newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

ఆధిప‌త్య పోరు జాక్‌పాట్‌లా త‌గిలింది..!

02-03-202002-03-2020 07:57:06 IST
Updated On 02-03-2020 13:40:31 ISTUpdated On 02-03-20202020-03-02T02:27:06.624Z02-03-2020 2020-03-02T02:26:56.650Z - 2020-03-02T08:10:31.540Z - 02-03-2020

ఆధిప‌త్య పోరు జాక్‌పాట్‌లా త‌గిలింది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. మొత్తం అన్ని జిల్లాల ప‌ద‌వుల‌ను అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితి కైవ‌సం చేసుకుంది. ముందుగా ఊహించ‌న‌ట్లే డీసీసీబీలు గులాబీమ‌యం అయ్యాయి. అయితే, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మ‌న్ల ఎన్నిక మాత్రం టీఆర్ఎస్ అధిష్ఠానానికి కొంచెం త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టింది. ఈ ఎన్నిక‌లు న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో పార్టీ కీల‌క నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరును బ‌హిర్గ‌తం చేసింది.

న‌ల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మ‌న్ ప‌ద‌వి మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి మ‌ధ్య అభిప్రాయ‌బేధాల‌కు దారి తీసింది. ఇప్ప‌టికే జిల్లాలో వీరి మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. జిల్లా పార్టీలో పైచేయి కోసం ఇద్ద‌రు నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు పార్టీలో చ‌ర్చ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో డీసీసీబీ ఛైర్మ‌న్ ప‌ద‌విని త‌మ వ‌ర్గానికి చెందిన వారికి ఇప్పించుకోవాల‌ని ఇద్ద‌రు నేత‌లు ప్ర‌య‌త్నం చేశారు.

ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి దేవ‌ర‌కొండ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌ల్లా ప్ర‌వీణ్‌రెడ్డికి డీసీసీబీ ఛైర్మ‌న్‌గిరి ఇప్పించేందుకు ప్ర‌య‌త్నించారు. ప్ర‌వీణ్‌రెడ్డి ఉస్మానియా యూనివ‌ర్సిటీ విద్యార్థిగా, టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో, తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించారు. ఆయ‌న‌తో పాటు టీఆర్ఎస్‌విలో ఉంటూ ఉద్య‌మంలో పోరాడిన బాల్క సుమ‌న్‌,  గాదారి కిషోర్, ఎర్రోళ్ల శ్రీనివాస్ వంటి వారు రాజ‌కీయంగా స్థిర‌ప‌డ్డారు. కానీ, ప్ర‌వీణ్‌రెడ్డికి మాత్రం ఎటువంటి అవ‌కాశం రాలేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు డీసీసీబీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాల‌ని పార్టీ కూడా భావించింది.

ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి కూడా ఆయ‌న పేరునే సిఫార్సు చేశారు. దీంతో మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి మ‌రో అభ్య‌ర్థిని తెర‌పైకి తీసుకొచ్చారు. ఒక‌వైపు ప‌ల్లా, మ‌రో వైపు జ‌గ‌దీశ్‌రెడ్డి ఇద్ద‌రూ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితులు. ఎవ‌రి మాటా కాద‌న‌లేని ప‌రిస్థితి. ఒక‌రు సూచించిన వారికి ప‌ద‌వి ఇస్తే మ‌రొక‌రికి కోపం. దీంతో మ‌ధ్యేమార్గంగా టీఆర్ఎస్ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత భ‌ర్త గొంగిడి మ‌హేంద‌ర్‌రెడ్డికి ఈ ప‌ద‌విని అప్ప‌గించింది. ఇప్ప‌టికే సునిత విప్‌గా ఉండ‌గా ఇప్పుడు మ‌హేంద‌ర్‌రెడ్డి డీసీసీబీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్క‌డం జాక్‌పాట్ అనే చెప్పారు.

ఇదే ప‌రిస్థితి మ‌హ‌బూబ్‌న‌గర్ జిల్లాలోనూ చోటుచేసుకుంది. ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలోని ఇద్ద‌రు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజ‌న్‌రెడ్డి డీసీసీబీ ఛైర్మ‌న్ ప‌ద‌విని త‌మ వ‌ర్గానికి చెందిన వారికి ఇప్పించుకోవాల‌ని ప్ర‌య‌త్నించారు.

విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, ర‌ఘునంద‌న్‌రెడ్డి, జూప‌ల్లి భాస్క‌ర్‌రావు వంటి టీఆర్ఎస్ నేత‌లు డీసీసీబీ ఛైర్మ‌న్ ప‌ద‌వి కోసం పోటీ ప‌డ్డారు. మంత్రులు ఇద్ద‌రూ త‌మ అనుచ‌రుల కోసం ప్ర‌య‌త్నించారు.

చివ‌ర‌కు ఊహించ‌ని విధంగా నిజాం పాషా అనే నేత‌కు ఈ ప‌ద‌వి ద‌క్కింది. ఒక్క డీసీసీబీ అయినా మైనారిటీకి ఇవ్వాల‌నే ఈక్వేష‌న్ తెర‌పైకి తీసుకువ‌చ్చి ఇద్ద‌రు మంత్రులు సూచించిన వారు కాకుండా మైనారిటీ నేత అయిన నిజాం పాషాకు డీసీసీబీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కింది.

అయితే, ఎంఐఎం అధినేత అస‌దుద్దిన్ ఓవైసీ కోరిక మేర‌కే ఆయ‌న‌కు ప‌ద‌వి ద‌క్కిన‌ట్లు కూడా ప్ర‌చారం సాగుతోంది. మొత్తానికి ఈ రెండు జిల్లాల్లో కీల‌క నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొత్త వారికి జాక్‌పాట్‌లా త‌గిలింది.

 

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   5 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   7 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   10 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   12 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   13 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   13 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   14 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   14 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   14 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   14 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle