newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అమీన్ పూర్ ఎన్నికల్లో సత్తా చాటిన భార్యాభర్తలు

26-01-202026-01-2020 10:22:47 IST
Updated On 26-01-2020 10:26:33 ISTUpdated On 26-01-20202020-01-26T04:52:47.084Z26-01-2020 2020-01-26T04:52:30.637Z - 2020-01-26T04:56:33.076Z - 26-01-2020

అమీన్ పూర్ ఎన్నికల్లో సత్తా చాటిన భార్యాభర్తలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసలు పార్టీయే లేదని, తెలుగుదేశం చిరునామా ఎక్కడ అని అడిగేవారికి సమాధానం చెప్పారు భార్యాభర్తలు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో 21మరియు 22వార్డు లలో తెలుగుదేశం పార్టీ గెలిచి తన సత్తా చాటింది. అమీన్ పూర్ పురపాలక  సంఘం ఎన్నికలు  ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన భార్యాభర్తలు రెండుచోట్ల గెలిచారు. ఎడ్ల రమేష్  21 వ వార్డు నుండి గెలుపొందగా..ఎడ్ల సంధ్య  22 వ వార్డు నుండి గెలుపొందారు. భార్యాభర్తలు ఇద్దరు రెండువార్డులలో పోటీచేసి గెలవడంతో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

రాష్ట్రమంతా గులాబీ జెండా హవా నడిస్తే అమీన్ పూర్ లో మాత్రం పసుపు జెండా రెపరెపలాడింది. పటన్ చెరు నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది అమీన్ పూర్ మునిసిపాలిటీ. ఇక్కడ కౌన్సిలర్ల స్థానాలరకు పోటాపోటీగా ఎన్నికలు జరిగాయి. టీఆర్ఎస్ నేతలు హోరాహోరీగా ప్రచారం చేసినా.. టీడీపీ అభ్యర్ధులు రెండుచోట్ల గెలవడం విశేషంగా చెబుతున్నారు. మొత్తం 25 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. టీటీడీపీ అధ్యక్షుడు రమణ అమీన్ పూర్ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని ఎన్నికలకు ముందే ధీమా వ్యక్తం చేశారు.భార్యభర్తలు రమేష్, సంధ్య గెలవడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. అభివృద్ధిలోనూ మునిసిపాలిటీ ముందుంచేందుకు కృషిచేస్తామని వారు చెబుతున్నారు. 

 

 

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   17 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle