newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

14-08-202014-08-2020 09:14:05 IST
2020-08-14T03:44:05.458Z14-08-2020 2020-08-14T03:43:25.545Z - - 19-04-2021

అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పేదరికం ముందు అన్నీ ఓడిపోతాయి. బంధాలు, అనుబంధాలు, పేగుబంధాలు, ఆప్యాయతలు అన్నీ తలవంచాల్సిందే.పేగు బంధాన్నే అమ్మకానికి పెట్టింది ఓ తల్లి. నవ మాసాలు మోసి కని పెంచిన క‌న్న‌బిడ్డ‌ను మ‌ద్యం కోసం అమ్మ‌కానికి పెట్టింది ఓ క‌నిక‌రంలేని త‌ల్లి. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ మహానగరంలో జ‌రిగింది. 

రెండు నెలల క్రితం జన్మనిచ్చిన బాబును రూ.45 వేలకు అమ్మానికి పెట్టింది. దీంతో పోలీసులు ప‌క్కా స‌మాచారంతో కేసును ఛేదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

గోషామహల్‌ ఏసీపీ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎంఎస్‌ మక్తాకు చెందిన అబ్దుల్‌ ముజాహిద్‌, షేక్‌ జోహాఖాన్‌ దంపతులు ఇటీవల హబీబ్‌నగర్‌ పరిధిలోని సుభాన్‌పురాకు మకాం మార్చారు. వీరికి రెండు నెలల క్రితం కుమారుడు జన్మించాడు.

మద్యం తాగే అలవాటున్న జోహాఖాన్ ఆమె భర్తతో తరుచు గొడవ జరిగేది. ఇదిలావుంటే, ఈనెల 3న ముజాహిద్‌ బంధువుల ఇంటికి వెళ్లాడు. 8వ తేదీన తిరిగి ఇంటికి రాగా కొడుకు కనిపించలేదు. 

భార్యను నిలదీయగా సుభాన్‌పురాకు చెందిన షేక్‌ మహమ్మద్‌(30), తబస్సుం (25)లకు రూ.45వేలకు అమ్మేసినట్లు భార్య ఒప్పుకుంది. తన కొడుకును వెంటనే ఇవ్వాలని ముజాహిద్‌ కోరినా వారు అంగీకరించకపోవడంతో ముజాహిద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

చంచల్‌గూడకు చెందిన ఆయేషా జబీన్‌(28)కి సంతానం లేకపోవడంతో.. అదే ప్రాంతానికి చెందిన షేక్‌ మహమ్మద్‌, తబస్సుంల ద్వారా బాబు(2 నెలలు) విషయం తెలుసుకుంది.ఆగాపురా, సుభాన్‌పురాకు చెందిన ఆయేషాజబీన్‌ తల్లి షమీమ్‌ బేగం, పెద్దమ్మ సిరాజ్‌బేగంలు రూ.45 వేలకు బాబును విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నారు. డబ్బులు చెల్లించి ఆయేషా జబీన్ పిల్లాడిని తీసేసుకుంది. కాగా, కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆయేషా ఇంటిపై దాడి చేసి బాబును తీసుకుని తండ్రికి అప్పగించారు.

ఆయేషా జబీన్‌, జోహాఖాన్‌, షేక్‌ మహమ్మద్‌, తబస్సుం, షమీమ్‌ బేగం, సిరాజ్‌ బేగంలను అరెస్టు చేశారు. కేసును ఛేదించిన పోలీసులను ఏసీపీ అభినందించారు.

 

 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   an hour ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   an hour ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   5 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   7 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   2 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   9 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   9 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   2 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   4 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   10 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle