newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆంధ్రా కందిపప్పుకు తెలంగాణలో అనూహ్యంగా ప్రశంస..

23-05-202023-05-2020 09:29:21 IST
Updated On 24-05-2020 09:19:48 ISTUpdated On 24-05-20202020-05-23T03:59:21.270Z23-05-2020 2020-05-23T03:59:19.278Z - 2020-05-24T03:49:48.126Z - 24-05-2020

ఆంధ్రా కందిపప్పుకు తెలంగాణలో అనూహ్యంగా ప్రశంస..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు రేషన్‌లో అందిస్తున్న కందిపప్పుకు అనూహ్యంగా తెలంగాణలో ప్రశంసలు రావడం వింతగొలుపుతోంది. కానీ ఇది నిజం. తెలంగాణలో ఒక రేషన్ షాపులో ఇస్తున్న కందిపప్పు నాసిరకంగా ఉందేమిటి అని వినియోగదారు అడిగిన ప్రశ్నకు.. మంచి పప్పు కావాలంటే అమరావతికి పో అంటూ రేషన్ దుకాణదారు సలహా ఇవ్వడం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రేషన్ షాపుల్లో ఇస్తున్న కంపిపప్పు కాస్త నాణ్యతతో ఉందని ఇప్పటికే ప్రచారమైంది. 

వివరాల్లోకి వెళితే.. మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. అయితే ఈ లాక్‌డౌన్‌లో ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదని తెలంగాణ ప్రభుత్వం రేషన్‌ సరుకులను రెట్టింపు చేసింది. బియ్యంతో పాటు ఒక్కో కార్డుపై కిలో కందిపప్పు ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 

అయితే ఇది కొంత మంది రేషన్‌ దారులకు వరంగా మారింది. నాసిరకమైన కందిపప్పును ప్రజలకు అంటగట్టి నాణ్యమైన కందిపప్పును బయట మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ముఖ్యంగా రామంతపూర్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లోని రేషన్‌ దుకాణాల్లో రెండు రకాల కందిపప్పును ప్రజలకు అంటగడుతున్నారు.

ఈ క్రమంలో తెలంగాణలోని ఓ రేషన్‌ షాపులో నాసిరకమైన కందిపప్పును సరఫరా చేస్తుండటంపై ఓ వ్యక్తి ప్రశ్నించగా ఆ రేషన్‌ దుకాణదారుడు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ‘ఇక్కడ నచ్చకుంటె అమరావతికి వెళ్లిపో’ అంటూ జవాబిచ్చాడు. దీంతో ఆ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. ప్రజలకు అందించే రేషన్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్న విషయం తెలిసిందే. 

దీనిని దృష్టిలో పెట్టుకునే ఆ రేషన్‌ దుకాణదారుడు నచ్చకుంటే అమరావతి వెళ్లమని అన్నారని అక్కడి వారందరూ అనుకుంటున్నారు. ఇక నాసిరకం కందిపప్పుపై రేషన్‌ దుకాణదారుడిని మీడియా ప్రశ్నించగా ఇదంతా సివిల్‌ సప్లయి గోడౌన్‌లలో జరుగుతుందని తమకేమి సంబంధంలేదని అతడు పేర్కొన్నాడు.

ఏది ఏమైనా విభిన్న కోణంలో ఆంధ్రా కందిపప్పుకు తెలంగాణలో ప్రశంసలు రావడం విశేషమే మరి.

 

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   8 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   11 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   15 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   13 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle