newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

అమృతకు చేదు అనుభవం.. కూతురికి దక్కని తండ్రి చివరిచూపు

09-03-202009-03-2020 13:16:00 IST
Updated On 09-03-2020 16:55:17 ISTUpdated On 09-03-20202020-03-09T07:46:00.556Z09-03-2020 2020-03-09T07:45:58.785Z - 2020-03-09T11:25:17.924Z - 09-03-2020

అమృతకు చేదు అనుభవం.. కూతురికి దక్కని తండ్రి చివరిచూపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎంత కసాయి వాడైనా కన్నతండ్రిని కడసారి చూసేందుకు పోలీసు భద్రత నడుమ స్మశానవాటిక వద్దకు వెళ్లిన అమృతాప్రణయ్‌కు నిరాశే మిగిలింది. మారుతీరావు బంధువులు, స్థానికులు ‘అమృత గో బ్యాక్‌’ అంటూ పెద్ద  ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రణయ్‌ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు వాహనంలో వచ్చిన అమృత.. వాహనం దిగి తండ్రి భౌతికకాయం వద్దకు వెళ్తున్న క్రమంలో.. ఆమెకు వ్యతిరేకంగా స్థానికులు, కుటుంబ సభ్యులు, బంధువులు నినాదాలు చేశారు. 

తండ్రి చావుకు కారణమైన ‘అమృత గో బ్యాక్‌’, ‘మారుతీరావ్‌ అమర్‌ రహే’ అంటూ అడ్డుకున్నారు. పోలీసుల సూచనమేరకు తండ్రిని చివరి చూపు చూడకుండానే ఆమె వెనుదిరిగి వచ్చేశారు. పోలీస్ ఎస్కార్ట్ మధ్య స్మశాన వాటికకు చేరుకోనున్న అమృత తండ్రిని చూసేందుకు ప్రయత్నించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి మారుతీరావు మృతదేహం ఇంటికి చేరుకుంది. అక్కడినుంచి అంతిమయాత్ర నల్గొండ హిందూ స్మశాన వాటికకు చేరుకుంది.  

తిరునగరి మారుతీరావు కూతురు అమృత-ప్రణయ్ కులాంతర ప్రేమవివాహం చేసుకున్నారు. కూతురిని తనకు కాకుండా చేశాడని, ప్రేమ వివాహం చేసుకున్నాడని ప్రణయ్‌ని దారుణంగా హత్యచేయించినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవనంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రణయ్‌ను హత్య చేయించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతీరావు.. బలవన్మరణానికి పాల్పడటం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రణయ్‌ హత్య అనంతరం జైలుకు వెళ్లిన మారుతీరావు గత ఏడాది ఏప్రిల్‌ 28న బెయిల్‌పై విడుదల అయ్యాడు.

ఆ తర్వాత తన వ్యాపారాలను చక్కబెట్టుకోవడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నాడు. తన కూతురు అమృతను తన వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు కొనసాగించాడు. అయితే అమృత వాటిని తిరస్కరించింది. అత్తగారింట్లోనే ఆమె ఉంటోంది.  ఓవైపు కూతురు దూరమై.. ఇప్పుడు భర్త కూడా శాశ్వతంగా తనను వదిలిపోవడంతో మారుతీరావు భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. తన తండ్రిని చూడాలని అమృత భావిస్తే, తానేమీ అడ్డుకోబోనని, ఈ విషయంలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని మారుతీరావు సోదరుడు శ్రవణ్ వివరణ ఇచ్చారు. కానీ స్థానికుల నినాదాలతో అమృతకు తండ్రి కడసారి చూపు కూడా దక్కలేదు. 

 

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   3 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   7 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   10 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   10 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   11 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   13 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   14 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   14 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   14 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle