newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

ఆడపిల్లలకు రక్షణ ఏది? నిర్భయంగా తిరిగే రోజులెప్పుడు?

30-11-201930-11-2019 13:19:57 IST
Updated On 30-11-2019 13:21:58 ISTUpdated On 30-11-20192019-11-30T07:49:57.027Z30-11-2019 2019-11-30T07:46:31.102Z - 2019-11-30T07:51:58.616Z - 30-11-2019

ఆడపిల్లలకు రక్షణ ఏది? నిర్భయంగా తిరిగే రోజులెప్పుడు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆడపిల్లను కడుపులోనే చిదిమేస్తారు

పుడితే పసిప్రాయంలోనే మొగ్గలా నలిపేస్తారు

బడికి వెళితే వెకిలిచేష్టలతో విసిగిస్తారు

కాలేజీకి వెళితే యాసిడ్ పోసి చంపేస్తారు

ఆస్పత్రికి వెళితే మత్తులో ఉండగా వేధిస్తారు 

ఉద్యోగానికి వెళితే వేధింపులతో ఉసురు తీస్తారు

అత్తింట్లో కట్నంకోసం హింసిస్తారు

ఆడపిల్ల మాన ప్రాణాలకు రక్షణ లేదా? 

నరరూప రాక్షసులను సమాజం నుంచి తరిమేద్దాం 

నిర్భయ చట్టం లాంటి కఠిన చట్టాలు ఎన్ని వచ్చినా ఆడపిల్లలకు, మహిళలకు, ఉద్యోగినులకు రక్షణ లేకుండా పోతోంది. అమ్మాయిలు నిర్భయంగా తిరగాలని ప్రభుత్వాలు భావిస్తే.. నేరస్తులు నిర్భయంగా, నిర్లజ్జగా తిరిగేస్తున్నారు. డాక్టర్ ప్రియాంకారెడ్డిని అత్యాచారం చేసి, దహనంతో హతమార్చిన తీరు సభ్య సమాజాన్ని నివ్వెరపరిచింది.

 Dr. Priyanka Reddy murder In Hyderabad

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. డాక్టర్ ప్రియాంకా రెడ్డి ఘటన మరిచిపోకముందే  ప్రియాంకను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసిన ప్రాంతానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలోనే ఓ వివాహిత శుక్రవారం రాత్రి హత్యకు గురైంది. శంషాబాద్‌లోని సిద్దులగుట్టకు వెళ్లే మార్గంలో ఓ మహిళను దహనం చేశారు.

ఆమెపై అత్యాచారం చేసి, తర్వాత హత్యచేసి దహనం చేయడానికి ప్రయత్నించారు దుండగులు. ప్రియాంక హత్య జరిగిన 48 గంటల వ్యవధిలోనే మరో ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. 

ఇవి చాలవన్నట్టుగా వరంగల్, చిత్తూరు జిల్లాల్లో కామాంధుల దాడికి పసిమొగ్గలు రాలిపోయాయి. ఆరేళ్ల చిన్నారిపై పదిహేనేళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండల కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన బాలుడు ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి జరిపాడు.

Image result for షాద్ నగర్ ఆందోళన"

సాయంత్రం కూలి పనుల నుంచి ఇంటికి వచ్చిన తల్లి బాలిక స్పృహలో లేకపోవడంతో ఆందోళనకు గురైంది. కొద్దిసేపటికి స్పృహలోకొచ్చిన బాలిక జరిగిన విషయం తల్లికి తెలియజేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. 

దేశరాజధాని సమీపంలోని గురుగ్రాంలో మరో కామాంధుడు తన వెకిలి చేష్టలను బయటపెట్టాడు. ప్రయివేట్ హాస్పిటల్‌కు చికిత్స కోసం వచ్చిన పేషెంట్‌పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. నిందితుడు అక్కడే నర్సుగా పనిచేస్తున్నాడు.

సర్జరీ చేయించుకుని వచ్చిన తర్వాత 40 ఏళ్ళ మహిళపై నర్సు లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ఇంకా మత్తునుంచి పూర్తిగా తేరుకోకముందే ఆమెను తాకరాని చోట నిందితుడు తాకాడు. ఈ విషయం తన భర్త ద్వారా పోలీసులకు ఫిర్యాదుచేసింది బాధిత మహిళ. 

డాక్టర్ ప్రియాంకా రెడ్డి కేసులో నిందితుడైన చెన్నకేశవులు తల్లి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘‘నా కొడుకుకు ఉరేసినా ఫర్వాలేదు.. నాకు ఆడపిల్లలు ఉన్నారు.. ఎవరికీ ఇలాంటి అన్యాయం జరగొద్దు..  ప్రియాంక రెడ్డిని చంపినట్లు నా కొడుకును కూడా చంపండి’’ అంటూ చెన్నకేశవులు తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన నిందితుల స్వంత గ్రామాల్లోనూ వారిని శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇంట్లో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు. నిందితుల్ని ఉరి తీయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. క్యాండిల్ ర్యాలీలు తీశారు. ప్రియాంకా నిందితుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ ప్రియాంకారెడ్డికి నివాళులర్పిస్తున్నారు.

ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగకూడదని కోరుతున్నారు. మహిళలపై తరచూ జరుగుతున్న దాడుల నివారణకు చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

Image

ఇదిలా ఉంటే.. డాక్టర్ ప్రియాంకపై నలుగురు కాకుండా ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినట్లుగా అనుమానాలున్నాయి. ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరారీలో ఉన్న ఐదో నిందితుడు నారాయణపేట జిల్లా పొర్లకు చెందిన యువకుడిగా పోలీసులు భావిస్తున్నారు. అతడి కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ప్రియాంకా రెడ్డి హత్యపై జాతీయ మహిళా కమిషన్ విచారణ ప్రారంభించింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle