newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

17-02-202017-02-2020 11:26:02 IST
Updated On 17-02-2020 12:29:55 ISTUpdated On 17-02-20202020-02-17T05:56:02.411Z17-02-2020 2020-02-17T05:55:55.208Z - 2020-02-17T06:59:55.214Z - 17-02-2020

అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ ప్రపంచానికి సత్యాగ్రహం, అహింసా అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహానుభావుడు.. ఆ అస్త్రాలను వాడటానికి కూడా ఎంతో ధైర్యం కావాలని నిరూపించిన మహోన్నత వ్యక్తిత్వం అయన సొంతం. చేత కర్రబట్టి బ్రిటీషు వారిని తరిమి కొట్టినా.. నూలు వడికి, మురికివాడలు శుభ్రం చేసినా.. అదే ఒడుపూ, అంతే శ్రద్ధ. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన బాపూ జీవితాన్ని భారత స్వాతంత్య్ర పోరాటాన్ని విడదీసి చూడలేమన్నది ప్రతి భారతీయుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.

మరి ఇప్పుడు ఎందుకు ఆ మహాత్ముని గురించి ప్రస్తావన అనుకుంటున్నారా? మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయనంత మహనీయుడని మన మంత్రులు కొందరు భజనలు చేయడంతోనే ఇప్పుడు ఆయన ప్రస్తావన తేవాల్సి వస్తుంది. ఈరోజు సీఎం కేసీఆర్ పుట్టినరోజు. ఇందుకోసం అటు టీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు గత వారం రోజులుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వంలో అయితే ఏ శాఖ పరిధిలో ఆ మంత్రి అధికారికంగానే ఆదేశాలు ఇచ్చేశారు.

అయితే, ఇందులో కొన్ని మంచి కార్యక్రమాలకు పూనుకోవడం సంతోషించదగిన విషయమే. అదేంటంటే.. కేసీఆర్ పుట్టినరోజులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా మొక్కలు నాటేందుకు నడుం బిగించారు. రాష్ట్రాన్ని హరితంగా మార్చేందుకు ఇది దోహదపడుతుంది కనుక ఇది మంచిదే. అంతేకాకుండా పలు సేవా కార్యక్రమాలకు కూడా ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నెక్ లెస్ రోడ్లో వుయ్ లవ్ కేసీఆర్ పేరు మీద భారీ హంగామా చేస్తున్నారు.

ఆదివారం నుండే మొదలైన ఈ హంగామాలో భాగంగా పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇక్కడే మీడియాతో మాట్లాడిన హోంమంత్రి మహమూద్ అలీ కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. మరో అడుగు ముందుకేసి తెలంగాణకు దేవుడిచ్చిన బహుమతి సీఎం కేసీఆర్ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ తర్వాత అంత గొప్ప నాయకుడు కేసీఆర్ మాత్రమేనని.. ఆయనకే ఆ అర్హత ఉందనడంతో అందరూ అవాక్కయ్యారు.

అంతేకాదు, దేశంలో సెక్యులర్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క కేసీఆరే మాత్రమేనని.. అందుకే అయనను యావత్ దేశం కోరుకుంటోందని చెప్పారు. కేసీఆర్ ను గాంధీతో పోల్చడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇలానే పోల్చేయడంతో ప్రతిపక్షాలు నానారాద్దంతం చేసేశాయి. అయితే, ఇప్పుడు కేసీఆర్ పుట్టినరోజున ఈ వ్యాఖ్యలపై ఎంతవరకు స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.

ఈమధ్య కాలంలో టీఆర్ఎస్ పార్టీలో ఈ భజన కార్యక్రమాలు ఎక్కువగానే వినిపిస్తుండగా ఇంతస్థాయిలో వినిపించడం ఆసక్తిగా మారింది. కేసీఆర్ గొప్ప నాయకులే కావచ్చు.. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆయన ఉన్నత శిఖరంలానే కనిపించవచ్చు. అయితే, మహాత్మునితో పోల్చడం ఎంతవరకు సమంజసమన్నది ఆ పార్టీ నేతలు ఒకసారి ఆలోచించుకోవాలేమో!

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   17 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   15 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   20 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle