newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆచార్యుల వారి చూపు మండలి వైపు?

29-07-202029-07-2020 08:28:31 IST
2020-07-29T02:58:31.309Z29-07-2020 2020-07-29T02:58:26.462Z - - 17-04-2021

ఆచార్యుల వారి చూపు మండలి వైపు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ జ‌న స‌మితి అధ్య‌క్షులు ప్రొ.కోదండ‌రాంకు రాజ‌కీయాలు అస్స‌లు క‌లిసి రాలేదు. ప్రొఫెస‌ర్‌గా పిల్ల‌ల‌కు పొలిటిక‌ల్ సైన్స్ పాఠాలు చెప్పిన ఆయ‌న‌కు రియ‌ల్ పాలిటిక్స్ మాత్రం ట‌ఫ్ స‌బ్జెక్ట్‌గా మారాయి. స్వ‌యంగా పార్టీని స్థాపించి ఎన్నిక‌ల్లో పోటీ కూడా చేయ‌లేదు ఆయ‌న‌. అయితే, యాక్టీవ్ పాలిటిక్స్‌లో మాత్రం కొనసాగుతున్నారు. నిజానికి తెలంగాణ‌లో చాలా స‌మ‌స్య‌ల‌పై మిగ‌తా ప్ర‌తిప‌క్ష నేత‌ల కంటే ఎక్కువ‌గా కోదండ‌రాం స్పందిస్తారు. పూర్తి అవ‌గాహ‌న‌తో ఆయ‌న ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తుంటారు. ఇప్ప‌టివ‌ర‌కు బ‌య‌ట ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన కోదండ‌రాం ఇక చ‌ట్ట‌స‌భ‌లో అడుగు పెట్టాలనే ఆలోచ‌న‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ జ‌న స‌మితి కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐతో క‌లిసి ప్ర‌జా కూట‌మిగా ఏర్ప‌డి ఎన్నిక‌ల‌కు వెళ్లింది. అయితే, ఆ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ సీట్ల పంప‌కాల విష‌యంలో అనేక త్యాగాలు చేయాల్సి వ‌చ్చింది. జ‌న‌గామ నుంచి అసెంబ్లీకి ప్రొ.కోదండ‌రాం పోటీ చేయాల‌నుకున్నారు. కాంగ్రెస్ హైక‌మాండ్ కూడా మొద‌ట్లో ఆయ‌న‌కు ఈ సీటు వ‌దులుకునేందుకు సిద్ధ‌ప‌డింది. చివ‌రి నిమిషంలో మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల ల‌క్ష్మ‌య్య ఒత్తిడి చేయ‌డం, బీసీ నేత సీటును తీసుకున్నార‌నే అప‌ప్ర‌ధ వ‌స్తుంద‌నే భావ‌న‌తో కోదండ‌రాం ఈ సీటును వ‌దులుకున్నారు. దీంతో ఆయ‌న ఎక్క‌డా పోటీ చేయ‌కుండా ప్రచారానికే ప‌రిమితం అయ్యారు.

పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌తో స‌హా తెలంగాణ జ‌న స‌మితి నుంచి ఎవ‌రూ పోటీ చేయ‌లేదు. అయితే, కాంగ్రెస్ అభ్య‌ర్థులు మాత్రం ఆయ‌న మ‌ద్ద‌తు పొందారు. ఇలా రెండు ఎన్నిక‌ల్లోనూ ప్ర‌త్య‌క్షంగా పోటీకి కోదండ‌రాం దూరంగా ఉండాల్సి వ‌చ్చింది. ఇప్పుడు మాత్రం ఆయ‌న శాస‌న‌మండ‌లిలోకి అడుగుపెట్టాల‌ని భావిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు గానూ న‌ల్గొండ‌, వ‌రంగ‌ల్, ఖ‌మ్మం జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డానికి ఆస‌క్తితో ఉన్నార‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలో ఈ స్థానానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.

ఈ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ నుంచే ఓట్ల న‌మోదు ప్ర‌క్రియ ప్రారంభం కాబోతోంది. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసే అభ్య‌ర్థులు ఓట్ల న‌మోదు నుంచే ఎన్నిక‌ల రంగంలో దిగాల్సి ఉంటుంది. అందుకే కోదండ‌రాం త్వ‌ర‌లోనే ఈ మూడు జిల్లాలపై దృష్టి పెట్ట‌బోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో ఏ ఎన్నిక‌లు జ‌రిగినా తిరుగులేకుండా విజ‌యాలు సాధించే అధికార టీఆర్ఎస్ పార్టీకి ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు మాత్రం ఎప్పుడూ కొంత చేదు ఫ‌లితాల‌నే ఇస్తాయి. 

ఇంత‌కుముందు హైద‌రాబాద్ - రంగారెడ్డి - మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ చేతుల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత కూడా క‌రీంన‌గ‌ర్ స్థానం నుంచి టీఆర్ఎస్ మ‌ద్ద‌తు ఇచ్చిన అభ్య‌ర్థిపై కాంగ్రెస్ అభ్య‌ర్థి జీవ‌న్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు.

ప‌ట్ట‌భ‌ద్రులు టీఆర్ఎస్ స‌ర్కార్ ప‌ట్ల కొంత అసంతృప్తితో ఉన్నార‌ని క‌రీంన‌గ‌ర్ ఫ‌లితం చెబుతోంది. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత ఆశించిన‌ట్లుగా ఉద్యోగ నోటిఫికేష‌న్లు రాక‌పోవ‌డం ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. ఈ నేప‌థ్యంలో ప‌ట్ట‌భ‌ద్రుల స్థానం నుంచి పోటీ చేస్తే గెలిచే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు కోదండ‌రాం భావిస్తున్నారు. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షాన్ని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డం, ప్ర‌శ్నించే వారు లేకుండా చేయ‌డం ప‌ట్ల విద్యావంతుల్లో కొంత అసంతృప్తి ఉంది. అందుకే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో, క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లో ప్ర‌తిప‌క్షాల నుంచి బ‌ల‌మైన నాయ‌కుల‌ను గెలిపించారనే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి.

ఇక‌, న‌ల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉంది. ఖ‌మ్మం జిల్లాలోనూ ప్ర‌తిప‌క్షాల‌కు ఎప్పుడూ కొంత అనువైన వాతావ‌ర‌ణం ఉంటుంది. వ‌రంగ‌ల్‌లో మాత్రం టీఆర్ఎస్ బ‌లంగా ఉంటుంది. కోదండ‌రాం పోటీ చేస్తే కాంగ్రెస్‌, టీడీపీ, క‌మ్యూనిస్టు పార్టీలు పోటీ పెట్ట‌కుండా మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ఆయ‌న‌ను నిల‌బెట్టే అవ‌కాశం ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో న‌ల్గొండ - వ‌రంగ‌ల్ - ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల స్థానంలో త‌న‌కు గెలుపు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని భావిస్తున్న కోదండ‌రాం త్వ‌ర‌లోనే గ్రౌండ్ వ‌ర్క్ ప్రారంభించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   14 minutes ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   41 minutes ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   3 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   2 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   5 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   18 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   20 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   a day ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   a day ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle