newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

28-02-202028-02-2020 08:37:15 IST
2020-02-28T03:07:15.592Z28-02-2020 2020-02-28T03:06:55.141Z - - 15-04-2021

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపు ప్రతిపాదనపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. ఎప్పటినుంచో అసెంబ్లీ సీట్ల పెరుగుతాయని రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే వీరి ఆశలపై నీళ్ళు చల్లారు కిషన్ రెడ్డి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు.

దీనిపై తుది నిర్ణయం కేంద్ర న్యాయ శాఖదేనని వివరించారు. ఏపీ విభజన చట్టంలో సీట్ల పెంపు విషయాన్ని తెలుగు రాష్ట్రాల సీఎంలు, ఇతర పార్టీల నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సీట్ల పెంపు అంశాన్ని విభజన చట్టంలో అకస్మాత్తుగా చేర్చారని కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరిగినప్పుడే ఉమ్మడి ఏపీలో కూడా జరిగిందని, ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి అసెంబ్లీ సీట్ల పెంపు నిర్ణయం జరుగుతుందని తెలిపారు.  

2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశం తెరమీదకు వచ్చింది. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అంతా భావించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయినా, అసెంబ్లీ సీట్ల పెంపు అంశం ప్రస్తావనకు రాలేదు, మధ్యమధ్యలో ఢిల్లీ నుంచి లీకులు వచ్చాయి. కానీ అవి నిజం కాలేదు. సీట్ల పెంపు కోసం తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్‌..ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అనేక ప్ర‌య‌త్నాలు చేసారు.

అప్ప‌ట్లో కేంద్ర మంత్రిగా ఉన్న వెంక‌య్య నాయుడు సైతం సీట్ల పెంపు కోసం న్యాయ‌- హోం శాఖ‌ల అధికారుల‌తో ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిపారు. కేంద్రం కూడా అనేకసార్లు దీనిపై తన వైఖరి తెలిపింది. కేంద్రం ఆలోచన ప్రకారం జాతీయ జనాభా పట్టిక తర్వాతే సీట్ల పెంపు వుండవచ్చు. 2026 తరవాతే అసెంబ్లీ సీట్ల పెంపులో కదలిక రావచ్చు. 

‘జమ్ము, కశ్మీర్‌ బ్లాక్‌ స్థాయి ప్రజాప్రతినిధులతో  కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  కిషన్ రెడ్డి మాట్లాడుతూ మార్చి, ఏప్రిల్‌లో జమ్మూ కశ్మీర్‌లో పర్యటిస్తానని, జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు.

అసెంబ్లీ సీట్ల పెంపుపై ఆలోచన చేస్తున్నామని వివరించారు. మే నెలలో జమ్మూ కశ్మీర్‌ ‘ఔట్‌ రీచ్‌’కార్యక్రమం అమలు చేస్తామన్నారు. కేంద్ర మంత్రులంతా బ్లాక్‌ లెవల్‌కు వెళ్లి అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని వివరించారు. ఇటు ఢిల్లీ ఘర్షణలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. అయితే ఢిల్లీలో ప్రశాంత వాతావర ణం ఏర్పడిందని, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ఘర్షణలు తలెత్తిన ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో కర్ఫ్యూ ఎత్తేశామన్నారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లపై విచారణకు ‘సిట్‌’ ఏర్పాటుచేశామని వివరించారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle