newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆగస్టులో లక్షల్లో కేసులు.. 5 కోట్ల డోలో మాత్రలతో తెలంగాణ అప్రమత్తం

26-07-202026-07-2020 07:58:18 IST
2020-07-26T02:28:18.648Z26-07-2020 2020-07-26T02:28:14.342Z - - 11-04-2021

ఆగస్టులో లక్షల్లో కేసులు.. 5 కోట్ల డోలో మాత్రలతో తెలంగాణ అప్రమత్తం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయికి చేరుకుంటుుందని, రోజుకు లక్ష కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోందని అంచనాలు వెలువడటంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రానున్న ఉత్పాతాన్ని తట్టుకోవడానికి వారం రోజుల ముందే డోలా మాత్రల నిల్వ విషయంలో ముందంజ వేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీలు), ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆసుపత్రులు, బస్తీ దవాఖానాలు, బోధనాస్పత్రులు సహా ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని రకాల ఆసుపత్రులకు ఐదు కోట్ల డోలో మాత్రలను సరఫరా చేసింది.

కరోనా కట్టడి కోసం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. కరోనా వైరస్ వచ్చిన వారికి జ్వరం ఉంటే తప్పనిసరిగా డోలో లేదా పారాసిటమాల్‌ వంటి మాత్రలు ఇస్తారు. అలాగే సీజనల్‌ జ్వరాలను ఎదుర్కొనేందుకు వాటిని పంపించారు. డోలో మాత్రలు సహా మొత్తం 54 రకాల ఔషధాలను ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేశారు. వాటిలో కరోనా వచ్చిన వారికి ఉపయోగించే అజిత్రోమైసిన్‌ వంటి యాంటీబయోటిక్స్, మల్టీవిటమిన్, సీ–విటమిన్, డీ–విటమిన్‌ మాత్రలు ఉన్నాయి. 

అలాగే జలుబు, దగ్గు, ఇతరత్రా లక్షణాలున్న వారికి ఉపయోగపడే మందులను కూడా పంపించారు. బీపీ, షుగర్, శ్వాసకోశ సంబంధ వ్యాధులు సహా ఇతర దీర్ఘకాలిక రోగాలకు అవసరమైన మందులను కూడా ప్రభుత్వం సరఫరా చేసింది. వాటితోపాటు అత్యవసర మందులను కూడా పంపారు. కరోనా తీవ్రంగా ఉన్న వారికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న రెమిడిసివిర్, ఫ్యాబీ ఫ్లూ వంటి మందులను కూడా జిల్లాలకు పంపించామని తెలంగాణ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

అయితే దేశవ్యాప్తంగా ఈ మందులకు డిమాండ్‌ ఉండటంతో కొరత ఏర్పడిందని, తయారీ కూడా తక్కువగా ఉందని, అందువల్ల వాటిని అవసరమైన మేరకు జిల్లాలకు ఇంకా సరఫరా చేయలేకపోయినట్లు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. త్వరలో మరిన్ని ఆర్డర్లు తెప్పించి సరఫరా చేస్తామన్నారు. ఈ మందులు వాడితే రోగులు వేగంగా కోలుకుంటుండటంతో పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 

రాబోయే నాలుగైదు వారాలు సంక్లిష్టమైన రోజులని, కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ మందులు మరిన్ని తెప్పించాల్సిన అవసరముందని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ రెండు రకాలే కాకుండా మరో కీలకమైన తొసిలిజుమాబ్‌ సూది మందును కూడా సరఫరా చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇది అత్యంత తీవ్రమైన రోగులను కాపాడుతుందన్న భావన వైద్య వర్గాల్లో ఉంది. అయితే కొందరు దళారులు దీన్ని బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. వాస్తవ ధర రూ. 30 వేలని, కానీ మార్కెట్లో దాన్ని రూ. లక్షన్నరకు కూడా విక్రయిస్తున్నారని బాధితులు అంటున్నా రు. 

జ్వరం వస్తే వెంటనే పరిస్థితిని బట్టి అది వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌గా రూపాంతరం చెందకుండా తక్షణమే యాంటిబయోటిక్స్‌ సహా దానికి సంబంధించిన కోర్సును ప్రారంభిస్తారు. కరోనా పరీక్ష, దాని నిర్ధారణకు ముందే వైద్య చికిత్స ప్రారంభిస్తారు. ఉదాహరణకు ఎవరికైనా 100 డిగ్రీలు, ఆపైన జ్వరం ఉంటే తక్షణమే అజిత్రోమైసిన్‌ యాంటిబయోటిక్‌ సహా డోలో, మల్టీ విటమిన్, సీ విటమిన్‌ మాత్రలను ఇస్తారు. వాటిని ఐదు రోజుల కోర్సుగా వాడతారు. పరిస్థితిని బట్టి కోర్సు పరిధి పెరిగే అవకాశముంది. 

రాష్ట్రంలో ప్రతి నెలా లక్ష మందికి సరిపోయేలా, ఐదు నెలల్లో ఐదు లక్షల మందికి అవసరమైన 54 రకాల మందులను సరఫరా చేశామని తెలంగాణ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మున్ముందు అవసరాన్ని బట్టి ఇంకా మందుల సరఫరా ఉంటుందన్నారు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   13 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   20 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle