అవి చేపలు కాదు.. తిమింగలాలు.. అవినీతి అంతా అక్కడే..!
16-08-202016-08-2020 08:21:48 IST
Updated On 16-08-2020 10:32:40 ISTUpdated On 16-08-20202020-08-16T02:51:48.241Z16-08-2020 2020-08-16T02:51:42.020Z - 2020-08-16T05:02:40.296Z - 16-08-2020

ప్రభుత్వ ఉద్యోగం అంటే జీతంతో పాటు అదనపు ఆదాయం ఉంటుందని అందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ అదనపు ఆదాయం అంటే అవినీతి సొమ్ము. ప్రభుత్వ శాఖల్లో అవినీతి పేరుకుపోయింది. కొందరు మంచి అధికారులు ఉండవచ్చు. మరికొందరు పారదర్శకంగా వచ్చిన జీతంతోనే జీవించే సిబ్బంది ఉండవచ్చు. కానీ, అంతిమంగా ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే లంచగొండులు అనే భావన ప్రజల్లో ఏర్పడింది. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వాలు ఎంతోకొంత ప్రయత్నాలు చేస్తున్నా అవి ఆశించినంత ఫలితాలు ఇవ్వడం లేదు.
అన్ని శాఖల్లో ఆన్లైన్ విధానం అమలు చేయడం, ఈ-టెండరింగ్ ప్రక్రియలు ప్రవేశపెట్టడం ద్వారా పారదర్శకత పెంచి ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ప్రభుత్వం వైపు నుంచి జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఎప్పుడూ అవినీతిపరులపై ఓ కన్నేసి ఉంచుతోంది.
అయినా కూడా ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఆగడం లేదు. మిగతా శాఖల అన్నింటి కంటే రెవెన్యూ శాఖలో అవినీతి ఎప్పుడూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఏసీబీకి చిక్కుతున్న రెవెన్యూ ఉద్యోగుల డబ్బులు, ఆస్తులు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి.
అన్ని శాఖల్లో అవినీతి ఉన్నా రెవెన్యూ శాఖ అవినీతి ఎక్కువగా చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే ఆ శాఖలో పేరుకుపోయిన సమస్యలు రెవెన్యూ ఉద్యోగులకు కాసులు కురిపిస్తున్నాయి. సామాన్య రైతులు, ప్రజల నుంచి కూడా లంచాలు తీసుకుంటుండటం వల్ల వీరి అవినీతి ప్రజల్లో ఎక్కువగా చర్చలో ఉంటుంది. రెవెన్యూ శాఖలో అవినీతికి కారణాల కంటే ముందు అవినీతి చేయడానికి ఉన్న అవకాశాలను ఒకసారి పరిశీలించాలి.

గతంలో భూమి అంటే ఆత్మగౌరవంగా, బతకడానికి ఆధారంగా మాత్రమే ఉండేదు. కానీ, ఇప్పుడు భూమి అంటే డబ్బు. గత పదేళ్లుగా భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల శివారుల్లో భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయి.
మారుమూల గ్రామాల్లో కూడా భూముల ధరలు లక్షల్లో ఉన్నాయి. భూముల ధరలు పెరిగినట్లుగానే భూసమస్యలు, భూవివాదాలు కూడా క్రమంగా పెరిగాయి. భూములకు సంబంధించి సుమారు 70 రకాల సమస్యలు ఉంటాయని భూచట్టాల నిపుణులు చెబుతుంటారు.
సివిల్ కోర్టుల్లో నడిచే వివాదాల్లో 50 శాతం భూవివాదాలే అని లెక్కలు చెబుతున్నాయి. భూసమస్యలే రెవెన్యూ ఉద్యోగులకు కాసుల వర్షం కురిపిస్తోంది. భూసమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులు సమస్యల పరిష్కారానికి అధికారుల చుట్టూ తిరుగుతుంటారు.
ఈ క్రమంలో సమస్యను పరిష్కరించడానికి వీఆర్వో మొదలు తహశీల్దార్ వరకు లంచాలను ముట్టజెప్పాల్సి వస్తుంది. చిన్న రైతులు, సాధారణ ప్రజలు కూడా భూసమస్యల పరిష్కారానికి లంచనాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇలా క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఉద్యోగుల్లో అవినీతి ఎక్కువగా ఉండటంతో రెవెన్యూ శాఖ అంటేనే అవినీతికి కేరాఫ్‌గా ప్రజల్లో అభిప్రాయం ఏర్పడింది. ఇలా చిన్న స్థాయిల్లో ప్రజలను లంచాలకు పీడిస్తున్న వారు ఎక్కువగా ఏసీబీకి దొరకడం లేదు. ఎందుకంటే వీరికి లంచాలు ఇచ్చేది చిన్న రైతులు. వీరు ఏసీబీకి ఫిర్యాదు చేసే ధైర్యం చేయరు. ఇక, ఇప్పుడు దొరుకుతున్న వారు మొత్తం తహశీల్దార్లు. అందునా లక్షలు వసూలు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరుకుతున్నారు.
తాజాగా కీసర తహశీల్దార్ రూ.1 కోటి 10 లక్షలు లంచం తీసుకుంటుండగా అడ్డంగా దొరికాడు. ఇంతకుముందు ఒక తహశీల్దార్ ఇంట్లో రూ.90 లక్షలు దొరికాయి. ఇటీవలే ఓ ల్యాండ్ డీల్‌లో రూ.50 లక్షల లంచం డిమాండ్ చేసిన ఓ తహశీల్దార్ జైలుపాలయ్యాడు. ఇలా వరుసగా ఏసీబీకి చిక్కుతున్నా ఇంకా లంచగొండి అధికారులు ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా, భయపడకుండా అవినీతితో లక్షలు సంపాదిస్తున్నారు.
నగర శివారుల్లో భూముల ధరలు, భూవివాదాలు చాలా ఎక్కువ. ఇవే ఇప్పుడు లంచగొండి అధికారులకు కోట్లు కురిపిస్తున్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్లు చేసే రియల్టర్లు, బ్రోకర్లు తమకు అనుకూలంగా పత్రాలను పొందేందుకు లక్షలు, కోట్లలో లంచాలు ఆఫర్ చేస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందనే ఆశతో అవినీతి అధికారులు ఏ మాత్రం భయం లేకుండా లంచాలు తీసుకుంటున్నారు.
నిజానికి ఇటువంటివి చాలావరకు సాఫీగా సాగిపోతుంటాయి. ఎక్కడైనా లంచం ఎక్కువ డిమాండ్ చేస్తేనే రియలర్లు, బ్రోకర్లకు, అధికారులకు మధ్య డీల్ బెడిసికొడుతుంది. లంచం ఆఫర్ చేసిన వారే ఏసీబీకి పిర్యాదు చేసి వారిని పట్టిస్తుంటారు.
ఇప్పుడు ఏసీబీకి దొరుకుతున్న రెవెన్యూ లంచగొండుల భాగోతాలు కొన్ని మాత్రమే. ఇంకా దొరకనివి అనేకం ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు కూడా రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతిపై సమాచారం బాగానే ఉంది. అందుకే పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు కూడా ప్రయత్నించారు.
కానీ, ఆ ప్రయత్నాలు ఏవీ మొదలుకాలేదు. కొత్త రెవెన్యూ చట్టం అనేది ఇంకా మాటలకే పరిమితం అయ్యింది. ఇప్పటికైనా ప్రభుత్వం రెవెన్యూ అవినీతిపై దృష్టి పెట్టి అవినీతి తిమింగలాలను భరతం పట్టాలని సగటు ప్రజానీకం కోరుకుంటోంది.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
5 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
8 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
12 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
6 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
15 hours ago
ఇంకా