newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

‘అప్పుల్లో ఉందని తెలంగాణను అమ్మేస్తారా?’

05-11-201905-11-2019 09:11:18 IST
Updated On 05-11-2019 16:24:04 ISTUpdated On 05-11-20192019-11-05T03:41:18.953Z05-11-2019 2019-11-05T03:40:40.561Z - 2019-11-05T10:54:04.645Z - 05-11-2019

‘అప్పుల్లో ఉందని తెలంగాణను అమ్మేస్తారా?’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై ఇటు ఆర్టీసీ జేఏసీ-విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానం అంటున్నారు కేసీఆర్.

ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ వైపు ఆయన అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. 5100 బస్సుల పర్మిట్లకు రంగం సిద్ధం అవుతోంది. కేసీఆర్ తీరుని నిశితంగా విమర్శిస్తోంది టీపీసీసీ. ఈమేరకు ఆ పార్టీ నేతలు కేసీఆర్ పతనానికి నాంది పడుతోందని అంటున్నారు. 

ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడం తప్పదని నొక్కి వొక్కాణిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి గట్టి కౌంటరిచ్చారు. నష్టాల్లో ఉన్నందుకు ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేటట్టు అయితే, ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆర్థిక శాఖను కూడా ప్రైవేటు పరం చేయాలని ఆమె సూచించారు. తెలంగాణ ప్రజలందరూ ఇదే మాట అనుకుంటున్నారని.. కేసీయార్ కూడా అదే పనిచేస్తే బాగుంటుందన్నారు. 

మీకు వర్తించని ఆర్థిక సూత్రాలు ఆర్టీసీకి మాత్రమే వర్తించాలని భావించడం దొరల నిరంకుశత్వం కాదా అని విజయశాంతి ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని కేసీఆర్ ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని... సమ్మె విషయంలో తాత్సారం చేశారని విమర్శించారు.

ఆర్టీసీ కార్మిక సంఘాలకు కేసీఆర్ చెబుతున్న ఆర్థిక క్రమశిక్షణ తెలంగాణ ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందన్నారు విజయశాంతి. మిగులు బడ్జెట్‌తో మొదలైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు నిండా అప్పుల్లో మునిగిందని ఆమె విమర్శించారు. 

మరో నేత మల్లు భట్టి విక్రమార్క తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రెండోసారి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారని, కేబినెట్‌ సమావేశం అనంతరం ఆర్టీసీపై ఆయన మాటలు వింటే ఆ విషయం అర్థమవుతోందని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆర్టీసీ కార్మికుల మరణాలకూ, ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. 

రాష్ట్రాన్ని దివాలా తీయించారని, ప్రైవేటీకరణ మంత్రం పఠిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడే అతిపెద్ద కార్పొరేషన్‌ అయిన ఆర్టీసీని ప్రభుత్వం నడపలేకపోతోందని, రాష్ట్రాన్ని అప్పుల మయం చేస్తోందని విమర్శించారు.  రూ.3లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్‌.. రానున్న మూడేళ్లలో మరో రూ.3 లక్షల కోట్ల అప్పులు చేయబోతున్నారని ఆరోపించారు. ఇవాళ ఆర్టీసీ- రేపు  సింగరేణినీ అమ్మకానికి పెట్టినా ఆశ్చర్యం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   5 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   5 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   8 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   8 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   9 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   10 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   12 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   13 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   13 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle