newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

‘అబ్దుల్లాపూర్‌మెట్’ ఘటన.. రైతు ఆగ్రహం... నలుగురు బలి

04-12-201904-12-2019 10:00:27 IST
Updated On 04-12-2019 10:02:08 ISTUpdated On 04-12-20192019-12-04T04:30:27.257Z04-12-2019 2019-12-04T04:29:16.022Z - 2019-12-04T04:32:08.629Z - 04-12-2019

‘అబ్దుల్లాపూర్‌మెట్’ ఘటన.. రైతు ఆగ్రహం... నలుగురు బలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో కార్యాలయం రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ కార్యాలయంలో తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం కేసు సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో తాహశీల్దార్ ని కాపాడబోయిన డ్రైవర్, అటెండర్ కూడా చనిపోవడంతో మృతుల సంఖ్య మూడుకి పెరిగింది.

ఈ ముగ్గురితో పాటు నిందితుడు సురేష్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీవో ఆసుపత్రిలో గత నెలరోజులుగా చంద్రయ్య చికిత్స పొందుతున్నాడు. గుండెపోటుతో కన్నుమూశాడు అటెండర్.  దీంతో ఒక్క చిన్న సంఘటన నలుగురిని బలితీసుకుంది. నిందితుడు సురేష్ తీసుకున్న నిర్ఱయమే ఈ విషాదానికి కారణమయింది. 

నవంబర్ 4వ తేదీన అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వోగా ఉన్న విజయా రెడ్డి పై సురేష్ అనే రైతు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. విజయారెడ్డితో పాటు ఆమె డ్రైవర్, రైతు సురేష్ ప్రాణాలు కోల్పోయారు. తన భూమికి చెందిన పాస్ పుస్తకాల విషయంలో ఆగ్రహానికి గురైన రైతు సురేష్ ఎమ్మార్వోపై దాడికి ప్లాన్ చేశాడు.

మధ్యాహ్నం సమయంలో ఎవరూ ఉండరని భావించాడు. వెంటనే తన ప్లాన్ అమలుపరిచాడు. ఎమ్మార్వో విజయా రెడ్డితో చర్చించేందుకు లోపలికి వెళ్లి తనతో తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న డ్రైవర్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా అతనికి మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదం లో విజయా రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

ఈ సంఘటనకు బాధ్యుడైన రైతు సురేష్, డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన రెవెన్యూ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. దీంతో ఎమ్మార్వో కార్యాలయం మూతబడింది.

విజయా రెడ్డి పై దాడి ఘటనతో తెలుగు రాష్ట్రాల్లోని రెవిన్యూ అధికారులు హడలిపోయారు. అడపదడపా ఇలాంటి ఘటనలు జరిగాయి. దీంతో రెవిన్యూ కార్యాలయాలకు ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. చాలాకాలం మూసివేసిన అబ్దుల్లాపూర్ మెట్ కార్యాలయం ఈమధ్యే తెరుచుకుంది. కానీ విజయారెడ్డి ఘటన తాలూకు చేదు గురుతులు మాత్రం అక్కడి సిబ్బందిని కలవరపెడుతున్నాయి. ఒక్క రైతు దూకుడుకి అతనితో పాటు నలుగురు బలయ్యారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle