newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అలెర్ట్ అయిన టీఆర్ఎస్‌.. దోస్తును దూరం కొడుతోంది..!

19-01-202019-01-2020 08:07:18 IST
Updated On 20-01-2020 16:32:59 ISTUpdated On 20-01-20202020-01-19T02:37:18.433Z19-01-2020 2020-01-19T02:36:47.265Z - 2020-01-20T11:02:59.896Z - 20-01-2020

అలెర్ట్ అయిన టీఆర్ఎస్‌.. దోస్తును దూరం కొడుతోంది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎంఐఎం పార్టీతో స్నేహం త‌మ కొంప ముంచుతుందని టీఆర్ఎస్ భ‌య‌ప‌డుతోందా ? బీజేపీ చేస్తున్న ప్ర‌చారం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో త‌మ‌ను దెబ్బ‌తీస్తుంద‌ని భావిస్తోందా ? అంటే తాజాగా టీఆర్ఎస్ మంత్రులు చేస్తున్న వ్యాఖ్య‌లు చూస్తుంటే అవున‌నే అనిపిస్తోంది. ఎంఐఎం పార్టీతో త‌మ‌కు పొత్తు లేద‌ని, ఆ పార్టీకి మున్సిప‌ల్ ఛైర్మ‌న్‌, మేయ‌ర్ ప‌ద‌వులు ఇవ్వబోమ‌ని ప‌దేప‌దే మంత్రులు చెబుతున్నారు. దీనికి కార‌ణంగా హిందూ ఓట్లు దూర‌మ‌వుతాయ‌నే అంటున్నారు విశ్లేష‌కులు.

ఎంఐఎం పార్టీతో గ‌త ఐదేళ్లుగా టీఆర్ఎస్‌కు ఒక అవ‌గాహ‌న ఉంది. రెండు పార్టీల మ‌ధ్య పొత్తు లేకుండా స్నేహ‌పూర్వ‌క పోటీ ఉంటోంది. ఎంఐఎం బ‌లంగా ఉన్న చోట్ల టీఆర్ఎస్ డ‌మ్మీ అభ్య‌ర్థుల‌ను నిల‌బెడుతోంది. ఎంఐఎం కూడా టీఆర్ఎస్ బ‌లంగా ఉన్న ప్రాంతాల్లో బ‌ల‌హీన అభ్య‌ర్థుల‌ను పోటీ చేయిస్తోంది.

తాజాగా, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీని హైద‌రాబాద్ నుంచి జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల‌కు విస్త‌రించాల‌ని ఎంఐఎం ప్ర‌య‌త్నిస్తోంది. 250కు పైగా వార్డుల్లో పోటీ చేస్తోంది ఆ పార్టీ. అవ‌కాశం వ‌స్తే కొన్ని మున్సిపాలిటీల్లో ఛైర్మ‌న్‌గిరి కూడా ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది.

ఆరు మున్సిపాలిటీల ఛైర్మ‌న్ ప‌ద‌వుల‌ను ఎంఐఎం పార్టీకి వ‌దులుకునేందుకు టీఆర్ఎస్ ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చింద‌ని, దానికి బ‌దులుగా నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్‌తో పాటు ఇత‌ర మున్సిపాలిటీల్లో ఎంఐఎం మ‌ద్ద‌తు తీసుకోవాల‌ని టీఆర్ఎస్ భావిస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. బీజేపీ ఈ ప్రచారం చేస్తోంద‌ని టీఆర్ఎస్ అనుకుంటోంది. ఇది ఆయా మున్సిపాలిటీల్లో హిందూ ఓట్లు టీఆర్ఎస్‌కు దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని టీఆర్ఎస్ గుర్తించింది. దీంతో ఆ పార్టీ అప్ర‌మ‌త్త‌మై ఎంఐఎంను దూరం కొడుతోంది.

ఎంఐఎం పార్టీకి ఛైర్మ‌న్‌గిరి వెళుతుంది అంటే ఆయా మున్సిపాలిటీల్లో హిందూ ఓట్లు కొంత‌మేర టీఆర్ఎస్‌కు దూర‌మై బీజేపీకి వెళ్లే అవ‌కాశం ఉంది. అందుకే ఎంఐఎం పార్టీకి మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వుల‌ను ఇవ్వ‌డం లేద‌ని మంత్రులు ప‌దేప‌దే ప్ర‌క‌టిస్తున్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌విని ఎవ‌రికీ ఇవ్వ‌మ‌ని, క‌చ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నుంచే మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ఉంటార‌ని జిల్లా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్ర‌క‌టించారు.

సంగారెడ్డి మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌విని కూడా ఇత‌ర పార్టీల‌కు ఇవ్వ‌మ‌ని, క‌చ్చితంగా గులాబీ జెండానే ఎగురుతుంద‌ని మ‌రో మంత్రి హ‌రీష్ రావు ఎన్నిక‌ల ప్ర‌చారంలో క్లారిటీ ఇచ్చారు. ఎంఐఎం పార్టీకి ఛైర్మ‌న్ ప‌ద‌విని వ‌దులుకోమ‌ని ఆయ‌న ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారు. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ కూడా ఈ విష‌యంలో క్లారిటీ ఇచ్చారు. ఎంఐఎం పార్టీతో త‌మ‌కు పొత్తు లేద‌ని ఆయ‌న, అన్ని మున్సిపాలిటీల్లోనూ తమ పార్టీనే గెలుచుకుంటుంద‌ని అంటున్నారు.

కాగా, భైంసాలో టీఆర్ఎస్ అభ్య‌ర్థులు పోటీ నుంచి త‌ప్పుకోవ‌డంతో ఎంఐఎం అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నికైన విష‌యాన్ని బీజేపీ ప్ర‌స్తావిస్తోంది. కానీ, ఇది స్థానిక ప‌రిస్థితుల వ‌ల్ల‌నే అని కేటీఆర్ చెబుతున్నారు. మొత్తానికి ఎంఐఎం పార్టీతో స్నేహం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో న‌ష్టం చేస్తుందా అనే భ‌యంతోనే టీఆర్ఎస్ అప్ర‌మ‌త్త‌మైన‌ట్లు క‌నిపిస్తోంది.

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   12 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   8 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   15 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle