newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

అన్న‌ను కూడా ఇరికిస్తున్న త‌మ్ముడు

21-07-201921-07-2019 10:09:59 IST
Updated On 22-07-2019 12:46:25 ISTUpdated On 22-07-20192019-07-21T04:39:59.411Z21-07-2019 2019-07-21T04:39:46.146Z - 2019-07-22T07:16:25.410Z - 22-07-2019

అన్న‌ను కూడా ఇరికిస్తున్న త‌మ్ముడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెబ‌ల్ నేత‌గా ముద్ర ప‌డ్డ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఎట్ట‌కేల‌కు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఇంత‌కాలం ర‌క‌ర‌కాల ప్ర‌క‌ట‌న‌ల‌తో కాంగ్రెస్‌లో ఉంటారా లేదా బీజేపీలోకి వెళ‌తారా అనే డైలామాలో ఉన్న ఆయ‌న ఇప్పుడు త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు సంబంధించిన నిర్ణ‌యం తీసేసుకున్నారు. త్వ‌ర‌లోనే భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

అయితే, పార్టీనే వేటు వేస్తే, తన ఎమ్మెల్యే ప‌ద‌వికి ఎట‌వంటి ఢోకా ఉండ‌ద‌ని ఆయ‌న భావిస్తున్నారు. పార్టీ నాయ‌క‌త్వంపై ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా పార్టీ అధిష్టానం మాత్రం ఆయ‌న‌పై వేటు వేయ‌డం లేదు.

దీంతో త‌న మాట‌ల‌కు మ‌రింత ప‌దును పెట్టారు. బీజేపీలోకి చేరుతున్నాన‌ని, బీజేపీనే టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయ‌మ‌ని మ‌రో నొక్కి చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే త‌న‌కు అభిమానం అని చెబుతూనే కాంగ్రెస్ మునికిపోయే ప‌డ‌వ అని చెప్పారు.

అయితే, పీసీసీ ప‌ద‌విని ఆశించిన రాజ‌గోపాల్ రెడ్డి తిరుగుబాటును తేలిగా తీసుకుంటుంది అధిష్ఠానం. గ‌తంలో మాదిరిగానే కొన్ని రోజుల త‌ర్వాత ఆయ‌న సైలెంట్ అవుతార‌ని, పార్టీలోనే కొన‌సాగుతార‌ని భావిస్తోంది.

అన‌వ‌స‌రంగా వేటు వేస్తే ఆయ‌న హాయిగా బీజేపీ ఎమ్మెల్యేగా కొన‌సాగుతారు, కాబ‌ట్టి పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌కుండా ఆయ‌న బీజేపీలోకి వెళ్ల‌గానే అన‌ర్హ‌త వేటు వేయించాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది.

అయితే, రాజ‌గోపాల్ రెడ్డి వెళుతూ వెళుతూ త‌న అన్న వెంక‌ట్‌రెడ్డిని సైతం ఇరికిస్తున్నారు. త‌న‌తో పాటు త‌న అన్న కూడా బీజేపీలోకి వ‌స్తార‌ని చెబుతున్నారు.

దీంతో వెంక‌ట్‌రెడ్డిని సైతం కాంగ్రెస్ నేత‌లు అనుమాన‌పు చూపులు చూస్తున్నారు. ఆయ‌న కూడా పార్టీ మార‌తారా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

దీంతో వెంక‌ట్ రెడ్డి ప‌దేప‌దే తాను పార్టీ మార‌న‌ని, చివ‌రి శ్వాస వ‌ర‌కు కాంగ్రెస్‌లోనే ఉంటాన‌ని క్లారిటీ ఇచ్చుకుంటున్నారు. వాస్త‌వానికి, పీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి. రాజ‌గోపాల్ రెడ్డి పార్టీ మారుతుండ‌టం వెంక‌ట్‌రెడ్డిని ఈ రేసులో కొంత వెన‌క్కు నెట్టింది.

తాజాగా రాజ‌గోపాల్ రెడ్డి వ్యాఖ్య‌ల‌తో వెంక‌ట్ రెడ్డికి ఈ ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశాలు స‌న్నిగిల్లే అవ‌కాశం ఉంది. దీంతో రాజ‌గోపాల్ రెడ్డి త‌న గురించి కూడా ప్ర‌క‌టించ‌గానే వెంక‌ట్ రెడ్డి వెంట‌నే ఖండించాల్సి వ‌చ్చింది. ప‌దేళ్లుగా అన్న‌ద‌మ్ముల‌ది ఒక్క మాట‌గా సాగిన రాజ‌కీయం ఇప్పుడు బేధాభిప్రాయాల‌తో న‌డుస్తోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle