అసలు సీఎం కేటీయారేనా? నారాయణ హాట్ కామెంట్స్
22-08-202022-08-2020 07:41:58 IST
Updated On 22-08-2020 08:31:02 ISTUpdated On 22-08-20202020-08-22T02:11:58.689Z22-08-2020 2020-08-22T02:09:39.549Z - 2020-08-22T03:01:02.602Z - 22-08-2020

తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన విపక్షం కాంగ్రెస్ తో పాటు బీజేపీనేతలు కూడా ప్రభుత్వంపై మండిపడుతుంటారు. ఇప్పుడు కామ్రేడ్స్ వంతొచ్చింది. తాజాగా సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అసలు ముఖ్యమంత్రి కేటీఆర్ అని ఆయన అన్నారు. ఇకపై సీఎం కేసీఆర్ హాయిగా విశ్రాంతి తీసుకొని కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు ఇవ్వాలన్నారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా నారాయణ టీ తాగుతూ టీఆర్ఎస్ పై మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో కేటీఆర్ పాలనే నడుస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కువగా ఫామ్‌హౌజ్‌లోనే గడుపుతున్నారని, ఇలాంటి పరిస్థితులు కొనసాగించకుండా కేటీఆర్‌ను సీఎం చేసి ఆయన రెస్ట్ తీసుకోవాలని నారాయణ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే వరంగల్ వరదలతో సతమతం అవుతోందన్నారు. ముంపు ప్రాంతాల్లో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాలన మొత్తం అధికారికంగా కేటీఆర్‌కు అప్పగించడం వల్ల కేటీయార్ క్రియాశీలకంగా వ్యవహరించే వీలుంటుందన్నారు. రెండు రోజుల క్రితం వరంగల్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్ రూ.10 కోట్లు కేటాయించి వెళ్లిపోయారని నారాయణ విమర్శించారు. వరంగల్‌లో పరిస్థితులు మెరుగుపడాలంటే అవి సరిపోవని, దాదాపు రూ.1000 కోట్లు అవసరం అన్నారు. వరదలకు కారణమైన ఆక్రమణలు తొలగించాలని మంత్రి కేటీఆర్ అన్నారని.. అయితే ఆక్రమణల్లో ఎక్కువగా టీఆర్ఎస్ నాయకులవే ఉన్నాయని నారాయణ ఆరోపించడం విశేషం. అలాంటప్పుడు కేటీఆర్ చెప్పినట్టు ఆక్రమణల తొలగింపు ఎలా అవుతుందన్నారు. టీఆర్ఎస్ నేతల కనుసన్నల్లోనే రాష్ట్రంలో భూ కబ్జాలు జరుగుతున్నాయని, నాలాలు ఆక్రమించడం వల్లే వరంగల్‌కు వరద ముంపు ఏర్పడిందని నారాయణ విమర్శించారు. టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకునే అవకాశం అసలు వుందా అన్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు కూడా భారీవర్షాలు, ప్రజల ఇబ్బందులపై ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడుతున్నారు. ఈమధ్యే కేసీయార్ లేకుండానే కేటీయార్ మంత్రులతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
2 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
4 hours ago

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు
2 minutes ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
3 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
5 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
5 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
6 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021
ఇంకా