newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

04-06-202004-06-2020 08:40:21 IST
Updated On 04-06-2020 10:06:49 ISTUpdated On 04-06-20202020-06-04T03:10:21.684Z04-06-2020 2020-06-04T03:10:16.429Z - 2020-06-04T04:36:49.859Z - 04-06-2020

ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వేసవి దాటి వర్షాకాలం వచ్చినా గిరిజన గూడాల్లో నరకానికి దారులు తెరుచుకుంటాయ్.. అడుగంటిన బోర్లు , ఎండిపోయిన బావులు.. జలదారలేని వాగులు.. నీటి చుక్క జాడలేక గొంతులు ఎండుతాయ్. పశువులకు నీళ్లు పెట్టలేక కబేళాలకు తరలించాల్సిన దుస్థితి. ఇక వ్యవసాయం మాట దేవుడెరుగు దాహం తీర్చుకుని రేపటి వరకు బ్రతికితే చాలనుకుంటాయి ఆ పల్లెలు. ఇంతకీ అంతటి కరువు కోరల్లో చిక్కుకున్న పల్లెలు ఎక్కడున్నాయి. దాహమో రామచంద్రా అని వేడుకుంటున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడా? మురికి నీళ్లే ఆ గిరిజనులకు దిక్కా.. నీళ్లు లేక.. కలుషిత నీటిని తాగక తప్పక మృత్యు ఒడికి చేరుతున్న గిరిజన గూడాలు ఆదిలాబాద్ జిల్లాలో అనేకం కనిపిస్తాయి. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పచ్చటి అడవులతో చుట్టూ జలసిరులతో కనువిందు చేసే దక్షిణ కశ్మీరం అనే పేరుంది. అటు గోదావరి ఇటు ప్రాణహిత , పెన్ గంగా , పెద్దవాగు చుట్టూ జలదారే. కానీ ఇదంతా కేవలం వేసవికి ముందు వరకు మాత్రమే. ఎండకాలం రావడమే ఆలస్యం అడవుల్లో విసిరేసినట్టుగా ఉండే గిరిజన గూడాల బ్రతుకులు అస్థిత్వాన్ని కోల్పోతాయి. పచ్చగా ఉండాల్సిన పరిసర ప్రాంతాలు భానుడి భగభగలకు మాడి మసయిపోతాయి. అంతకంతకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు బావులు ఎండిపోయి బోర్లు అడుగంటిపోయి గిరిజన గూడాలు గొంతెండిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పాడిన కొమ్రంభీం ఆసిపాబాద్ లోనూ ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మంగి గ్రామ పంచాయతీలోని సుమారు 10 ఆదివాసి గూడాలు నివాసం ఉంటాయి  ఒకప్పుడు నక్సలైట్లు ఎక్కువగా నివాసాలు ఏర్పరుచుకున్న దట్టమైన అటవీ ప్రాంతం ఇప్పుడిప్పుడే కొంత సర్దు మనుగుతున్న ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి అడవి చుట్టూ మారుమూల ప్రాంతాల్లో జీవిస్తున్న ఆదివాసి గూడాలు కంప్యూటర్ యుగంలో ఏ అవసరాలకైనా తమ గూడాలు దాటి వేరు వేరు గ్రామాలకు వెళ్లి వస్తూ తమ జీవనశైలిని మార్చుకుంటూ కొంత కొంత మార్పు తెచ్చుకుంటూ జీవిస్తున్నారు 

అయినప్పటికీ కొన్ని మారుమూల గుట్టల ప్రాంతంలో ఉన్న గూడాలు మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు నిత్యావసరాల వస్తువులు తెచ్చుకోవాలన్న కనీసం చుట్టూ 20 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసిన పరిస్థితి ఉంది అయినా సరే వెళదామన్నా రోడ్డు సౌకర్యం కూడా సరిగా ఉండదు. 

ఏదైనా పెద్ద రోగం వచ్చిన మహిళలు గర్భవతులు వృద్ధులకు అడవిలో ఏదైనా విష పురుగులు కాటేసినా మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలన్న ఫోన్ సౌకర్యం కూడా ఉండదు ఇలా ఏదైనా అపాయం కలిగినా వాహనాలు కూడా వెళ్లలేని కారడివి ఆసుపత్రులకు వెళ్లాలంటే ఎడ్లబండ్లపై తీసుకు వెళ్లే పరిస్థితి రాళ్ళ రప్పల పై వెళితే  అయినా ప్రాణాలు దక్కుతాయని నమ్మకం లేదు.

ఎండాకాలం ముగిసి వానాకాలం వచ్చినా కనీసం తాగడానికి గుక్కెడు మంచినీరు కూడా దొరకని పరిస్థితి మంగి గ్రామపంచాయతీలో 10 గూడాలు ఉన్నాయి తొక్కి కూడా,భీమ్ రెల్లి గూడా,కొద్ది గూడా, హాస్టల్ కూడా, కొత్తగూడ,కోలామ్ కూడా, పిట్టగుడ,సిరం పురం గూడా తదితర గుడాలు ఉన్నాయి వీరంతా వ్యవసాయం తడకలు అల్లుకొని జీవిస్తారు వీరికి ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఏదైనా అత్యవసరం వచ్చిన కనీసం ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు ఒకే ఒక గూడెంలో అది కూడా అడవికి దగ్గరకు వెళ్లి నిలబడితే తప్ప సిగ్నల్ రాదు ఎవరైనా సరే అక్కడికి  ఫోన్ చేసి వెళ్ళాలి.

ఇదిలా ఉంటే కొన్ని గూడాలు నీటి సౌకర్యం లేక ప్రభుత్వం ఇచ్చిన నీటి ట్యాంకర్ ద్వారా గ్రామ పంచాయతీ సిబ్బంది నీటి సరఫరా చేస్తున్నారు మంగి గ్రామపంచాయతీ  సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తొక్కి గూడా గూడానికి మిగతా కూడాలకు సత్సంబంధాలు కూడా ఉండవు వీరి గూడెం ఏర్పడి సుమారు 60 సంవత్సరాలు అవుతుంది అక్కడ 20 కుటుంబాలు వంద మందికిపైగా గూడెం వాసులు జీవిస్తున్నారు అక్కడ ఒక బావిని తవ్వుకున్నారు.

ఆ నేల అంతా పరుపు నేల కావడంతో బావిలో నీరు రాలేదు ఒక చిన్న ఊట పడి ఆ నీరే వీరి దాహార్తి తీరుస్తుంది ఆ నీరు కూడా కలుషిత నీరు లాగా ఉంటాయి అది కాస్తా ఎండిపోవడంతో ప్రభుత్వం ఒక బోరు వేయించింది అది సుమారు నాలుగు నుంచి ఐదు వందల అడుగుల లోతులో నీరు వచ్చాయి కొన్ని రోజుల తర్వాత అవి కాస్త ఎండిపోయాయి. మళ్లీ ఇంకో పక్కన వేరొక బోరు వేశారు అది గంటకు ఒక బిందె చొప్పున నీరు పోస్తుంది వాటితోనే రాత్రి పగలు నిద్ర కూడా పోకుండా అదే బోరు దగ్గర చిమ్మ చీకటిలో ఉండి తాగటానికి నీరు పట్టుకుంటారు. స్నానాలకు నిత్య అవసరానికి బావిలోని ఊట నీరు ఒక రోజులో కుటుంబానికి ఒక బిందె చొప్పున వరుసక్రమంలో తెచ్చుకొని వాడుకుంటారు  బావిలో రాత్రి  సమయాలలో పాములు కూడా తిరుగుతూ కనిపిస్తాయి ప్రాణాలకు తెగించి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని గిరిజనులు వాపోతున్నారు. 

కనీసం ఎడ్ల బండి పైన అయినా మంగి గ్రామానికి  వెళ్దామన్నా రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదు. ఆ గూడెంలో యువకులు పెళ్లి ఈడుకు వచ్చిన పెళ్లిళ్లు మాత్రం కావడం లేదు దీనికి కారణం నీటి సమస్య. ఎందుకంటే అబ్బాయిని చూడటానికి వచ్చినవారికి నీటి సమస్య చూసి మీరు నీళ్ల కోసం ఇబ్బంది పడేది కాక మా ఇంటి ఆడ పిల్లలను కూడా ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు అని వెనుతిరిగి  పోతున్నారని మా బిడ్డలకు ఇక పెళ్లిలు అవుతాయో కాదోనని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ నీరు కూడా సరిగా రావడం లేదని  ఎన్నికలప్పుడు ప్రతి ఒక్క లీడర్ వచ్చి నీటి సమస్య రోడ్డు సమస్య తీరుస్తామని చెప్పి వెళ్లిపోతారు ఓట్లు వేశాక ఒక్కసారైనా మా గోసలు పట్టించుకోరు కనీసం ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా మీ సమస్యలు ఏంటి అని అడిగిన వారు కూడా లేరని గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటికైనా మా బాధలు పట్టించుకోని నీరు రోడ్డు మార్గం సమస్య తీర్చాలని వారు వేడుకుంటున్నారు.

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle