newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆందోళనకరంగా వరవరరావు ఆరోగ్యం... బెయిల్‌పై తేల్చాలని బాంబే హైకోర్ట్ ఆదేశం

21-07-202021-07-2020 12:59:06 IST
Updated On 21-07-2020 16:11:27 ISTUpdated On 21-07-20202020-07-21T07:29:06.886Z21-07-2020 2020-07-21T07:28:15.710Z - 2020-07-21T10:41:27.815Z - 21-07-2020

ఆందోళనకరంగా వరవరరావు ఆరోగ్యం... బెయిల్‌పై తేల్చాలని బాంబే హైకోర్ట్ ఆదేశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త, విరసం సంస్థాపక సభ్యుడు వరవరరావు ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందని, తాను అంపశయ్యపై ఉన్నట్లేనని ఆయన లాయర్ బాంబే హైకోర్టుకు తెలిపారు. తన క్లయింట్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వీవీ లాయర్ సందీప్ పసుబోలా సోమవారం బాంబే హైకోర్టుకు తెలియజేశారు. ఒక్క కరోనా తోటే కాకుండా అనేక వ్యాదులు ఆయనను పట్టి పీడిస్తున్నాయని, ఆయన రోజులు లెక్కపెడుతున్న పరిస్థితి ఏర్పడిందని  లాయర్ కోర్టుకు తెలిపారు. 

ఒకవేళ తన క్లయింటు చనిపోయేటట్లయితే చివరిరోజుల్లో ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఉండేలా చూడాలని లాయర్ హైకోర్టును కోరారు. తక్షణం ఆయనకు బెయిల్ ఇప్పించాలని కూడా డిమాండ్ చేశారు. దీంతో వరవరరావును ఆయన కుటుంబ సభ్యులు చూడవచ్చా అనే అంశంపై మంగళవారంలోపు సమాధానం ఇవ్వాలని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి హైకోర్టు దిశానిర్దేశం చేసింది.

‘‘విరసం నేత వరవరరావు అంపశయ్యపై ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. మరి కొన్ని రోజులు మాత్రమే ఆయన బతికే అవకాశం ఉంది. ఒకవేళ, ఆయన చనిపోతే, కనీసం కుటుంబ సభ్యుల సమక్షంలో మరణించేలా చూడండి. విచారణను ఏ విధంగానూ ప్రభావితం చేసే స్థితిలో లేని వరవరరావుకు బెయిల్‌ ఇప్పించండి’’ అని ఆయన తరపు న్యాయవాది సుదీప్‌ పస్‌బోలా బోంబే హైకోర్టుకు విన్నవించారు. విచారణను ప్రభావితం చేసే స్థితిలో ఆయన లేరన్న విషయంపై చివరికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు కూడా భిన్నాభిప్రాయాలు లేవని తెలిపారు. 

ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయనీ,  పైగా, ఇప్పుడు కరోనా కూడా సోకిందని లాయర్ వివరించారు. అయితే, కరోనా రోగుల్ని కలిసేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాలు అంగీకరించవని  కోర్టుకు ఎన్‌ఐఏ తరపున న్యాయవాది, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ విన్నవించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కుటుంబ సభ్యులు వరవరరావును కలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దీపక్‌ థాకరే తెలిపారు. 

అయితే నిర్దిష్ట దూరం నుంచైనా ఆయనను కుటుంబ సభ్యులు చూసేందుకు వీలవుతుందా అంటూ పలు ప్రశ్నలు అడిగిన ధర్మాసనం.. బుధవారంలోగా తమకు సమాధానం చెప్పాలని  ఆదేశించింది. కాగా,  ఆయన ఆరోగ్య పరిస్థితిని తమకు పారదర్శకంగా తెలపాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన సహచరి హేమలత, కూతుర్లు సహజ, అనల, పవన డిమాండ్‌ చేశారు. ఆయనను జేజే, సెయింట్‌ జార్జ్‌, నానావతి ఆస్పత్రులకు తరలించడం కూడా తమకు తెలియదని పేర్కొన్నారు.

‘‘వరవరరావు తనకు తానుగా ఏ పనీ చేయలేకపోతున్నారు. ఆయనకు సహకరించడానికి కుటుంబ సభ్యుల్లో ఒకరిని తోడుగా ఉండేలా చూడండి. ఆరోగ్య పరిస్థితిని రెండు రోజులకోసారి అధికారికంగా తెలియజేయాలని జైలు అధికారులు, ఆస్పత్రి సిబ్బందిని ఆదేశించండి’’ అని డిమాండ్‌ చేశారు. ఆయన చికిత్సకు సంబంధించిన వైద్య నివేదికలన్నీ అందుబాటులో ఉంచాలన్నారు. బెయిల్‌ తీసుకోవడానికున్న అడ్డంకులన్నీ తొలగించాలని కోరారు.

ఎల్గార్ పరిషద్ అల్లర్ల కేసులో నిందితుడై 2018 నుంచి మహారాష్ట్రలో నిర్బంధంలో ఉన్న వరవరరావు ఆరోగ్యం క్షీణించి ముంబైలోని జేజే హాస్పిటల్‌లో చేర్పించినప్పుడు ఆయనకు అప్పటికే కరోనా సోకిన విషయం తేలింది. జేజే హాస్పిటల్లో గత వారం ఉన్నప్పుడు ఆయన తల పడకకు కొట్టుకని తలకు గాయమైందని, గాయానికి కుట్లుకూడా వేశామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

ఈ ఘటనతో వీవీని నానావతి హాస్పిటల్‌కు తరలించారు. అయితే వరవరరావు నీళ్లుతాగేందుకు గ్లాసు అందుకనే ప్రయత్నంలో పడక మూలకు ఆయన తల కొట్టుకుందని, దాంతో గాయమైందని, వెంటనే ఆయనకు సపరిచర్యలు చేశామని జేజే ఆసుపత్రి డీన్ డాక్టర్ రంజిత్ మంకేశ్వర్ తెలిపారు. ఈ విషయంలో దాయవలిసందేమీ లేదని ఆసుపత్రి నుంచి ఆయనను తరలించేటప్పుడు బదిలీ రిపోర్టులో ఇవన్నీ పొందుపర్చామని తెలిపారు.

కాగా వరవరరావు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై  గురువారం లోపు తనకు నివేదించాలని బాంబై హైకోర్టు ఎన్ఐఏని ఆదేశించింది.

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   13 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   17 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   14 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   21 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   21 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle