newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆదిలాబాద్‌లో నూజివీడు తరహా ఘటన..అమ్మాయిల హాస్టల్లో అబ్బాయి

26-02-202026-02-2020 15:18:49 IST
2020-02-26T09:48:49.326Z26-02-2020 2020-02-26T09:48:07.238Z - - 16-04-2021

ఆదిలాబాద్‌లో నూజివీడు తరహా ఘటన..అమ్మాయిల హాస్టల్లో అబ్బాయి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలోని కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో విద్యార్ధినుల రూంలో ఓ కుర్రాడు తిష్ట వేయడం అది మేనేజ్ మెంట్ దృష్టికి రావడంతో పెద్ద రచ్చ జరిగింది. ఈ ఘటన మరిచిపోకముందు తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలంలోని ఓ బాలికల వసతి గృహంలోకి ఓ యువకుడు చొరబడడం సంచలనం రేపుతోంది. వసతిగృహంలో ఉంటున్న స్నేహితురాలి గదిలోకి అతని వెళ్ళినట్టు తెలుస్తోంది.

ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ గదిలో మరో ముగ్గురు బాలికలు ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వారం రోజుల క్రితం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కుమురంభీం జిల్లాకు చెందిన ఓ యువకుడు ప్రహరీ దూకి, కిటికీ గుండా ఈ వసతిగృహంలోకి చేరాడని తెలుస్తోంది. యువకుడి గ్రామానికే చెందిన ఓ బాలిక ఇక్కడ వసతి గృహంలో ఉంటూ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

ఆ బాలికతో ఉన్న సాన్నిహిత్యంతో యువకుడు వసతిగృహంలోని ఆమె గదిలోకి వచ్చాడు. అయితే అతను వచ్చిన సంగతి గది శుభ్రం చేయడానికి వెళ్లిన సిబ్బంది వల్ల బయటపడింది. దీంతో అమ్మాయిల రూపంలో యువకుడిని గమనించిన సిబ్బంది ప్రిన్సిపల్‌కు సమాచారం అందించారు. దీనిపై ఎంఈవో ఫిర్యాదుతో.. యువకుడికి, విద్యార్థినికి పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

ఆ గదిలో ఉండే మరో ముగ్గురు బాలికలనూ పాఠశాల నుంచి తొలగించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ప్రిన్సిపల్‌ వివరించారు. ఈ సంఘటన నేపథ్యంలో ఇరువురి తల్లిదండ్రులు వారికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. పర్యవేక్షణా లోపం వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   13 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   11 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   16 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   20 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle