా ఉధృతి.. పిడుగురాళ్ళలో సున్నపురాయి దోపిడీ

   7 hours ago


నిమ్మగడ్డ రమేష్ కేసు.. ఎవరెవరు ఏమన్నారంటే...?

నిమ్మగడ్డ రమేష్ కేసు.. ఎవరెవరు ఏమన్నారంటే...?

   7 hours ago


అనంతలో కలకలం రేపిన మిడతల దండు..శాస్త్రవేత్తల భరోసా

అనంతలో కలకలం రేపిన మిడతల దండు..శాస్త్రవేత్తల భరోసా

   8 hours ago


దేశాన్నే అబ్బురపరిచే కేసీఆర్ ‘తీపి కబురు’ ఏమిటి? సర్వత్రా ఆసక్తి

దేశాన్నే అబ్బురపరిచే కేసీఆర్ ‘తీపి కబురు’ ఏమిటి? సర్వత్రా ఆసక్తి

   8 hours ago


వరవరరావుని వెంటనే విడుదల చేయాలి.. భార్య హేమలత డిమాండ్

వరవరరావుని వెంటనే విడుదల చేయాలి.. భార్య హేమలత డిమాండ్

   9 hours ago


వరవరరావుకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

వరవరరావుకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

   10 hours ago


ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కరోనా కలకలం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కరోనా కలకలం

   11 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle