newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆటోలో కరోనా రోగి మృతదేహం... నిజామాబాద్‌లో ఘోరం

12-07-202012-07-2020 08:16:03 IST
2020-07-12T02:46:03.751Z12-07-2020 2020-07-12T02:45:40.660Z - - 12-04-2021

ఆటోలో కరోనా రోగి మృతదేహం... నిజామాబాద్‌లో ఘోరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోంది. ఎవరినీ వదలడం లేదు. అయితే, కరోనాతో ఎవరైనా చనిపోతే మాత్రం నరకం కనిపిస్తోంది. వారి మృతదేహాల తరలింపులో అమానవీయ ఘటనలు జరుగుతున్నాయి. ఆటోలో ఓ కరోనా డెడ్ బాడీ తరలింపు వివాదాస్పదం అయింది. 

కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తరలించడంలో నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఈ దారుణమైన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. కొవిడ్‌తో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో తరలించారు.

అయితే, ఆ శవం పూర్తిగా ప్యాకింగ్ చేసి ఉంది. దాన్ని ఆటోలో కాళ్లు పెట్టుకొనే చోట ఉంచి మరోచోటకు తరలించారు. నిబంధనల ప్రకారం కరోనా వైరస్ సోకి మృతిచెందిన వ్యక్తి శవాన్ని అంబులెన్స్‌లోనే శ్మశానానికి తరలించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యుల మధ్య మృతదేహానికి అంత్యక్రియలు జరిపించాల్సి ఉంటుంది. తరలించే వాహనంలోని సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలనే నిబంధన ఉంది.

కానీ, నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో మాత్రం వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆటోలో కరోనా రోగి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించడం కలకలం రేపుతోంది. డ్రైవర్‌తో పాటు ఆటోలో ఉన్న మరో వ్యక్తి కూడా పీపీఈ కిట్లు ధరించకపోవడం గమనార్హం.

మృతదేహం తరలింపులో ఎలాంటి కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఆస్పత్రిలో ఒకేసారి ముగ్గురు కరోనా రోగులు మరణించడంతో అంబులెన్స్ లేకపోవడం వల్ల తరలింపు సాధ్యం కాలేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అందుకే ఆటో మాట్లాడి అందులో కరోనా మృతదేహాన్ని శ్మశానానికి తరలించినట్లు పేర్కొన్నారు.

 



      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle