newssting
BITING NEWS :
*ప్రధాని నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ.. లాక్ డౌన్ పై చర్చ *మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహరంలో తుది తీర్పు .. వెంటనే విధులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం *కొండపోచమ్మ జలాశయం ప్రారంభం. సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభం.. ఇదో ఉజ్వల ఘట్టం అన్నకేసీయార్ *కరోన ఇప్పుడే పోయేది కాదు..సౌదీ అరేబియా నుండి వందలాది మంది వస్తున్నారు..కరోన అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదు..ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి : ఈటల *ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే 50కి పైగా కేసులలో చుక్కెదురైనా పద్ధతి మార్చుకోవడం లేదు..రమేష్ ని మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం : సీఎం రమేష్ - ఎంపీ *ఏపీలో కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి.3330 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.కరోనాతో 60 మంది మృతి * చోటా కె.నాయుడు సోదరుడు అరెస్ట్..ఎస్.ఆర్.నగర్‌లో శ్యామ్ కె. నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు..ఆర్టిస్ట్ సుధను పెళ్లిపేరుతో మోసం చేశాడని ఆరోపణ..సుధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు*భారత్ లో విజృంభిస్తున్న కరోనా. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త కరోనా కేసులు. 175 మంది మృతి. దేశవ్యాప్తంగా 1,65,799 కి చేరిన కరోనా కేసులు. 89,987 యాక్టివ్ కేసులుండగా, 71,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మొత్తం 4,706 కరోనా మరణాలు

ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసులు

23-03-202023-03-2020 14:03:34 IST
Updated On 23-03-2020 14:21:29 ISTUpdated On 23-03-20202020-03-23T08:33:34.530Z23-03-2020 2020-03-23T08:33:25.294Z - 2020-03-23T08:51:29.826Z - 23-03-2020

ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఒక్కరోజే మూడు కొత్త కేసులు వెలుగుచూశాయి. వీరిలో ఇద్దరు వ్యక్తులు విదేశాల నుంచి వచ్చిన వారు కాగా,, మరొకరు కరీంనగర్‌కు చెందిన వ్యక్తిగా వైద్యులు గుర్తించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 30కి చేరింది.

కాగా వైరస్‌ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో మఖ్యమంత్రి కేసీఆర్‌ పరిస్థితిని ఎ‍ప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా లాక్‌డౌన్‌ పాటించాలని కోరుతున్నారు. మరోవైపు రోడ్లపైకి వచ్చిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించవద్దని హెచ్చరిస్తున్నారు

ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నివేదిక విడుదల చేశారు. ‘ప్రపంచ వ్యాప్తంగా డబ్య్లూహెచ్‌వో హెల్త్ ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. పీవీటీ హాస్పిటల్స్‌లో ఎలెక్టీవ్ సర్జరీలను నిలిపివేసి.. కరోనా బాధితులకు వైద్య చికిత్స అందించేందుకు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీచేశాం. శ్వాశ సంబంధిత వ్యాధులతో వచ్చిన వారికి ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో వైద్యం అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. 

ఇదిలా ఉంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీ యజమానులతో మంత్రి ఈటల సమావేశం నిర్వహించారు. ఐసోలేషన్ ఐసియు సేవలకు ప్రైవేట్ హాస్పిటల్  సహకారం కావాలన్నారు మంత్రి ఈటల. ఆర్డీవో స్థాయి అధికారులు  ఆఫీసర్లు డాక్టర్లు నుండి మొదలుకుని ప్రతి ప్రభుత్వ అధికారి అందుబాటులో ఉంటారని, 1897 అంటువ్యాధుల నివారణ చట్టం ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఎలాంటి నిబంధనలు పాటించాలో ప్రభుత్వ అధికారులు వివరిస్తారని, అనుభవజ్ఞులైన ప్రైవేటు డాక్టర్లు కూడా సలహాలు ఇవ్వవచ్చన్నారు.

ప్రివెంటివ్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని, ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్ లో కలిపి మొత్తం 15,040 వేల బెడ్స్ మాత్రమే ఉన్నాయన్నారు. ఒక వ్యక్తికి మాత్రమే సికింద్రాబాద్ లో కరోనా పాసిటివ్ డిటెక్టివ్ అయింది ఫస్ట్ కేసు అని, ఇండోనేషియా నుండి వచ్చిన పది మంది నుండి ఒక పర్సన్ కి  పాజిటివ్ కేసు వచ్చిందన్నారు. మిగిలిన వాటిని బయటి దేశాల నుండి వచ్చిన వారికి మాత్రమే కరోనా పాజిటివ్ గా వచ్చాయన్నారు మంత్రి. కరోనా వైరస్ రెండవ స్టేజ్ లోకి ఎంటర్ అయినట్టుగా భావించాలన్నారు. 

 

కొని తెచ్చుకున్న వివాదాలతో జగన్ రాజకీయ పోరాటం!

కొని తెచ్చుకున్న వివాదాలతో జగన్ రాజకీయ పోరాటం!

   11 minutes ago


తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

   14 hours ago


 కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

   14 hours ago


కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

   18 hours ago


నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి..  జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి.. జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

   19 hours ago


శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

   21 hours ago


జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

   21 hours ago


కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

   a day ago


కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

   a day ago


కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle