newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అవినీతి తిమింగలం.. చెట్లకు నీరు పోసేవాడు కూడా బినామీనే..

24-09-202024-09-2020 19:27:01 IST
2020-09-24T13:57:01.365Z24-09-2020 2020-09-24T13:56:58.470Z - - 10-04-2021

అవినీతి తిమింగలం.. చెట్లకు నీరు పోసేవాడు కూడా బినామీనే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

నిత్యం ప్రజలకు రక్షణగా ఉంటూ.. ప్రజా సమస్యలను తీర్చాల్సిన అతను.. ప్రజలనుంచి తీసుకున్న లంచాలతో కూడబెట్టిన అక్రమాస్తులకు కొదువ లేదు. తవ్వే కొద్దీ ఆస్తులు బయటపడుతూనే ఉన్నాయి. ఆఖరికి చెట్లకు నీరు పోసేవాడు కూడా అతనికి బినామీనే. అతనే మల్కాజ్ గిరి ఏసీపీ యలమకూరి నర్సింహారెడ్డి. పేరులోనైతే సింహం ఉంది కానీ.. చట్టానికి, ధర్మానికి, న్యాయానికి కట్టుబడి ఉండే అసలు సిసలైన పోలీస్ లా మాత్రం ఉండలేకపోయాడు. బుధవారం ఏసీపీ నర్సింహారెడ్డికి సంబంధించిన 25 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. 

సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో ఉంటున్న ఏసీపీ ఇంట్లో, ఆయన స్వగ్రామమైన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పూల ఓబయ్యపల్లి, తెలంగాణలోని వరంగల్, యాదాద్రి భువనగిరి, జనగామ, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లోని ఏసీపీ బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.7.5 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించగా.. వాటి విలువ బయటి మార్కెట్ లో 70 కోట్ల రూపాయల వరకూ ఉండొచ్చని ఏసీబీ అంచనా. ఇంకా అతడికి సంబంధించిన బ్యాంక్ లాకర్ తెరిస్తే మరికొన్ని ఆధారాలు దొరకవచ్చని అభిప్రాయపడ్డారు అధికారులు. 

ఏసీపీ నరసింహారెడ్డి అక్రమాస్తులను కూడబెట్టేందుకు గిఫ్ట్ డీడ్ పేరిట మాయాజాలాన్ని బాగా వాడుకున్నాడు. తనకు అనుకూలంగా ఉండే వ్యక్తుల్ని బినామీలుగా మలచుకుని, 2016లో ఒకేసారి వారి పెద్దల నుంచి వారసత్వంగా ఆస్తులు వచ్చినట్లుగా గిఫ్ట్ డీడ్ లను సృష్టించాడు. ఈ మేరకు ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఆఖరికి చెట్లకు నీళ్లుపోసే వ్యక్తిని కూడా తన బినామీగా చేసుకోవడంతో నర్సింహారెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. బినామీల ఆదాయాలపై ఆరా తీసిన ఏసీబీ.. వారి ఆస్తులను చూసి విస్తుపోయింది. రూ. 15000 జీతానికి చెట్లకు నీళ్లు పోసే పనిచేసుకుంటూ బ్రతుకుతున్న ఓ వ్యక్తి పేరిట భారి ఆస్తులుండటం చూసి షాకయ్యారు. 

అనంతపురం జిల్లా పూలఓబయ్యపల్లిలో తన పేరిట సుమారు 5 ఎకరాలు, కుటుంబసభ్యుల పేరిట అదే జిల్లా మరువపల్లి అగ్రహారంలో దాదాపు 50 ఎకరాలున్నట్లు గుర్తించారు. పోలీస్ శాఖలో ఏసీపీ గా ఉంటూనే నర్సింహారెడ్డి అక్రమంగా సంపాదించిన సొమ్ముతో వివిధ వ్యాపారాలు చేసినట్లు ఏసీబీ ఎంక్వైరీలో తేలింది. పెద్దఅంబర్ పేట ప్రాంతంలోని ఒక ఎకరంలో హెటల్ పెట్టేందుకు 90 లక్షల రూపాయల రుణం తీసుకున్నట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. 

అనంతపురం జిల్లా కేంద్రంలోని నర్సింహారెడ్డి సోదరుడు నారాయణరెడ్డి నివాసంలో సైతం సోదాలు జరిగాయి. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా ఇంద్రియాలలో ఎర్ర చంద్రశేఖర్‌, అతని సోదరుడు లక్ష్మణ్ ఇళ్లల్లో, కరీంనగర్‌ జిల్లా గంగాధర ఎంపీపీ శ్రీరాం మధుకర్‌ ఇంట్లో , జనగామ జిల్లా వడ్డిచర్లలో ఏసీపీ నర్సింహారెడ్డి మామ మోతె నర్సింహారెడ్డి ఇంట్లో, రఘునాథపల్లి మండలం కుర్చపల్లిలో తిరుపతిరెడ్డి, బచ్చన్నపేట మండలం కట్కూరులో చంద్రారెడ్డి నివాసాల్లో సోదాలు చేశారు. మాదాపూర్ లోని ఓ మహిళ పేరుపై కూడా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఆమె ఏసీపీ కుటుంబానికి అతి సన్నిహితురాలని తెలుసుకున్న ఏసీబీ.. ఆమె గురించి ఆరా తీస్తున్నారు. అన్నిచోట్ల సోదాలు పూర్తయ్యాక ఏసీబీ నర్సింహారెడ్డిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తోంది. 

 

 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   8 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle