newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

అశ్వథ్ధామరెడ్డికి చుక్కెదురు.. దీర్ఘకాలిక సెలవుకి ఆర్టీసీ నో

21-12-201921-12-2019 09:44:11 IST
Updated On 21-12-2019 11:40:57 ISTUpdated On 21-12-20192019-12-21T04:14:11.044Z21-12-2019 2019-12-21T04:14:03.073Z - 2019-12-21T06:10:57.874Z - 21-12-2019

అశ్వథ్ధామరెడ్డికి చుక్కెదురు.. దీర్ఘకాలిక సెలవుకి ఆర్టీసీ నో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా కీలక పదవుల్లో ఉన్న నేతల సెలవులను తిరస్కరించింది. సమ్మె ముగిసిన అనంతరం విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి . ఆ వెంటనే 6 నెలల కాలానికి సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే అశ్వథ్థామరెడ్డి అభ్యర్ధనను ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించలేదు2

రెండునెలల సమ్మె వల్ల ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, సంస్థ ఉన్నతికి సిబ్బంది అంతా కలసి శ్రమించాలని ఆర్టీసీ పేర్కొంది.  ఈ సమయంలో 6 నెలల కాలానికి సెలవు మంజూరు చేయలేమంటూ అధికారులు స్పష్టం చేయడంతో ఆయన ఖంగుతిన్నారు . వెంటనే విధుల్లో చేరాలంటూ ఆయనకు సూచించింది యాజమాన్యం.

వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మిక నేతలందరినీ వేరే ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆర్టీసీలో ఇక కార్మిక సంఘాలు ఉండవంటూ సీఎం కేసీయార్ ప్రకటించడం, అన్ని డిపోల నుంచి ఇద్దరు ఉద్యోగులతో కమిటీ వేయాలని నిర్ణయించింది. యూనియన్‌ కార్యాలయాలకు కేటాయించిన భవనాలకు తాళాలు వేసి స్వాధీనం చేసుకుంది.

యూనియన్ నేతలకు ఇస్తున్న సదుపాయాలను రద్దు చేసింది. ఇక మీదట సంఘాల నేతలు కూడా డ్యూటీలు చేయాల్సిందేనని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. యూనియన్‌ నేతలకు వేతనంతో కూడిన సెలవులను కూడా రద్దు చేసింది.

ముఖ్యమంత్రి యూనియన్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించటంతో..ఆర్టీసీ వీరి విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. మరిన్ని చర్యల దిశగా కసరత్తు చేస్తోంది.అందులో భాగంగానే దీర్ఘకాలిక సెలవులకు స్వస్తి చెప్పింది. ఆర్టీసీ తాజా ఉత్తర్వులతో అశ్వథామరెడ్డి తిరిగి స్టీరింగ్ పట్టాల్సి వస్తోంది. దీంతో ఆర్గీసీ యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న నేతలకు చుక్కెదురైంది.మరోవైపు ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ఆర్టీసీ ఆదాయం భారీగా పెరుగుతోంది. గతంలో తీసుకునే టికెట్ల ధరలు 20 నుంచి 25 శాతం పెరిగాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle