newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

28-05-202028-05-2020 19:09:46 IST
Updated On 29-05-2020 09:22:40 ISTUpdated On 29-05-20202020-05-28T13:39:46.206Z28-05-2020 2020-05-28T13:39:39.955Z - 2020-05-29T03:52:40.712Z - 29-05-2020

 అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ  కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గజ్వేల్ నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష. ఉమ్మడి జిల్లా ఆకాంక్ష నెరవేరబోతున్నదని, 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండ పోచమ్మ సాగరుకు నీటిని ఎత్తిపోసే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ఐఓసీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 

అన్ని పండుగల సమూహారం రేపటి పెద్ద జల పండుగ అన్నారు. మే 29 చరిత్రలో ఎప్పుడూ నిలబడే రోజు. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని సాదాసీదాగా జరుపుతున్నాం అని కరోనా లేకపోతే.. లక్షలాది ప్రజల మధ్య జరుపుకునేవాళ్ళం అన్నారు హరీష్ రావు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలు హాజరుకానున్నారని తెలిపారు. వీరితో పాటు సిద్ధిపేట, మెదక్, యాదాద్రి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లు పాల్గొంటారని పేర్కొన్నారు. 

కొండ పోచమ్మ దేవాలయంలో ఉదయం వేకువజామున 4.30 గంటలకే చండీ యాగం ప్రారంభం అవుతుందని, గ్రామ సర్పంచ్ రజిత- రమేశ్, కొండ పోచమ్మ దేవాలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి చండీ హోమం నిర్వహిస్తారని., సీఎం కేసీఆర్ గారు సతీ సమేతంగా ఉదయం 7 గంటలకు చేరుకుని అమ్మవారికి జరిపే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి నిర్వహించి వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. 

ఆ తర్వాత ఉదయం 9.35 గంటలకు ఎర్రవల్లిలో రైతు వేదికకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఉదయం 9.40 గంటలకు మర్కుక్ లోని రైతు వేదికకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఉదయం 9.50 నిమిషాలకు సీఎం మర్కుక్ పంప్ హౌస్ చేరుకుంటారు. మర్కుక్ పంప్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ వద్దకు చేరుకునే త్రిదండి చినజీయర్ స్వామి వారి వద్దకు 10 గంటల సమయంలో సీఎం చేరుకుంటారు. త్రిదండి చినజీయర్ స్వామిని సీఎం కలిసి మర్కుక్ పంప్ హౌస్ వద్ద సుదర్శన హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం దంపతులు పాల్గొంటారు.  సుదర్శన హోమం, పూర్ణాహుతి ముగిసిన తర్వాత 11.30 గంటల సమయంలో పంప్ హౌస్ ను సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత చినజీయర్ స్వామితో కలిసి కొండ పోచమ్మ సాగర్ కట్ట మీద డెలివరీ సిస్టమ్ దగ్గరకు చేరుకుంటారు. 

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిమిత ప్రజా ప్రతినిధులకు మాత్రమే ఆహ్వానం ఉంది. ఇది జల పండుగ లక్షలాది ప్రజలతో జరువుకోవాలి. కానీ కరోనా వల్ల ఆహ్వానించలేక పోతున్నామన్నారు. కరోనా ముగిసిన తర్వాత పెద్ద పండుగ చేసుకుందాం అన్నారు మంత్రి హరీష్ రావు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులను మాత్రమే ఆహ్వానిస్తున్నామని, మనమంతా కలిసి జరుపు కోవాల్సిన జల పండగ కానీ., కరోనా నేపథ్యంలో ఇది సాధ్యం కాలేదన్నారు. రేపు ముఖ్యమంత్రి కేవలం ప్రారంభిస్తారు. శనివారం  అనంతరం ప్రజలు ఎవరైనా వచ్చి సామాజిక దూరాన్ని పాటిస్తూ కొండపోచమ్మ రిజర్వాయర్ సందర్శించవచ్చన్నారు. 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   9 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   14 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   11 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   15 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   13 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   19 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle