అమృత తండ్రి చివరకు సాధించిందేమిటి?
09-03-202009-03-2020 14:48:48 IST
Updated On 09-03-2020 15:38:15 ISTUpdated On 09-03-20202020-03-09T09:18:48.529Z09-03-2020 2020-03-09T09:18:45.228Z - 2020-03-09T10:08:15.384Z - 09-03-2020

కులంపరువు కోసం, కుటుంబం పరువు కోసం కన్న కూతురి వైవాహిక జీవితాన్ని ఘోరంగా భంగపరిచి, కుమార్తె భర్తను ఆమె కళ్ల ఎదురుగానే దారుణంగా నరికించి చంపి కోర్టు విచారణలో గడుపుతున్న మారుతిరావు తన కులానికి, తన కుటుంబానికి, తన పరువుకు కూడా దూరమై విగతజీవిగా మిగిలారు. కుమార్తె తన మాట కాదని కులాంతర వివాహం చేసుకుందని, అదీ ఒక దళిత యువకుడిని ప్రేమించి ధిక్కరించి మరీ కుటుంబానికి దూరమైందన్న బాధతో, కసితో కోటి రూపాయల సుఫారీ చెల్లించి మరీ కుమార్తె భర్తను చంపించిన కేసులో ఇరుక్కున్న మారుతిరావు సరిగ్గా ఒకటన్నర సంవత్సరం కాకముందే తన జీవితాన్ని అంతం చేసుకున్నారు. కన్న కుమార్తె జీవితానికి తూట్లు పెట్టిన కన్నతండ్రికి చివరకు మిగిలిందేమిటి? కులం, కుటుంబం, పరువు, సమాజం, ఆప్తులు ఎవరూ తనకు మిగలని విషాద పరిస్థితుల్లో కన్న కుమార్తె ఆశలను చిదిమేసిన క్షణికావేశం.. చివరకు కన్నతండ్రిని కూడా బలిగొంది. ఇప్పుడు మిగిలిన ఒకే ఒక ప్రశ్న.. చివరకు మిగిలింది ఏది? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దళిత యువకుడు ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో గదిని అద్దెకు తీసుకున్న ఆయన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని చింతల్‌బస్తీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మారుతీరావు స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న మారుతీరావు అల్లుడు ప్రణయ్‌ని కిరాయి హంతక ముఠాతో దారుణంగా హత్య చేయించారని ఆరోపణలు ఉన్నాయి. 2018 సెప్టెంబర్ 14న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ హత్య జరిగింది. గర్భిణిగా ఉన్న భార్య అమృతతో పాటు ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేసి ప్రణయ్‌ను హత్య చేశారు. ఈ కేసులోమారుతీరావు జైలుపాలయ్యారు. ఇటీవల బెయిల్‌పై బయటికి వచ్చారు. ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తి తన పేరున రాస్తానని మధ్య వర్తులతో అమృతకు రాయబారం కూడా పంపారు. కాగా, ఆరు నెలల క్రితం విడుదల అయిన మారుతీరావు.. ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. సంఘటనా స్థలం నుంచి పాయిజన్ బాటిల్, సూసైడ్ నోట్‌ను వారు స్వాధీనం చేసుకున్నారు. మారుతీరావు రాసినట్లుగా భావిస్తున్న ఆ సూసైడ్ నోట్లో ‘‘ గిరిజ క్షమించు.. తల్లి అమృత అమ్మ దగ్గరికి వెళ్లిపో’ అని రాసి ఉంది. ప్రణయ్ హత్య కేసులో ఏ1నిందితుడిగా ఉన్న మారుతీరావుకు కోర్టు కొద్దినెలల క్రితం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ హత్య కేసుకు సంబంధించి విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో గదిని అద్దెకు తీసుకున్న మారుతీరావు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రణయ్ హత్య కేసు ట్రయల్ చివరి దశకు రావడంతో మారుతీరావు టెన్షన్‌కు గురైనట్లు తెలుస్తోంది. దీనికి తోడు నల్గొండలో అడ్వకేట్లు ఆయనకు సపోర్ట్ చేయలేదు. దీంతో అడ్వకేట్‌ను కలవటానికి శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. నల్గొండలో కేసు అనుకూలంగా రాకపోయినా హైకోర్ట్‌కు వెళదామనే ఆలోచనలో ఉన్న ఆయన సరైన న్యాయవాదులు అండగా లేకపోవడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వచ్చే సమయంలో కూడా ఆయన వెంట ఓ అడ్వకేట్ ఉన్నట్లు తెలుస్తోంది. మిత్రుడికి చెందిన ఓ ఫర్టిలైజర్ షాపులోనే మారుతీరావు పాయిజన్ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కేసు విషయంలో కూతురు కూడా తనకు సపోర్ట్ చేయట్లేదనే మనోవేదనలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యపై ఆయన కూతురు అమృత స్పందించారు. మారుతీరావు మరణవార్త అఫిషియల్‌గా తమకు సమాచారం లేదని తెలిపారు. నాన్న ఆత్మహత్య చేసుకున్నాడన్న సంగతి టీవీలో చూసే తెలుసుకున్నామని అమృత తెలిపారు. ప్రణయ్ హత్య జరిగిన తర్వాతినుంచి తండ్రి తనతో టచ్‌లో లేడని పేర్కొన్నారు. ప్రణయ్‌ను చంపిన పశ్చాత్తాపంతోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అభిప్రాయపడ్డారు. అయితే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మారుతీరావు మరణంపై పోలీసులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆయనది హత్యా?... ఆత్మహత్యా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశారు. ఇక మారుతీరావు గదిలో ఆత్మహత్య ఆనవాళ్లు లభించలేదు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలోనూ ఎలాంటి ఆనవాళ్లు బయటపడలేదు. మరోవైపు ఆయన బస చేసిన గదిలో పాయిజన్ కానీ పురుగుల మందు డబ్బా కానీ పోలీసులకు లభించలేదు. శనివారం సాయంత్రం 6.50 నుంచి 9 గంటల వరకూ ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
12 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
7 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
12 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
15 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
16 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
17 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
19 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
20 hours ago
ఇంకా