newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అమరావతికి సపోర్ట్.. తెలంగాణ కాంగ్రెస్ నేత సంచలనం

12-01-202012-01-2020 10:11:50 IST
Updated On 13-01-2020 12:47:59 ISTUpdated On 13-01-20202020-01-12T04:41:50.260Z12-01-2020 2020-01-12T04:41:43.097Z - 2020-01-13T07:17:59.826Z - 13-01-2020

అమరావతికి సపోర్ట్.. తెలంగాణ కాంగ్రెస్ నేత సంచలనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీకి రాజధానిగా వున్న అమరావతిని కాదని విశాఖలో పరిపాలనా కేంద్రం, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేసేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సేవ్ అమరావతి నినాదాలు మిన్నంటుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతి మార్పును వ్యతిరేకిస్తూ రైతులు, మహిళలు చేస్తున్న పోరాటంలో తాను కూడా పాల్గొంటానని తెలంగాణ కాంగ్రెస్ నేత ప్రకటించి సంచలనం రేపారు. 

అమరావతిలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు, మహిళలు చేపడుతున్న ఉద్యమాన్ని తాను చూశానని, త్వరలో తానూ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని ప్రకటించారు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. గతంలో ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రకటనతో సీఎం జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్నారు.

ఉద్యమకారులపట్ల పోలీసులు బాధ్యతతో వ్యవహరించాలన్నారు. కేంద్రం వెంటనే కల్పించుకుని పెద్దన్న పాత్రను పోషించాలని దయాకర్ కోరుతున్నారు. బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ ఒకే తానులోని ముక్కలేనన్నారు. అమరావతి పరిరక్షణ సమితి, జేఏసీ ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకు తీసికెళ్లాలని సూచించారు. ప్రశాంతంగా ఉండే అమరావతి ప్రాంతం ఉద్రిక్తంగా మారిందన్నారు. 

 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle