newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అలా వైకుంఠ‌పుర‌ములో డైలాగ్‌ను చెబుతున్న టీఆర్ఎస్ మంత్రులు

05-03-202005-03-2020 12:36:22 IST
Updated On 05-03-2020 17:49:19 ISTUpdated On 05-03-20202020-03-05T07:06:22.662Z05-03-2020 2020-03-05T07:06:19.569Z - 2020-03-05T12:19:19.639Z - 05-03-2020

అలా వైకుంఠ‌పుర‌ములో డైలాగ్‌ను చెబుతున్న టీఆర్ఎస్ మంత్రులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీఆర్ఎస్ కీల‌క నేత‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా కింది స్థాయి నాయ‌కుల మ‌ధ్య ఓ రేంజ్‌లో విబేధాలు పెరిగాయా..? మ‌రీ ముఖ్యంగా జిల్లాల వారీగా మంత్రులు, మాజీ మంత్రుల మ‌ధ్య గ‌ట్టి పంచాయ‌తీ స్టార్ట్ అయిందా..? ఎప్ప‌టి నుండో పార్టీనే న‌మ్ముకుని ఉన్న నేత‌ల‌కు, మొన్న‌టి మొన్న వ‌చ్చి మంత్రులుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వారికి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌డం లేదా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు రాజ‌కీయ విశ్లేష‌కులు ప‌లు విధాలుగా చెప్పుకొస్తున్నారు. ఇంత‌కీ అధికారంలో ఉన్నా వారి మ‌ధ్య అంత‌లా విబేధాలు చోటు చేసుకోవ‌డానికి కార‌ణాలేంటి..? అన్న అంశాల‌ను ప‌రిశీలిస్తే విశ్లేష‌కులు మాత్రం ఇటీవ‌ల బిగ్ హిట్ అయిన‌ అలా వైకుంఠ‌పురములో డైలాగ్‌ను గుర్తు చేస్తున్నారు.

కాగా, టీఆర్ఎస్‌లో మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల మ‌ధ్య ఇటీవ‌ల కాలంలో గ్యాప్ పెరిగింద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న వాస్త‌వం. తెలంగాణ‌లో వ‌రుస‌గా రెండోసారి అధికారం చేప‌ట్టిన త‌రువాత ప్ర‌తిప‌క్ష పార్టీల‌ నుండి పెద్ద ఎత్తున నేత‌లు టీఆర్ఎస్ గూటికి చేరిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిప‌క్ష పార్టీల్లో ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా గెలిచిన వారు మంత్రి ప‌ద‌వుల హామీతో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుని.. అనుకున్న‌ట్టే మంత్రి ప‌ద‌వుల బాధ్య‌త‌ల‌ను కూడా చేప‌ట్టారు. ఎటువంటి ప‌ద‌వి లేకుండా టీఆర్ఎస్‌లో చేరిన‌ మ‌రికొంద‌రు కార్పొరేష‌న్ చైర్మ‌న్ల కుర్చీల‌కు ప‌రిమిత‌మ‌య్యారు.

ఇక‌పోతే, రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చాక మంత్రివ‌ర్గంలోకి కొత్త ముఖాల‌ను ఆహ్వానించారు సీఎం కేసీఆర్. ప్రారంభంలో బాగానే ఉన్నా పోను పోను జిల్లాల్లో మంత్రుల‌కు, పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌కు మ‌ధ్య ఆధిప‌త్య పోరు స్టార్ట్ అయింది. మొద‌ట‌గా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా విష‌యానికే వ‌స్తే, మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కించుకున్న ఎమ్మెల్యే ద‌యాకర్ రావుకు, అదే జిల్లాకు చెందిన‌, మ‌రో మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌కు మ‌ధ్య ప్ర‌స్తుతం ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే స్థాయికి వీరి మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల నుండి వినిపిస్తున్న టాక్.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో త‌న ప్రాబ‌వం పెంచుకునేందుకు ద‌యాక‌ర్ రావు జిల్లాలోని ఇంచు ప్ర‌దేశాన్ని కూడా వ‌ద‌ల‌కుండా మొత్తం తిరిగేస్తుండ‌టం స‌త్య‌వ‌థి రాథోడ్‌కు కాస్త ఇబ్బందిక‌రంగా మారింద‌ని, దాంతో పార్టీ అధిష్టానం వ‌ద్ద త‌న గోడు వెల్ల‌బోసుకుంద‌ని స‌మాచారం. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ ఇష్యూతోపాటు, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా రాజ‌కీయాల్లో ఎర్ర‌బ‌ల్లి ద‌యాక‌ర్‌రావు జోక్యాన్ని స‌త్య‌వ‌తి రాథోడ్ ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తుంది. దాంతో స్పందించిన పార్టీ అధిష్టానం ఎర్ర‌బ‌ల్లి ద‌యాక‌ర్‌రావును మంద‌లించ‌డంతోపాటు ఇరువురు మంత్రుల మ‌ధ్య స‌రిహ‌ద్దులు గీశార‌ట‌.

సేమ్ టు సేమ్ క‌రీంన‌గ‌ర్ జిల్లాలోనూ మంత్రుల‌కు ఇదే తీరు స‌మ‌స్య ఎదుర‌వుతోంద‌ని, అందుకు ప్ర‌ధాన కార‌ణంగా ఈ జిల్లా నుండి ఏకంగా న‌లుగురు మంత్రులు మంత్రి వ‌ర్గంలో ఉండ‌ట‌మేన‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు. అయితే, కేటీఆర్‌, కొప్పుల ఈశ్వ‌ర్‌, ఈటెల రాజేంద‌ర్‌, గంగుల క‌మ‌లాక‌ర్‌లు క‌రీంన‌గ‌ర్ జిల్లా నుండి మంత్రులుగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ను కాసేపు ప‌క్క‌న పెడితే మిగిలిన వారు మంత్రులుగా ఉన్నా వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లోనే తిర‌గాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. అస‌లే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటున్న జిల్లా కావ‌డంతో చ‌క్రం తిప్పుదామ‌నుకున్న మంత్రులు కాస్త ప‌రిధి దాటి వ్య‌వ‌హ‌రించేందుకు జంకుతున్నార‌న్న‌ది టాక్.

ఇక ఆదిలాబాద్ జిల్లా విష‌యానికొస్తే, నియోజక‌వ‌ర్గాల ఎమ్మెల్యేల‌కు, జిల్లా నుండి మంత్రిగా ఉన్న‌ ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డికి భారీగానే గ్యాప్ వ‌చ్చింది. దీంతో మంత్రికి వ్య‌తిరేకంగా ఎమ్మెల్యేలు గ్రూప్ క‌ట్టినట్టు తెలుస్తుంది. అలాగే ఖ‌మ్మం జిల్లా నుండి మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న పువ్వాడ అజ‌య్ ప‌రిస్థితీ ఇలానే ఉంది. ఎమ్మెల్యేల‌తోపాటు పార్టీ నేత‌ల నుండి వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు.  పువ్వాడ వ్య‌వ‌హార శైలిపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న వారిలో ఏకంగా మాజీ మంత్రి అయిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాసులురెడ్డి ఉన్న‌ట్టు స‌మాచారం.

న‌ల్గొండ జిల్లా విష‌యానికొస్తే ఎమ్మెల్సీ ప‌ల్లె రాజేశ్వ‌రెడ్డి, మంత్రి జ‌గదీశ్‌రెడ్డికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. జిల్లాలో రాజ‌కీయ ప్రాబ‌వం పెంచుకునేందుకు ఎవ‌రికి వారు ప్ర‌య‌త్నిస్తుండ‌టంతో పార్టీ ప‌రంగా నేత‌లు ఎవ‌రికి మ‌ద్ద‌తు తెలపాలో తెలియ‌క తేల్చుకోలేక‌పోతున్నార‌ట‌. స‌బితా ఇంద్రారెడ్డి మంత్రిగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రంగారెడ్డి జిల్లాలోనూ దాదాపుగా ఇదే సీన్ కంటిన్యూ అవుతోంది.

కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్‌లోకి రావ‌డ‌మే అస‌లు స‌మ‌స్య‌కు కార‌ణంగా స్ప‌ష్టంగా తెలుస్తుంది. ఇది కాస్తా మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్సీగా ఉన్న‌ ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డికి ఇబ్బందిక‌రంగా మారిందన్న‌ది పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ టాక్. క‌నీసం డీసీసీబీ చైర్మ‌న్ ఎన్నిక విష‌యంలోనూ త‌మ మాట‌ను పార్టీ అధిష్టానం ప‌ట్టించుకోలేద‌ని వాపోతున్నార‌ట‌ మంత్రులు. దీంతో అలా వైకుంఠ‌పురములో సినిమాలోని ఏంట్రో గ్యాప్ ఇచ్చావ్ అన్న డైలాగ్ మాదిరి తాము పార్టీ నాయ‌కులు, నేత‌ల‌కు దూరంగా ఉండ‌టం లేద‌ని, ఉండాల్సి వ‌స్తుందంటూ మీడియాకు చెప్పుకొస్తూ క‌వ‌ర్ చేసుకునే ప‌రిస్థితి మంత్రుల‌ది.

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle