newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

ఆకాశానికి ఉల్లి.. కొనాలంటే మళ్ళీ కన్నీళ్ళే

22-11-201922-11-2019 14:40:04 IST
2019-11-22T09:10:04.262Z22-11-2019 2019-11-22T09:10:02.282Z - - 22-02-2020

ఆకాశానికి ఉల్లి.. కొనాలంటే మళ్ళీ కన్నీళ్ళే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉల్లి కోస్తేనే కాదు.. ఇప్పుడు కొనాలన్నా కన్నీళ్ళు వస్తున్నాయి. గత కొంతకాలంగా ఆకాశానికి నిచ్చేనేసినట్టు ఉల్లి ధర భారీగా పెరిగింది. వేసవి అనంతరం వర్షాభావం వల్ల పెరిగిందని భావించినా.. ఇప్పుడు వర్షాలు భారీగా పడ్డాయి. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో చేతికి వచ్చిన ఉల్లి పంట నేలపాలైంది. దీంతో మళ్లీ ఉల్లిధరకు రెక్కలొచ్చాయి. శుక్రం వారం ఆల్‌టైమ్ రికార్డుకు చేరిన ఉల్లి ధర.. క్వింటాలుకు రూ.10 వేలు పలుకుతోంది ఉల్లి.

హోల్‌ సేల్ మార్కెట్లోనే ఇలా ఉంటే.. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర వంద దాటిపోయింది. పెరిగిన ధరలతో.. ఉల్లి రైతులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. వినియోగదారులు మాత్రం కన్నీటి పర్యంతం అవుతున్నారు. గతేడాది ఇదే సమయంలో.. క్వింటాల్ ఉల్లి ధర 100 రూపాయలే పలికింది. అయితే.. ఈ ఏడాది పరిస్థితులు మారిపోయాయి. ధర తగ్గుతుందని భావించిన వారికి నిరాశే ఎదురైంది. మళ్ళీ అదే ధర ఇప్పుడు పలుకుతోంది.

ఉల్లి లేకుండా కూరల్ని ఊహించలేం. అందుకే గృ‌హిణులు ఉల్లి ధర పెరగగానే ఆందోళనకు గురవుతారు. ఇటు హోటళ్ళు, బిర్యానీ సెంటర్లు కూడా ఉల్లిని పక్కకు పెట్టేశాయి. ఉల్లి దోస కనిపించడంలేదు. బిర్యానీలో నిమ్మకాయతో పాటు ఉల్లిపాయ ముక్కలు ఇవ్వడం ఇప్పుడు బాగా తగ్గిపోయింది.

ఉల్లి కావాలని అడగవద్దంటున్నారు హోటళ్ళ యజమానులు. పకోడి కూడా దూరమయిపోయింది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో పండించే ఉల్లి దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాలనే శాసిస్తోంది. ఉల్లి ధర భారీగా పెరగడంతో కొనలేక పోతున్నామని వినియోగదారులు ‘న్యూస్ స్టింగ్’తో చెప్పారు. 

ఈ ఏడాది ఆగష్టు నుండి అక్టోబర్ వరకూ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి పంట బాగా దెబ్బతింది. ఈ ప్రభావంతో ఉల్లి పాయల ధర దేశవ్యాప్తంగా భారీగా పెరిగింది. ఉల్లి రైతులకు సిరులు కురిపిస్తోంది. దిగుబడి తక్కువైనా.. ధర ఉండటంతో పండిన పంటతో గిట్టుబాటు అయ్యిందని రైతులు సంతోషంతో ఉన్నారు.

అయితే రైతులకు చెల్లించేది-వినియోగదారుల నుంచి వసూలు చేసే విషయంలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో మధ్యదళారులు లాభపడుతున్నారు. బహిరంగ మార్కెట్లో కంటే రైతు బజార్లలో కాస్త ధర తక్కువగా ఉండడంతో వినియోగదారులు క్యూల్లో నిలబడి మరీ ఉల్లిని కొంటున్నారు. 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   an hour ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   2 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   3 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   4 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   6 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   7 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   7 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   8 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle