newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.. కేసీఆర్

02-12-201902-12-2019 11:00:17 IST
2019-12-02T05:30:17.296Z02-12-2019 2019-12-02T05:30:14.157Z - - 15-08-2020

ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.. కేసీఆర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శంషాబాద్ సమీపంలో పశువైద్యురాలు ప్రియాంకా రెడ్డిపై జరిగిన దారుణ అత్యాచార హత్య పట్ల ఎట్టకేలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఆర్టీసీ కార్మికులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో కేసీఆర్‌ ప్రియాంకారెడ్డిపై జరిగిన ఘాతుకాన్ని ప్రస్తావించి ఆవేదన చెందారు. ఇది అమానుషమైన దుర్ఘటన అని అన్నారు. ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఆర్టీసీలో మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటలలోపు విధులు పూర్తయ్యేలా డ్యూటీలు ఉండాలని అధికారులను ఆదేశించారు. 

నిన్నమొన్ననే దరిద్రపు గాడిదకొడుకులు ఒక డాక్టర్‌ని చంపేశారు. ఏం చేద్దాం.. మన మధ్య మృగాళ్లు ఉన్నారు. ఆడపిల్లలను వేటాడి వధించే శాడిజం మన సమాజంలోనే మన కళ్లముందే ఉంది. కానీ మన బిడ్డలను కాపాడుకోవలసిన బాధ్యత మనదే. మనమీదే ఉంది. అందుకే నావంతుగా ఆదేశాలు ఇస్తున్నాను. ఆర్టీసీలో పని చేస్తున్న మహిళా కండక్టర్లు రాత్రి ఎనిమిది గంటలలోపు తమ విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేలా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా వాళ్లకు అనువైన డ్యూటీలను వేయాలి. రాత్రి 10 లేక 11 గంటలవరకు మహిళా కండక్టర్లచే పనిచేయించే పరిస్థితి పోవాలి అని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్‌.. ఈ కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని సీఎం అధికారులను కోరారు.  ఇటీవల వరంగల్‌లో ఓ మైనర్‌ బాలిక హత్య విషయంలో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తై తీర్పు వెలువడిందని గుర్తుచేశారు. అదే తరహాలో ఈ కేసులో కూడా సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో ప్రియాంకారెడ్డి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

తెలంగాణలో ఒక విద్యావంతురాలిని నమ్మించి మోసం చేసి అత్యాచారం చేసి సజీవంగా తగులబెట్టిన ఘాతుక చర్య పట్ల గత మూడు రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడంపై వివిధ వర్గాల ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. టీవీ చర్చల్లో ఈ సీఎం నిర్లక్ష్య వైఖరి పట్ల వాడి వేడి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం ఆర్టీసీ కార్మికులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో కేసీఆర్‌ అవకాశాన్ని వినియోగించుకుని శంషాబాద్ ఉదంతంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు.

2012లో దేశరాజధానిలో నిర్బయ ఘటన జరిగినప్పుడు యావత్ సమాజంతో పాటు నాటి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌తో సహా ప్రభుత్వ యంత్రాంగం మొత్తంగా శరవేగంగా స్పందించింది.  షీలాదీక్షిత్ నిర్భయ ఘటనను తీవ్రంగా ఖండించటమే కాకుండా, బాధితురాలి కుటుంబాన్ని కలిసి ఓదార్చే సాహసం కూడా తనకు లేదని చెబుతూ డిల్లీని అత్యాచారాల రాజధానిగా పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే ఇలాంటి ఘటనలకు అధికారులే పూర్తి బాధ్యత వహించాలని, అత్యాచార కేసులన్నింటినీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో విచారించి సత్వర న్యాయం అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

కానీ అలాంటి ఘటనే హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్‌లో గురువారం వేకువజామున చోటు చేసుకుని 26 ఏళ్ల వెటర్నరీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం చేసి తగులబెట్టినప్పుడు మూడు రోజుల వరకు తెలంగాణ ముఖ్యమంత్రి నోరు విప్పకపోవడం జాతీయ వ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారి తీసింది.

కేసీఆర్ తనయుడు కేటీఆర్ అలా ట్వీట్ చేసి తన విచారాన్ని వ్యక్తం చేసి ఊరకుండిపోయారు తప్పితే ప్రభుత్వాధినేత కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కూతురు కవిత కానీ ఎవరూ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించాలనే కనీస స్పృహ కూడా ప్రదర్శించకపోవడం జనాల్ని మండించింది.  చివరకు రిపబ్లిక్ టీవీ సీఈఓ అర్నాబ్ గోసామి తెలంగాణ సీఎం నిర్లక్ష్యపూరిత వైఖరిపై ద్వజమెత్తారు. పౌర సమాజం, జాతీయ మీడియా కేసీఆర్ గురించి ఆయన కుటుంబం గురించి తీవ్ర విమర్శలు చేశాక మూడు రోజుల తర్వాత కేసీఆర్ మేలుకుని తీరిగ్గా ప్రియాంక రెడ్డి గురించి విచారం వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రి స్వయంగా జరిగిన దారుణం గురించి ప్రకటించనంతవరకు తమ ఇంటికి రాజకీయ నాయకులు ఎవరూ రావద్దని బాధితురాలి కుటుంబం తెగేసి చెప్పడమే కాకుండా ఇంటి తలుపులు మూసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వ పరువు గంగలో కలిసినట్లయింది. పైగా ఆ మూడురోజుల్లోనే హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుటుంబంలో పెళ్లికి హాజరైన కేసీఆర్, ఆయన కూతురు కవిత నవ్వు ముఖాలతో ఫోటోలకు పోజివ్వడం జనాల్ని ఇంకా మండించింది.

ఈ నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో కేసీఆర్ చాలా ఆలస్యంగా అత్యాచార బాధితురాలి గురించి విచారం వ్యక్తం చేస్తూ ప్రకటించారు

 

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

   an hour ago


ఏపీలో తగ్గిన కేసుల తీవ్రత.. కోలుకున్న లక్షా 80వేలమంది

ఏపీలో తగ్గిన కేసుల తీవ్రత.. కోలుకున్న లక్షా 80వేలమంది

   13 hours ago


కరోనానుంచి కోలుకున్న అమిత్ షా

కరోనానుంచి కోలుకున్న అమిత్ షా

   14 hours ago


 ఏపీలో ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడంటే...?

ఏపీలో ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడంటే...?

   15 hours ago


కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి.. గవర్నర్ పిలుపు

కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి.. గవర్నర్ పిలుపు

   17 hours ago


ఉప్పొంగెలే గోదావరి... జోరుమీదున్న శబరి

ఉప్పొంగెలే గోదావరి... జోరుమీదున్న శబరి

   18 hours ago


కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా

కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా

   19 hours ago


కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

   21 hours ago


కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   a day ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle