newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

అరుణ్ జైట్లీ మృతికి తెలుగు ప్రముఖుల అశ్రునివాళి

24-08-201924-08-2019 17:51:16 IST
Updated On 24-08-2019 18:03:15 ISTUpdated On 24-08-20192019-08-24T12:21:16.471Z24-08-2019 2019-08-24T12:21:12.792Z - 2019-08-24T12:33:15.025Z - 24-08-2019

అరుణ్ జైట్లీ మృతికి తెలుగు ప్రముఖుల అశ్రునివాళి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీజేపీ సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ ఆకస్మిక అస్తమయం పట్ల పలువురు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, ముఖ్యమంత్రులు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని, ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అని పలువురు నేతలు అభిప్రాయడ్డారు.

Image may contain: 1 person, text

అరుణ్ జైట్లీ మరణవార్త విన్న వెంటనే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. చెన్నై పర్యటనలో ఉన్న ఆయన ఉన్నపళంగా ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.  భారత దేశం గొప్ప దార్శనికత కలిగిన మేధావిని, విలక్షణ నేతలను కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ..తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ నివాళి అర్పించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ జైట్లీ మరణ వార్త విని ఆవేదనకు గురయ్యారు. ‘‘జైట్లీ మృతి షాక్‌కు గురిచేసింది. ఆయన దేశానికి చేసిన సేవలు ఎనలేనివి. జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అన్నారు. 

విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైట్లీ ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేకపోయానన్నారు. అరుణ్ జైట్లీ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో దేశం కోసం ఎంతో సేవ చేశారని.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరుణ్ జైట్లీతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా జైట్లీ సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు.  

జైట్లీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఆయన సేవలు చిరస్మరణీయం అన్నారు రాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత సుజనా చౌదరి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్, బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ..  జైట్లీ మరణం దేశానికి, పార్టీకి తీరని లోటు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మరణం బాధాకరం. న్యాయవాదిగా, కేంద్ర మంత్రిగా ఆయన సేవలు చిరస్మరణీయం. ఆయనలో సంస్కరణాభిలాష మెండుగా కనిపించేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ నేత హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, టీటీడీపీ నేత ఎల్ రమణ పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. అనారోగ్యంతో కన్నుమూసిన అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జరగనున్నాయి.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle