newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలకు రేపే భూమిపూజ

26-06-201926-06-2019 09:43:58 IST
Updated On 26-06-2019 16:44:38 ISTUpdated On 26-06-20192019-06-26T04:13:58.790Z26-06-2019 2019-06-26T04:13:21.152Z - 2019-06-26T11:14:38.652Z - 26-06-2019

అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలకు రేపే భూమిపూజ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న అసెంబ్లీ, సెక్రటేరియట్ నూతన భవనాల నిర్మాణానికి గురువారం శ్రీకారం చుట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. నూతన సచివాలయం, అసెంబ్లీ భవనాల శంకుస్థాపనకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.

రేపు రెండు భవనాల నిర్మాణాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమిపూజ నిర్వహిస్తారు. ఇప్పుడున్న ప్రాంగణంలోనే సచివాలయం, ఎర్రమంజిల్‌లో అసెంబ్లీకి నూతన భవనాలను నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. 

గురువారం ఉదయం10 గంటలకు సీఎం కేసీఆర్ ముందుగా సచివాలయ భవన నిర్మాణానికి భూమిపూజచేస్తారు. ఇందుకోసం సచివాలయంలో ఈశాన్యంలో డీ బ్లాక్ వెనుకవైపు ఉన్న ఉద్యానవనంలో ఏర్పాట్లుచేస్తున్నారు.

అనంతరం ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ భవన నిర్మాణపనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నూతన సచివాలయాన్ని సుమారు ఆరులక్షల చదరపు అడుగుల వైశాల్యంతో అన్నిహంగులతో నిర్మించనుంది. 

పక్కావాస్తుతోపాటు అన్నిరకాల వసతులు ఉండేలా నిర్మిస్తారు. మంత్రులు, అధికారుల సమీక్షలు, సమావేశాలు అన్నీ సచివాలయం వేదికగా జరిగేలా నిర్మాణం జరుగుతుంది.

ఇందుకోసం సమావేశహాళ్లు, కలెక్టర్ల సమావేశం కోసం కాన్ఫరెన్స్‌హాల్ నిర్మించనున్నారు. అలాగే విశాలమైన పార్కింగ్ ఏర్పాటుకూడా చేయనున్నారు. పూర్తి పర్యావరణ హితంగా సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ప్రస్తుతం సచివాలయంలోని కార్యాలయాలను తాత్కాలికంగా ఎక్కడకు తరలించాలి? మొత్తం సచివాలయ భవనాలను ఒకేసారి కూల్చివేయాలా? లేక విడతలవారీగా కూల్చాలా?

అన్నదానిని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయిస్తుంది. మొత్తం మీద నూతన సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం అత్యంత అధునికంగా నిర్మించడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle