అల్లర్లు, దూషణలకు అసెంబ్లీ వేదిక కారాదు.. కేసీఆర్
05-09-202005-09-2020 12:05:07 IST
2020-09-05T06:35:07.493Z05-09-2020 2020-09-05T06:34:52.122Z - - 10-04-2021

సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వాస్తవాలు మాత్రమే చెప్పాలని, మంత్రులు సమగ్ర సమాచారంతో సిద్ధమై రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు .‘అల్లర్లు, దూషణలు, గందరగోళం, తిట్లు, శాపనార్థాలు, నిందలు, అసహనానికి శాసనసభ వేదిక కావద్దని, ఇలాంటి ధోరణికి తావు లేకుండా అసెంబ్లీ నిర్వహణలో గుణాత్మక మార్పు వచ్చి స్ఫూర్తివంతమైన చర్చలు జరగాలి’ అని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు ఆకాంక్షించారు. ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో పలువురు మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహ ణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ‘చట్టాలు రూపొందించడం, బడ్జెట్ ఆమోదం, వాటి అమలు తదితరాలపై విశ్లేషణకు అసెం బ్లీలో వాస్తవాల ఆధారంగా ప్రజలకు ఉపయోగ పడే చర్చ జరగాలి. తద్వారా ప్రజాస్వామ్యం బలోపేతమై ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు వెలువడతాయి’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘ఏ పార్టీకి చెందిన సభ్యులైనా అన్ని విషయాలను వాస్తవాలు ప్రతిబింబించేలా, క్షేత్రస్థాయి పరిస్థితికి అద్దంపట్టేలా సభలో మాట్లాడవచ్చు. వాటికి సమాధానం, వివరణ ఇచ్చేందుకు, ఆచరణాత్మక సలహాలు స్వీకరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై అసెంబ్లీలో కూలంకషంగా చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అధికారపక్ష సభ్యులు కూడా ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్నీ సభలో ప్రస్తావించాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. రాజకీయ పక్షాలు ప్రతిపాదించే అంశాలపై ఎన్ని రోజులైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చ సందర్భంగా ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు, చర్చకు వచ్చే అన్ని అంశాలపై పూర్తి సమాచారంతో మంత్రులు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి అసెంబ్లీ సమావేశాల తొలి రోజున ఘనంగా నివాళి అర్పిస్తామని సీఎం వెల్లడించారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
5 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
8 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
11 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
12 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా